• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /ఇప్పుడే బంగారం కొంటున్నారా?.. కాస్త ఆగండి.. ధన్‌తేరస్ నాటికి పసిడి రేట్లలో ఊహించని మార్పు..HSBC రిపోర్ట్..!!

ఇప్పుడే బంగారం కొంటున్నారా?.. కాస్త ఆగండి.. ధన్‌తేరస్ నాటికి పసిడి రేట్లలో ఊహించని మార్పు..HSBC రిపోర్ట్..!!

Gold Price Forecast: ధన్‌తేరస్ (ధనత్రయోదశి), దీపావళి పండుగల సమయంలో పసిడి ఆభరణాలు, నాణేలు కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నవారు ప్రస్తుత బులియన్ మార్కెట్ కదలికలను నిశితంగా గమనించాల్సిన అవసరం ఏర్పడింది. ఇటీవలి కాలంలో చరిత్రలోనే ఆల్-టైమ్ రికార్డు స్థాయిలను నమోదు చేసిన బంగారం ధరలు ప్రస్తుతం వేగంగా తగ్గుముఖం పడుతుండటం మార్కెట్‌లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Oct 04, 2026, 09:32 AM IST|Updated: Oct 04, 2026, 09:33 AM IST
joinshare
ఇప్పుడే బంగారం కొంటున్నారా?.. కాస్త ఆగండి.. ధన్‌తేరస్ నాటికి పసిడి రేట్లలో ఊహించని మార్పు..HSBC రిపోర్ట్..!!
Image Credit: Gold Price Forecast

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
నవోదయ విద్యాసంస్థల్లో 9, 11వ తరగతుల ప్రవేశాలు.. అక్టోబర్ 15తో ముగియనున్న దరఖాస్తు గడువు.. పూర్తి వివరాలు ఇవే!

నవోదయ విద్యాసంస్థల్లో 9, 11వ తరగతుల ప్రవేశాలు.. అక్టోబర్ 15తో ముగియనున్న దరఖాస్తు గడువు.. పూర్తి వివరాలు ఇవే!

2

సింగరేణి కార్మికులకు బిగ్ గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ. 1.10లక్షలు.. పూర్తి వివరాలివే..!!

3

Mahbubnagar: మహబూబ్‌నగర్‌లో షాకింగ్ ఘటన.. ఏడాది చిన్నారి గొంతులో ఇరుక్కున్న బిస్కెట్.. ఆ తర్వాత.!.

4

ఇప్పుడే బంగారం కొంటున్నారా?.. కాస్త ఆగండి.. ధన్‌తేరస్ నాటికి పసిడి రేట్లలో ఊహించని మార్పు..HSBC రిపోర్ట్..!!

5

Rachita Ram Video: ఆ పనిచేయలేదు కదా.!. ఫ్యాన్ బుగ్గలు గిల్లిన ఘటనపై బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నటి రచిత రామ్.. వీడియో వైరల్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Gold Price Forecast: ధన్ తేరస్, దీపావళి పండగల సీజన్ లో బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నవారి కోసమే ఈ వార్త. ధంతేరస్, దీపావళికి ముందు బంగారం ధరల్లో భారీ తగ్గుదల ఉండే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మీరు కూడా బంగారం కొనాలనుకుంటే కొన్ని రోజులు వేచి ఉండటం మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలపై భారీ ఒత్తిడి పెరిగింది. ఫలితంగా కొన్ని సార్లు ఈ విలువైన లోహాల ధరలు భారీగా పెరిగితే.. మరికొన్ని సందర్భాల్లో భారీగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే బంగారం ధర ఆల్ టైం గరిష్ట ధర నుంచి భారీగా పడిపోవడం మనం గమనించవచ్చు. ఈ తగ్గుదల రానున్న రోజుల్లోనూ ఉండే అవకాశం ఉందని హెచ్ ఎస్ బీసీ బంగారం తన కొత్త అంచనాను విడుదల చేసింది. ధంతేరస్ వరకు బంగారంపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని ఆ బ్యాంకు అంచనా వేసింది.

రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం.. బంగారంపై ఉన్న ఒత్తిడి దృష్ట్యా హెచ్‌ఎస్‌బిసి బ్యాంక్ 2026 సంవత్సరానికి గాను బంగారం సగటు ధర అంచనాను తగ్గించింది. 2026 సంవత్సరానికి గాను బంగారం సగటు ధర అంచనాను ఔన్సుకు $4,490 కి తగ్గుతుందని అంచనా వేసింది. దీనిని భారత రూపాయలలో చూస్తే, 10 గ్రాములకు రూ. 1,48,624 అవుతుంది. ఈ బ్యాంక్ 2027 సంవత్సరానికి గాను బంగారం అంచనా వేసింది. ఇప్పుడు 2027 సంవత్సరానికి అంచనా వేసిన సగటు ధరను ఔన్సుకు $4,825 కి తగ్గించింది. ఈ బ్యాంక్ 2026 సంవత్సరానికి గాను బంగారం సగటు ధర అంచనాను ఔన్సుకు $4,490 కి తగ్గించింది.

ఈ రిపోర్టు ప్రకారం.. ఒకవేళ బంగారం ధర ఔన్సుకు సుమారు $4,000కు చేరినట్లయితే..  కేంద్ర బ్యాంకులు కొనుగోళ్లను పునఃప్రారంభించవచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాకుండా, ఆ ధర వద్ద ఇతర పెట్టుబడిదారులు కూడా పెరిగిన ఆసక్తి కనబరిచే అవకాశాలు కూడా ఉన్నట్లు పేర్కొంది. అయితే భారతీయ సంప్రదాయంలో ధంతేరస్, దీపావళి రోజుల్లో బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే పండగ నాటికి ధరలు తగ్గుతాయా పెరుగుతాయా అనే ఆందోళన కొనుగోలుదారుల్లో ఉంటుంది. అయితే హెచ్ఎస్ బీసీ విశ్లేషణ మాత్రం స్వల్పకాలంలోనే బంగారం ధరలపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని..మార్కెట్ దిశ నిరంతరం ఒకే వైపు ఉండదని స్పష్టం చేసింది.

బంగారం ధరలను నిర్ణయించడంలో అమెరికా ట్రెజరీ ఈల్డ్స్, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, అమెరికా డాలర్ బలం, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా అమెరికా బాండ్ దిగుబడులు పెరిగినప్పుడు బంగారం కొనేందుకు అయ్యే వ్యయం పెరుగుతుంది. గోల్డ్ ఎలాంటి రాబడిని ఇవ్వదు. దీంతో బంగారంపై ఒత్తిడి అనేది పెంచుతుంది. బంగారం ధర గ్లోబల్ గా ఔన్సుకు 4000వేల డాలర్ల స్థాయికి చేరుకున్నట్లయితే.. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు, పెట్టుబడిదారుల నుంచి కొనుగోలు ఆసక్తి మళ్లీ పుంజుకుని ధరలు మరింత పడిపోకుండా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు సర్దుబాటు అయినప్పటికీ, దేశీయ భారతీయ రిటైల్ మార్కెట్‌లో బంగారం ధరలు అధికంగానే ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్ డేటా ప్రకారం, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,53,314కు, 22 క్యారెట్ల బంగారం రూ. 1,41,141కు, 18 క్యారెట్ల బంగారం రూ. 1,15,563కు అమ్ముడవుతుండగా, కిలో వెండి ధరలు రూ. 2.35 లక్షల నుంచి రూ. 2.519 లక్షల మధ్య ఉన్నాయి. అంతర్జాతీయ ధరలు, రూపాయి-డాలర్ మారకం రేటు, దిగుమతి సుంకాలు, స్థానిక పన్నులు, నగల వ్యాపారుల తయారీ ఛార్జీల వల్ల కూడా భారతీయ కొనుగోలుదారులు ప్రభావితమవుతున్నారు. ఒకవేళ అంతర్జాతీయ ధరలు తగ్గినా, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడితే, దేశీయ ధరల తగ్గుదల వల్ల వినియోగదారులకు పూర్తి ప్రయోజనం చేకూరదు.

పండుగ సీజన్‌లో ఆభరణాలు కొనుగోలు చేసే గృహస్థులు,  దీర్ఘకాలిక పెట్టుబడిదారులు పరిస్థితిని విభిన్నంగా విశ్లేషించుకోవాలి. రాబోయే వారాల్లో మార్కెట్ ఏ దిశలోనైనా వేగంగా కదలవచ్చు కాబట్టి, కొనుగోలుదారులు అంతర్జాతీయ బులియన్ ట్రెండ్‌లు, బాండ్ ఈల్డ్‌లు,  రూపాయి విలువను నిశితంగా గమనిస్తూ తమ కొనుగోళ్లను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Gold Rate
Business News
Telugu News