• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఏకంగా రూ. 3,160 పతనమైన పసిడి ధర.. నేడు సెప్టెంబర్ 27వ తేదీ ధరలివే..!!

మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఏకంగా రూ. 3,160 పతనమైన పసిడి ధర.. నేడు సెప్టెంబర్ 27వ తేదీ ధరలివే..!!

Gold Rate Today: గత వారం నుండి దేశీయ మార్కెట్లో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత వారంలోనే 10 గ్రాముల పసిడి ధర రూ. 3,160 మేర పడిపోయింది. వెండి ధరలు కూడా ఇదే ధోరణిని అనుసరిస్తున్నాయి.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Sep 27, 2026, 08:41 AM IST|Updated: Sep 27, 2026, 08:42 AM IST
joinshare
మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఏకంగా రూ. 3,160 పతనమైన పసిడి ధర.. నేడు సెప్టెంబర్ 27వ తేదీ ధరలివే..!!
Image Credit: Gold Rate Today

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.


Gold Rate Today: భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమైంది. ప్రజలు దసరా కోసం కొనుగోళ్లు చేస్తున్నారు. సాధారణంగా దసరా, దీపావళి, ధంతేరస్ వంటి పండుగల సమయంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో దేశీయ బంగారం ధరలు అనిశ్చితంగా ఉన్నాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, డాలర్ విలువ, బాండ్ల రాబడులు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు కొంత ఊరట లభించింది. అయితే, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, సెప్టెంబర్ 27న హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

గత వారం నుండి దేశీయ మార్కెట్లో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత వారంలోనే 10 గ్రాముల పసిడి ధర రూ. 3,160 మేర పడిపోయింది. వెండి ధరలు కూడా ఇదే ధోరణిని అనుసరిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు బంగారం ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు పెరగడం, యూఎస్ ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడం వల్ల పెట్టుబడిదారులు బంగారం నుండి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. అంతేకాకుండా, దేశీయ డిమాండ్ తగ్గడం వల్ల కూడా ధరలు పడిపోయాయి.

ఆదివారం ఉదయం నాటికి, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24-క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 1,52,680గా నమోదైంది. అదే సమయంలో 22-క్యారెట్ల పసిడి ధర రూ.1,39,950 వద్ద స్థిరంగా ఉంది. 18-క్యారెట్ల పుత్తడి ధర రూ.1,14,510గా ఉంది. మరోవైపు, ఒక కిలోగ్రాము వెండి ధర రూ.2.50 లక్షల వద్ద స్థిరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖపట్నం, వరంగల్,  తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Gold Rate
Business News
Telugu News