SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్..ఆ పని చేయకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆగిపోతాయి!

Government Employees: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ఉద్యోగుల ఆధార్ కార్డ్, పాన్ కార్డు వివరాల అప్ డేట్ ప్రక్రియను మరింత స్పీడప్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Written By Bhoomi
Published: Oct 26, 2026, 05:51 PM IST | Updated: Oct 26, 2026, 05:52 PM IST
Image Credit: Government Employees
Join

Government Employees: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ఉద్యోగుల ఆధార్  కార్డ్, పాన్ కార్డు వివరాల అప్ డేట్ ప్రక్రియను మరింత స్పీడప్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. సర్వీసులో ఉన్న ఉద్యోగులతోపాటు పెన్షనర్లు కూడా తమ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ సమాచారాన్ని వీలైనంత త్వరగా సంబంధిత శాఖల్లో సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

రిటైర్మెంట్ పొందే సమయానికి ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక లబ్ది, పెన్షన్ ప్రయోజనాల్లో ఎలాంటి అడ్డంకులు.. ఆలస్యం అవ్వకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. వివరాలు అప్ డేట్ చేయనట్లయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉందని.. ఉద్యోగులు వెంటనే స్పందించి సమాచారాన్ని సరిచూసుకోవాలని సూచించారు.

ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోపు ఈ వివరాలను పూర్తి చేయాలని హెచ్ఓడీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ పెన్షన్ మాడ్యుల్ లో ఈ వివరాలను ఎంట్రీ చేయాలని తెలిపారు. త్వరలో రిటైర్ అయ్యే వేలాది మందికి ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

అక్రమ పెన్షన్లు, మరణించిన వారి పేర్లను తొలగించేందుకు ఈ అప్డేట్ ఎంతో సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు. రికార్డులను సరిగ్గా ఉంచడం వల్ల అందరికీ సకాలంలో లబ్ది చేకూరుతుందన్నారు. సంబంధిత సిబ్బంది అందరూ కూడా నిర్దేశిత గడువులోపు ఈ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం కోరింది. 


 Also Read: 

డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ పై నిరుద్యోగుల అసంతృప్తి...పోస్టులు పెంచాలని డిమాండ్..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES