SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ప్రైవేట్ జాబ్స్ చేసేవారికి గుడ్ న్యూస్? వేతనంతో కూడిన పితృత్వ సెలవులు..!!

Gender Neutral Child Care Leave: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు కుటుంబ బాధ్యతల్లో ఊరటనిచ్చేలా జాతీయ మహిళా కమిషన్ (NCW) కేంద్ర ప్రభుత్వానికి అత్యంత కీలకమైన సిఫార్సులను అందజేసింది. పిల్లల సంరక్షణ.. పెంపకం అనేది కేవలం తల్లుల బాధ్యత మాత్రమే కాదని, అందులో తండ్రులకూ సమాన భాగస్వామ్యం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ కంపెనీలలోనూ 'జెండర్ న్యూట్రల్ చైల్డ్ కేర్ లీవ్' (Gender Neutral Child Care Leave) విధానాన్ని తీసుకురావాలని కమిషన్ ఆ నివేదికలో సూచించింది.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 03, 2026, 01:44 PM IST | Updated: Oct 03, 2026, 01:45 PM IST
Image Credit: Gender Neutral Child Care Leave
Join

Gender Neutral Child Care Leave: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న తల్లిదండ్రులకు శిశు సంరక్షణ సెలవులు పొందు విధానాన్ని దశలవారీగా అమలు చేయాలని జాతీయ మహిళా కమిషన్ కేంద్రానికి సిఫార్సు చేసింది. దీనిని మొదట  భారీ పరిశ్రమల్లో ప్రవేశపెట్టి..అనంతరం మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు విస్తరించాలని పేర్కొంది. ముఖ్యంగా అసంఘటిత రంగాలు, గిగ్, ఇతర ఫ్లాట్ ఫామ్స్ లో పనిచేస్తున్న వారందరికీ ఈ ప్రయోజనం వర్తింపజేయాలని కమిషన్ సూచించింది. సామాజిక భద్రత కోడ్ లో శిశు సంరక్షణ సెలవులు అంతర్భాగంగా మార్చి ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకునే విషయంలో ప్రైవేట్ ఉద్యోగులకు చట్టబద్ధమైన భద్రత కల్పించాలని కమిషన్ సిఫార్సు చేసింది. పిల్లల సంరక్షణ కోసం మంచి విధానాలు అమలు చేస్తున్న యాజమాన్యాలకు పన్ను రాయితీలతోపాటు ఆర్థిక ప్రోత్సాహకాలను కూడా అందించాలని పేర్కొంది.  దీనికోసం ప్రభుత్వాలు, యాజమాన్యాలు, ఉద్యోగులు కలిసి ఒక సంయుక్త నిధిని ఏర్పాటు చేయవచ్చంటూ సూచించింది. తల్లీబిడ్డ సరంక్షణకు 9 ముఖ్యమైన అంశాలపై 37 సిఫార్సులతో కూడిన రిపోర్టును కార్మిక ఉపాధి కల్పన శాఖలతోపాటు కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాలు, మహిళా శిశు అభివ్రుద్ధి శాఖకు అందించింది.

ఇక శిశు సంరక్షణకు 730 రోజుల సెలవులను పేరెంట్స్ షేర్ చేసుకునేందుకు వీలు కల్పించాలని మహిళా కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ సెలవులు ఉపయోగించుకునేందుకు మహిళలకు మాత్రమే వీలు కల్పించడం వల్ల శిశు సంరక్షణ బాధ్యత పూర్తిగా వారిపైనే ఉంటోంది. ఈ బాధ్యతను పంచుకునేందుకు తల్లిదండ్రులు ఇద్దరు లేదంటే ఒకరు కానీ ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించాలని కోరింది.  చెరో 365 రోజుల చొప్పున తీసుకువచ్చేందుకు లేదంటే 60:40నిష్పత్తిలో పంచుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ సూచించింది.

కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగాలంటే శిశు సంరక్షణకు సంబంధించిన మౌలిక వసతులు పెంచాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2030 నాటికి 5లక్షల క్రెష్ సీట్లు స్రుష్టించాలి. పిల్లల పెంపకంలో తండ్రుల బాధ్యతను గుర్తించి ప్రైవేట్, అసంఘటిత రంగంలో పనిచేసే తండ్రులకు పిత్రుత్వ సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని తప్పనిసరి హక్కుగా పరిగణించాలి. దీనికోసం ఒక చట్టబద్ధమైన చట్రం ఏర్పాటు చేసి అన్నిరంగాలకు వర్తించాలి. విధినిర్వహణ సమయంలో పిల్లల ఆలనా పాలన చూసుకునేందుకు  తల్లులకు ఇస్తున్న విరామాన్ని పావుగంట నుంచి అరగంటకు పెంచడంతోపాటు ప్రత్యేక గదులను కేటాయించాలి.

అయితే ఈ సెలవులను ఇద్దరు పిల్లలకే పరిమితం చేయకుండా.. మూడో బిడ్డకు కూడా విస్తరించాలి. మాత్రుత్వ ప్రయోజనాల కల్పనలో అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధానాన్ని అమల్లోకి తీసుకురావడంతోపాటు.. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా అసంఘటితరంగ మహిళకోసం ఇలాంటిది అందుబాటులోకి తీసుకురావడంతోపాటు వారికి  న్యాయ సహాయం చేసేందుకు ప్రత్యేక అవగాహన శిబిరాలను నిర్వహించాలి. ఈ ప్రయోజనానలు కల్పించని యజమానాలపై కఠిన చర్యలు చేపట్టడంతోపాటు, భారీ జరిమానాలు విధించాలి. మాత్రుత్వ, శిశుపోషణ ప్రయోజనాలను ద్రుష్టిలో ఉంచుకుని ఉద్యోగ నియామకాల్లో మహిళల పట్ల వివక్ష చూపేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఈ సెలవులు తీసుకునే మహిళల్లో పనిపట్ల నిబద్ధత తక్కువ ఉంటుందన్న భావనను పూర్తిగా పోగోట్టేలా చర్యలు తీసుకోవాలి. శిశు సంరక్షణ అంటే జాతి నిర్మాణం, సామాజిక బాధ్యత పోషించడమేనని ప్రతిఒక్కరూ గుర్తించేలా చెప్పాలి. మహిళల పదోన్నతులు, జీతాలు, పెన్షన్ల మీద ఈ సెలవుల ప్రభావం చూపకుండా చర్యలు తీసుకోవాలి. పిల్లలను దత్తత తీసుకున్నవారికి సరోగసి ద్వారా తల్లులు అయినవారికి సెలవులను 12 వారాల నుంచి 26వారాలకు పెంచాలని కమిషన్ సూచించింది.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES