SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

భారీగా పడిపోతున్న బంగారం ధరలు.. ఏకంగా 15వేలు తగ్గింపు..!!

Gold Rate: పసిడి ప్రియులకు భారీ గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు వరుసగా పతనం అవుతున్నాయి. వెండితోపాటు బంగారం కొనాలనుకునేవారికి ఇది మంచి సమయం అని చెప్పాలి.

Written By Bhoomi
Published: Nov 19, 2026, 09:54 IST | Updated: Nov 19, 2026, 09:55 IST
Image Credit: Gold Rate:
Join


Gold Rate: పసిడి ప్రియులకు భారీ గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు వరుసగా పతనం అవుతున్నాయి. వెండితోపాటు బంగారం కొనాలనుకునేవారికి ఇది మంచి సమయం అని చెప్పాలి.  దేశీయ మార్కెట్ తోపాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు భారీగా దిగివస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వరుసగా ధరలు పతనం అవుతూనే ఉన్నాయి. దీంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి  కొనుగోలు చేయాలన్న ఆసక్తి పెరుగుతోంది. 

ముఖ్యంగా ఒకే రోజులో వేల రూపాయల మేర ధరలు పడిపోతుండటం మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. కాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.2,570 తగ్గి రూ.1,30,690కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.2,350 తగ్గుదల నమోదై రూ.1,19,800 వద్ద ఉంది. అటు కిలో వెండి ధర రూ.5,000 పడిపోయి రూ.1,80,000 పలుకుతోంది. ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు. ఈ ధరలపై 3శాతం జీఎస్టీ అదనంగా ఉంటుంది.  

నవంబర్ 9వ తేదీ నుంచి బంగారం ధర రూ. 15,000 మేర, అంటే దాదాపు 10శాతం మేర పడిపోయింది. దీపావళి రోజున బంగారం ధరలు సుమారు రూ.1.45 మేర తగ్గాయి. కేవలం ఒక వారంలోనే బంగారం ధర 4.65శాతం మేర పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న బలహీన పరిస్థితులు, బలపడుతున్న భారత రూపాయి ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలు. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ బంగారం ధరలు ఔన్సుకు $3,729కి పడిపోయాయి, ఇది కేవలం ఒక్క రోజులోనే $134.50 తగ్గుదల. బంగారం ధరలు ఇప్పటికీ 14 నెలల కనిష్ట స్థాయికి సమీపంలోనే ఉన్నాయి.

బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి?

బంగారం ధరల తగ్గుదలకు మార్కెట్ విశ్లేషకులు అనేక కారణాలను పేర్కొంటున్నారు. వీటిలో అమెరికన్ డాలర్ బలపడటం, బాండ్ల రాబడులు పెరగడం, భారత రూపాయి విలువలో మార్పులు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానంపై అంచనాలు ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ కమోడిటీ అనలిస్ట్ సౌమిల్ గాంధీ ప్రకారం, బలహీనమైన ప్రపంచ మార్కెట్ ధోరణుల కారణంగా మంగళవారం దేశీయ బంగారం ధరలు ఒత్తిడిలోనే ఉన్నాయి. ఆయన బలమైన భారత కరెన్సీ ప్రభావాన్ని కూడా నొక్కి చెప్పారు.

ఆయన తెలిపిన  ప్రకారం, ఏప్రిల్ నుండి అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 93.51కి పడిపోవడం దేశీయ బంగారం ధరలపై ఒత్తిడిని మరింత పెంచింది. రాబోయే కాలంలో విలువైన లోహాలు ఇబ్బందులను ఎదుర్కోవచ్చని మీరే అసెట్ షేర్‌ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్ సింగ్ అన్నారు. డిసెంబర్‌లో.. వచ్చే ఏడాది మొదటి అర్ధభాగంలో వడ్డీ రేట్ల పెంపుపై మార్కెట్ అంచనాలే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. బ్రోకరేజ్ ప్లాట్‌ఫామ్ లెమన్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ గార్గ్ కూడా, గత సెషన్‌లో భారీ నష్టాల తర్వాత తక్కువ స్థాయిలలో కొనుగోలు చేయడం గోల్డ్ ఫ్యూచర్స్ కోలుకోవడానికి సహాయపడిందని అన్నారు.

Also Read: 

మీ కూతురి భవిష్యత్తుకు బంగారు బాట.. నెలకు రూ.12,500 పొదుపుతో చేతికి రూ.70 లక్షలు..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES