Gold Rate: అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు.. ప్రాఫిట్ బుకింగ్ దాటికి విలువైన లోహాలు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి వైపు దూసుకెళ్లి బంగారం, వెండి ధరలు నిన్న ఒక్కరోజే భారీగా పతనం అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు అమ్మకాలకు ఆసక్తి చూపిస్తుండటంతో దేశీయంగా, అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తీరు మారింది.
అంతర్జాతీయ మార్కెట్లో 24క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 137 డాలర్లకు పైగా తగ్గింది. దీంతో 3882 డాలర్లకు చేరుకుంది. 1 ఔన్సు వెండి ధర 3.23 డాలర్లు తగ్గింది. దీంతో 49 డాలర్లకు చేరింది. ఫలితంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 5000 మేర తగ్గింది. తులం బంగారం ధర ప్రస్తుతం 1,41,800 పలుకుతుంది. కిలో వెండి ధర రూ. 12,000 తగ్గింది. దీంతో కిలో వెండి ధరరూ. 1,83,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
కాగా ఈ ఏడాది జనవరి 29వ తేదీన అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 5626 డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే. కిలో వెండి ధర 121 డాలర్లకు చేరుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో దేశీయంగా పది గ్రాముల బంగారం ధర రూ. 1,86,000కు చేరింది. కిలో వెండి ధర రూ. 4,20,000 కు చేరుకుంది.
మరోవైపు గ్లోబల్ మార్కెట్లో వెండి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అంతర్జాతీయంగా వెండి ఏకంగా 6శాతం మేర క్షీణించింది. కీలకమైన 50 డాలర్ల దిగువకు పడిపోయింది. 11 నెలల కనిష్టమైన 49.06 డాలర్లకు పడిపోవడం బులియన్ మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. చివరిసారిగా 2025 నవంబర్ 21వ తేదీన వెండి 50 డాలర్ల మార్కు వద్ద ట్రేడ్ అయ్యింది.
అయితే అమెరికా డాలర్ బలపడటం.. బాండ్ ఈల్డ్స్ పెరగడం, గ్లోబల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఎలాంటి రిస్క్ లేకుండా ఉండే ఇతర రంగాల వైపు మళ్లించడం వల్ల ఈ రికార్డు స్థాయి అమ్మకాలకు కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. రానున్న రోజుల్లో మార్కెట్లో ఒడుదొడుకులు ఇలానే కొనసాగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Also Read: