• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /ఐఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్.. స్క్రీన్ పగిలితే ఇక కొత్త ఫోన్.. యాపిల్ కీలక ప్రకటన..!!

ఐఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్.. స్క్రీన్ పగిలితే ఇక కొత్త ఫోన్.. యాపిల్ కీలక ప్రకటన..!!

iPhone Duo: యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యుయో కొనుగోలు చేసి కొంతమంది వినియోగదారులకు బిగ్ షాక్ తగిలింది. ఫోన్ వాడటం ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే లోపలి స్క్రీన్ పై పగుళ్లు, గీతలు ఉన్నాయంటూ..ఫిర్యాదులు వచ్చాయి.

Written ByBhoomi
Published: Oct 27, 2026, 10:15 AM IST|Updated: Oct 27, 2026, 10:17 AM IST
joinshare
ఐఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్.. స్క్రీన్ పగిలితే ఇక కొత్త ఫోన్..  యాపిల్ కీలక ప్రకటన..!!
Image Credit: iPhone Duo

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
వరంగల్ జిల్లా ఆయూష్ మిషన్‎లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..!!

వరంగల్ జిల్లా ఆయూష్ మిషన్‎లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..!!

2

ఐఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్.. స్క్రీన్ పగిలితే ఇక కొత్త ఫోన్.. యాపిల్ కీలక ప్రకటన..!!

3

సెప్టెంబర్‌తో ముగిసిన గడువు.. ఇంకా స్పష్టత లేని పీఆర్సీ నివేదిక.. ఉద్యోగుల్లో ఆందోళన..!!

4

ఏపీలో తీరం దాటనున్న 'అర్నాబ్' తుఫాను.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఖాయం!

5

మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60,000 మందికి గుడ్ బై..! స్వచ్ఛంద రాజీనామా ఆఫర్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

iPhone Duo: యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యుయో కొనుగోలు చేసి కొంతమంది వినియోగదారులకు బిగ్ షాక్ తగిలింది. ఫోన్ వాడటం ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే లోపలి స్క్రీన్ పై పగుళ్లు, గీతలు ఉన్నాయంటూ..ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ సమస్యపై స్పందించిన యాపిల్ సంస్థ.. లోపం ఉన్న ఫోన్లను మార్చి ఇస్తామంటూ ప్రకటించింది. 
  
వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు, వీడియోల ప్రకారం.. ఫోన్ మడిచే మధ్య భాగంలోనే స్క్రీన్ దెబ్బతింటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కొందరు కొనుగోలుదారులు ఫోన్‌ను మొదటిసారి ఓపెన్ చేసిన కొద్దిసేపటికే ఈ స్క్రీన్ డ్యామేజ్ సమస్యను ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, విక్రయించిన మొత్తం హ్యాండ్‌సెట్లలో కేవలం కొద్ది సంఖ్యలోని ఫోన్లకు మాత్రమే ఈ రకమైన తయారీ లోపం తలెత్తిందని యాపిల్ స్పష్టం చేసింది.

స్క్రీన్ పై పగుళ్లు రావడానికి గల కచ్చితమైన సాంకేతిక కారణాన్ని యాపిల్ సంస్థ అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. అయితే, ప్రముఖ డివైజ్ రిపేరింగ్ సంస్థ 'ఐఫిక్సిట్' జరిపిన ప్రాథమిక పరిశీలనలో ఒక కీలక విషయం బయటపడింది. ఫోన్‌ను ఫోల్డ్ చేసే సమయంలో లోపల ఉండే సపోర్టింగ్ మెకానిజమ్ భాగం సరిగ్గా పక్కకు జరగకపోతే, డిస్‌ప్లేపై అధిక ఒత్తిడి ( పడుతుంది. ఈ ఒత్తిడి కారణంగానే స్క్రీన్‌పై పగుళ్లు లేదా గీతలు ఏర్పడుతున్నాయని ఐఫిక్సిట్ భావిస్తోంది. అయితే, ఇది ఇంకా అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.  ఈ స్క్రీన్ డ్యామేజ్ సమస్యను ఎదుర్కొంటున్న వినియోగదారులు వెంటనే సమీపంలోని యాపిల్ కేర్ సెంటర్‌ను సంప్రదించాలి. ప్రభావితమైన ఫోన్లను పరిశీలించి, ఉచితంగా కొత్త ఫోన్‌ను మార్చి ఇస్తారు.

 సాధారణంగా స్క్రీన్ డ్యామేజ్‌లకు ఇన్సూరెన్స్ లేదా సబ్‌స్క్రిప్షన్ అవసరం అవుతుంది. కానీ, ఇది ప్రత్యేకమైన తయారీ లోపం  కావడం వల్ల వినియోగదారులకు 'AppleCare+' సబ్‌స్క్రిప్షన్ లేకపోయినా ఉచితంగానే కొత్త ఫోన్ అందిస్తామని యాపిల్ స్పష్టం చేసింది.

Also Read: 

సెప్టెంబర్‌తో ముగిసిన గడువు.. ఇంకా స్పష్టత లేని పీఆర్సీ నివేదిక.. ఉద్యోగుల్లో ఆందోళన..!!

 

Add Zee News as a Preferred Source
TAGS:
Business News
Telugu News