SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రూ.4,400 నుంచి రూ.1.50 లక్షల వరకు.. పసిడి సరికొత్త రికార్డు.. 26 ఏళ్ల దసరా ధరల జర్నీ ఇదీ..!!

Gold Price History: దేశవ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకుంది. కానీ పసిడి ప్రియులకు మాత్రం బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో తులం 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1,50,000 మార్కుకు చేరుకుని రికార్డు సృష్టిస్తోంది. అయితే.. సరిగ్గా 26 ఏళ్ల క్రితం.. అంటే 2000వ సంవత్సరం దసరా సమయంలో తులం బంగారం ధర కేవలం రూ. 4,400 మాత్రమే ఉందంటే నమ్మగలరా? అవును.. ఇది అక్షరాలా నిజం. గత రెండున్నర దశాబ్దాల కాలంలో బంగారం ధర ఏకంగా 34 రెట్లు పెరిగి పెట్టుబడిదారులకు ఊహించని లాభాలను అందించింది. ఈ 26 ఏళ్ల దసరా ప్రయాణంలో పసిడి ధరలు ఏ విధంగా రూ. 4,400 నుంచి రూ. 1.50 లక్షల స్థాయికి చేరాయో ఒకసారి పరిశీలిద్దాం.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 11, 2026, 09:27 AM IST | Updated: Oct 11, 2026, 09:29 AM IST
Image Credit: Gold Price Journey 26 Years
Join

Gold Price History: దేశవ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకుంది. కానీ పసిడి ప్రియులకు మాత్రం బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో తులం  10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1,50,000 మార్కుకు చేరుకుని రికార్డు సృష్టిస్తోంది. అయితే.. సరిగ్గా 26 ఏళ్ల క్రితం.. అంటే 2000వ సంవత్సరం దసరా సమయంలో తులం బంగారం ధర కేవలం రూ. 4,400 మాత్రమే ఉందంటే నమ్మగలరా? అవును.. ఇది అక్షరాలా నిజం. గత రెండున్నర దశాబ్దాల కాలంలో బంగారం ధర ఏకంగా 34 రెట్లు పెరిగి పెట్టుబడిదారులకు ఊహించని లాభాలను అందించింది. ఈ 26 ఏళ్ల దసరా ప్రయాణంలో పసిడి ధరలు ఏ విధంగా రూ. 4,400 నుంచి రూ. 1.50 లక్షల స్థాయికి చేరాయో ఒకసారి పరిశీలిద్దాం.

భారతీయ సంస్కృతిలో విజయదశమి, ధంతేరాస్ పండుగల వేళ బంగారం కొనుగోలు చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. పసిడిని కేవలం ఒక అలంకార వస్తువుగానే కాకుండా.. భారతీయులు అత్యంత విశ్వసనీయమైన ఆర్థిక భద్రత, సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తారు. 2000వ సంవత్సరం దసరా పండుగ సమయంలో 10 గ్రాముల  బంగారం ధర కేవలం రూ. 4,400గా ఉండేది. సరిగ్గా 26 సంవత్సరాల తర్వాత, 2026 అక్టోబర్ దసరా నాటికి ఆ ధర ఊహించని రీతిలో రూ. 1,50,000 మార్కును తాకి కొత్త రికార్డు సృష్టించింది. గడిచిన పాతికేళ్ల కంటే ఎక్కువ కాలంలో పసిడి ధర ఏకంగా 34 రెట్లు పెరిగి ఇన్వెస్టర్లకు బంగారం లాంటి రాబడిని అందించింది.

