SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

గోల్డ్ లోన్ తీసుకున్న వారికి కొత్త చిక్కులు.. బ్యాంకు SMS ల వెనుక అసలు కథ ఇదే..!!

Gold Loan: బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. దీంతో గోల్డ్ లోన్ తీసుకున్న వారికి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. గతంలో బంగారం విలువ భారీగా పెరిగిన సమయంలో తాకట్టు పెట్టి లోన్స్ తీసుకున్న కస్టమర్లకు ఇప్పుడు బ్యాంకర్ల నుంచి ఫోన్లు, మెసేజ్ లు వస్తున్నాయి.

Written By Bhoomi
Published: Nov 23, 2026, 19:22 IST | Updated: Nov 23, 2026, 19:24 IST
Image Credit: Gold Loan Alert:
Join

Gold Loan: బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. దీంతో గోల్డ్ లోన్ తీసుకున్న వారికి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. గతంలో బంగారం విలువ భారీగా పెరిగిన సమయంలో తాకట్టు పెట్టి లోన్స్ తీసుకున్న కస్టమర్లకు ఇప్పుడు బ్యాంకర్ల నుంచి ఫోన్లు, మెసేజ్ లు వస్తున్నాయి. లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని.. లేదంటే అదనంగా మరికొంత బంగారం తాకట్టు పెట్టాలని.. లేదా.. కొంత నగదు జమ చేయాలంటూ బ్యాంకులు సూచిస్తున్నాయి. అయితే బంగారం ధరలు తగ్గితే కొనుగోలుదారులకు ఊరటే అయినప్పటికీ.. గోల్డ్ లోన్ తీసుకున్న వారికి మాత్రం ఇది కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా ఈమధ్య బ్యాంకుల నుంచి అదనంగా డబ్బులు చెల్లించాలంటూ మెసేజ్ లు వస్తుండటంతో రుణ గ్రహీతల్లో ఆందోళన నెలకొంది.

అయితే గత నెలరోజులుగా పసిడి ధరలు భారీగా దిగివస్తున్నాయి. ఈ ఏడాది తొలినాళ్లలో తులం పది గ్రాముల బంగారం ధర రూ. 1,50, 000 మార్క్ దాటింది. ప్రస్తుతం రూ. 1,20, 000 పలుకుకుతోంది. అంటే ఆల్ టైం గరిష్ట స్థాయి నుంచి దాదాపు రూ. 60వేల మేర పడిపోయింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తూ.. రికార్డు స్థాయి నుంచి సగానికి సగం పడిపోయింది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 1,60, 000 పలుకుతోంది. ఈ ఏడాది మొదట్లో కిలో వెండి రూ. 4.80లక్షల వరకు చేరింది.

అయితే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. బ్యాంకులు తాకట్టు పెట్టిన బంగారం విలువలో గరిష్టంగా 75శాతం వరకు అంటే 25 నుంచి 30శాతం వరకు మార్జిన్ ఉంచుకుని లోన్ అందిస్తాయి. మీరు  రూ. 2,00, 000 విలువైన బంగారం పెట్టి రూ. 1, 50, 000 లోన్ తీసుకుంటే.. ఇప్పుడు బంగారం ధర తగ్గడంతో మీరు తాకట్టు పెటిన నగ విలువ రూ. 1, 60, 000కు పడిపోయింది అనుకుందాం. అప్పుడు మీరు కట్టాల్సిన అసలు, వడ్డీ అలాగే ఉన్నాయి. దీంతో బంగారం విలువకు... అప్పుకు మధ్య ఉండాల్సిన మార్జిన్ తగ్గిపోయి ఎల్టీవీ అంటే లోన్ వాల్యూ పరిమితి దాటిపోతుంది. అప్పుడు బ్యాంకర్లు తమ కస్టమర్లకు ఇచ్చిన లోన్ టూ వ్యాల్యూ తగ్గిన నేపథ్యంలో తాకట్టు పెట్టిన బంగారం విలువ తగ్గడంతో బ్యాంకర్లు మీరు తీసుకున్న లోన్లపై మార్జిన్ సర్దుబాటు చేసుకోమంటూ కస్టమర్లకు వరుసగా మెసేజ్ లు పంపిస్తున్నారు.

అయితే..  బ్యాంకుల నుండి వచ్చే  మెసేజ్ లకు  స్పందించాలని నిపుణులు అంటున్నారు. గడువులోగా మార్జిన్‌లను సర్దుబాటు చేసుకోవడమే ఉత్తమమని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు. దీనికి రెండు మార్గాలు ఉన్నాయి:

1. రుణ భారాన్ని తగ్గించడానికి కొంత నగదును (పాక్షిక చెల్లింపు) అందించడం.

2. బ్యాంకులో మరింత బంగారాన్ని డిపాజిట్ చేయాలని వారు సూచిస్తున్నారు. అయితే, వినియోగదారులు స్పందించకపోతే, తమ డబ్బును తిరిగి రాబట్టుకోవడానికి బ్యాంకులు తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేసే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.

బంగారం ధర ఎందుకు పడిపోతోంది?

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతామని సూచించడం, డాలర్ బలపడటం, యూఎస్ బాండ్ల రాబడులు పెరగడం, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెరగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు 14 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. దేశీయంగా రూపాయి బలపడటం కూడా ధరల తగ్గుదలకు దోహదపడింది.

మనం బంగారం కొనకపోతే రేట్లు దిగొస్తాయా? అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలను శాసించే అసలు శక్తులు ఏవో తెలిస్తే షాకవుతారు..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES