Gold Rate Today: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. అయితే పెట్టుబడిదారులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎవరూ ఊహించని విధంగా బంగారం ధరలు పతనం అవుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణ భయంతోపాటు అమెరికా ట్రెజరీ బాండ్స్ పై రాబడులు పెరగడం, డాలర్ బలపడటం కారణంగా బంగారానికి డిమాండ్ తగ్గుతుందని చెప్పాలి.
నేడు సెప్టెంబర్ 29వ తేదీ మంగళవారం బంగారం ధరలు చూసినట్లయితే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,50,160కు తగ్గింది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి రూ. 1,37,640కి పడిపోయింది. 18 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 1,12,620కి తగ్గింది. కిలో వెండి ధర రూ. 2.44లక్షలకు దిగివచ్చింది. సోమవారం బంగారం ధర రూ. 2,500 మేర పడిపోయింది. వెండి ధర ఏకంగా రూ. 5వేల పతనం అయిన సంగతి తెలిసిందే.
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లోని బులియన్ మార్కెట్లలో నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 2,510 తగ్గి రూ.1,50,170కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధరలు కిలోగ్రాముకు రూ. 2,300 తగ్గి రూ. 1,37,650కి తగ్గింది. వెండి ధరలు కిలోగ్రాముకు రూ. 5,000 తగ్గి రూ. 2,45,000కి చేరాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. స్పాట్ బంగారం ధరలు ఔన్సుకు $143 తగ్గడంతో, బంగారం ధర ఔన్సుకు $4,134కి చేరింది. అదేవిధంగా, స్పాట్ వెండి ధరలు 5.29 శాతం తగ్గడంతో, వెండి ధర ఔన్సుకు $60.77కి చేరింది.