2000వ సంవత్సరంలో దసరా వేళ తులం  బంగారం ధర కేవలం రూ. 4,400తో ప్రారంభం కాగా.. 2001లో స్వల్పంగా తగ్గి రూ. 4,300కి చేరింది. 2002లో ధరలు కోలుకుని రూ. 4,990 కాగా, 2003లో తొలిసారి రూ. 5 వేల మార్కును దాటుతూ రూ. 5,600కి చేరింది. ఆ తర్వాత పసిడి రేటు స్థిరమైన పెరుగుదలతో 2004లో రూ. 6,307, 2005లో రూ. 7,638,.. 2006లో రూ. 9,265 కి పెరిగింది. ఇక 2007లో తొలిసారిగా రూ. 10 వేల చారిత్రాత్మక మైలురాయిని చేరుకుని రూ. 10,598 వద్ద నిలిచింది. 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభ ప్రభావంతో ధరలు వేగంగా పెరిగి రూ. 13,630కి, 2009లో రూ. 16,686కి చేరగా, 2010 నాటికి తొలిసారి రూ. 20 వేల మార్కును దాటి రూ. 20,728కి పసిడి పరుగు తీసింది.

అనంతరం 2011లో రూ. 27,329కి చేరిన బంగారం, 2012లో తొలిసారిగా రూ. 30 వేల మైలురాయిని దాటి రూ. 30,859 వద్ద రికార్డు నమోదు చేసింది. అయితే 2013 నుండి 2016 వరకు ధరల్లో కొంత స్థిరీకరణ, తగ్గుదల కనిపించింది. వరుసగా 2013లో రూ. 28,422, 2014లో రూ. 26,703, 2015లో రూ. 24,931 కి చేరి, 2016 నాటికి రూ. 22,645తో కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ కోలుకున్న పసిడి ధరలు 2017లో రూ. 29,156, 2018లో రూ. 31,931 దాటి, 2019లో రూ. 39,108 వద్దకు చేరి రూ. 40 వేల స్థాయికి సమీపించాయి.

కరోనా మహమ్మారి సంక్షోభం తలెత్తిన 2020లో బంగారం ధరలు తొలిసారిగా రూ. 50 వేల మైలురాయిని దాటి రూ. 50,151కి చేరాయి. 2021లో స్వల్ప సర్దుబాటుతో రూ. 48,099గా ఉన్నప్పటికీ, 2022 నాటికి మళ్లీ రూ. 50,017తో రూ. 50 వేల మార్కును అధిగమించింది. ఇక అక్కడి నుంచి పసిడి రికార్డుల వేగం ఊపందుకుంది. 2023లో 60 వేలు దాటి రూ. 63,203 కాగా, 2024లో రూ. 78,245 కి చేరింది. 2025లో తొలిసారిగా రూ. 1 లక్ష చారిత్రాత్మక మార్కును తాకి రూ. 1,02,170 వద్ద నిలవగా, 2026 అక్టోబర్ దసరా నాటికి ఏకంగా రూ. 1,50,000 ఆల్-టైమ్ రికార్డును నమోదు చేసింది.

పసిడి ధరలు ఈ స్థాయికి పెరగడానికి ప్రధాన కారణాలు:

రూపాయి క్షిణత..దిగుమతి వ్యయం:
భారతదేశం తన పసిడి అవసరాలలో ఏకంగా 80 శాతానికి పైగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. 2000 సంవత్సరంలో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ సుమారు రూ. 44గా ఉండేది. కాలక్రమేణా రూపాయి మారకం విలువ క్షీణించడంతో దేశీయంగా బంగారం దిగుమతి ఖర్చులు భారీగా పెరిగాయి.  

కేంద్ర బ్యాంకుల పసిడి కొనుగోళ్లు:
భారత రిజర్వ్ బ్యాంక్ (RBI)తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు డాలర్ నిల్వలపై ఆధారపడటం తగ్గించి, సెంట్రల్ బ్యాంక్ రిజర్వుగా పసిడిని రికార్డు స్థాయిలో కొనుగోలు చేసి దాచుకోవడం మొదలుపెట్టాయి.  

ప్రపంచ సంక్షోభాలు-సురక్షిత పెట్టుబడి:
గడిచిన 26 ఏళ్ల కాలంలో సంభవించిన 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం, 2020 కరోనా మహమ్మారి.. అంతర్జాతీయంగా తలెత్తిన యుద్ద వాతావరణం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల కంటే బంగారాన్నే సురక్షితమైన ఆస్తిగా భావించి భారీగా పెట్టుబడులు పెట్టారు.   
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES