• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60,000 మందికి గుడ్ బై..! స్వచ్ఛంద రాజీనామా ఆఫర్!

మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60,000 మందికి గుడ్ బై..! స్వచ్ఛంద రాజీనామా ఆఫర్!

టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. గతంలో ఏప్రిల్ నెలలో కూడా యూఎస్‌లోని 7 శాతం సిబ్బందికి ఇలాంటి ఆఫరే ఇచ్చింది. స్వచ్ఛందంగా ఉద్యోగులకు ఎగ్జిట్ ప్యాకేజీని ప్రకటించింది. తాజాగా మరోసారి మైక్రోసాఫ్ట్ భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమై మొత్తం 60,000 మందికి ఎగ్జిట్ ప్యాకేజీని ప్రకటించినట్లు సమాచారం.

Written ByRenuka Godugu
Published: Oct 27, 2026, 07:07 AM IST|Updated: Oct 27, 2026, 07:12 AM IST
joinshare
మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60,000 మందికి గుడ్ బై..! స్వచ్ఛంద రాజీనామా ఆఫర్!
Image Credit: Microsoft Offers Voluntary Buyout

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఐఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్.. స్క్రీన్ పగిలితే ఇక కొత్త ఫోన్..  యాపిల్ కీలక ప్రకటన..!!

ఐఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్.. స్క్రీన్ పగిలితే ఇక కొత్త ఫోన్.. యాపిల్ కీలక ప్రకటన..!!

2

సెప్టెంబర్‌తో ముగిసిన గడువు.. ఇంకా స్పష్టత లేని పీఆర్సీ నివేదిక.. ఉద్యోగుల్లో ఆందోళన..!!

3

ఏపీలో తీరం దాటనున్న 'అర్నాబ్' తుఫాను.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు ఖాయం!

4

మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60,000 మందికి గుడ్ బై..! స్వచ్ఛంద రాజీనామా ఆఫర్!

5

AP Trains Cancelled: అర్నబ్ తుపాన్ ఎఫెక్ట్.. ఏపీలో రెండు రోజుల పాటు పలు రైళ్లు బంద్.. డిటెయిల్స్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Microsoft Offers Buyout Package: యూఎస్, కెనడా, ఇండియా, బ్రిటన్‌లలోని వైస్ ప్రెసిడెంట్, ఆ కింది స్థాయి ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్‌ స్వచ్చందంగా నిష్క్రమించే ఆఫర్‌ (Voluntary Buyout Programme) ను ప్రకటించింది. ఇందులో భాగంగా  రాజీనామా చేసిన వారికి డబ్బులు కూడా చెల్లించనుంది మైక్రోసాఫ్ట్. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థకు 2,23,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ఏడాదిలోనే కేవలం ఆరు నెలల్లో రెండోసారి స్వచ్ఛందంగా ఎగ్జిట్ ప్యాకేజీని ప్రకటించింది. ఇతర టెక్ దిగ్గజ కంపెనీల బాటలోనే మైక్రోసాఫ్ట్ కూడా వెళ్తోంది. ప్రధానంగా తమ ఉద్యోగులకు స్వచ్ఛంద రాజీనామా విధానాన్ని ప్రతిపాదించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇది మైక్రోసాఫ్ట్ చీఫ్ ఆఫీసర్ చెప్పిన ప్రకారం.. కంపెనీ వెలుపల అవకాశాన్ని వెతుక్కుంటున్న వారికి ఇది ఒక సువర్ణావకాశమని, ఇప్పుడు నిష్క్రమిస్తే తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా ఉంటుందని పేర్కొన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా శ్రామిక శక్తిని సర్దుబాటు చేసుకోవడానికే కంపెనీ ఈ ఆఫర్‌ను ప్రకటిస్తోందని తెలిపారు.

రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం, ఈ ఆఫర్ ఏఐ ఎక్స్‌పీరియన్స్, కోపైలట్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఎక్స్‌బాక్స్, విండోస్ ప్లస్ డివైసెస్  భద్రత విభాగాల్లో ఉన్న ఉద్యోగులకు వర్తిస్తుందని సమాచారం. ఇంత పెద్ద ఎత్తున మైక్రోసాఫ్ట్ స్వచ్ఛంద విరమణ ప్రకటిస్తుండటంతో, ఈ సంస్థ ఎక్కడ పెట్టుబడి పెడుతుందన్న ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా మెదిలింది. ఇతర కంపెనీల మాదిరిగానే మైక్రోసాఫ్ట్ కూడా ఏఐ రంగంలో పెట్టుబడి పెడుతోంది. గతంలో ఏప్రిల్‌లో 7 శాతం మంది ఉద్యోగులకు ఆఫర్ ప్రకటించి 9,000 మందికి అందించింది. ఇప్పుడు మరో 60,000 మంది ఉద్యోగులకు ఇది ప్రతిపాదించింది. మైక్రోసాఫ్ట్ ఏఐ డేటా సెంటర్లు, చిప్‌ల కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులను తగ్గించి ఆ డబ్బును ఏఐ పెట్టుబడులకు మళ్లిస్తోందన్న చర్చ జరుగుతోంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో 9,000 మందికి స్వచ్ఛంద పదవీ విరమణ అందజేసిన మైక్రోసాఫ్ట్, జూలైలో మరో 4,800 మంది ఉద్యోగులకు కోత విధించింది. ఇప్పుడు మరో 60,000 మందికి స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశం కల్పించింది. 2026 జూన్ 30 నాటికి మైక్రోసాఫ్ట్‌లో మొత్తం 2,23,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అంటే ఈ కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను 27 శాతం శాతం మేర తగ్గిస్తోంది.

Read Also: ఫ్రాన్స్ సంక్షోభానికి కారణమైన మాక్రాన్ 5 బ్లండర్ మిస్టేక్స్.. యూరప్‌పై పడనున్న తీవ్ర ప్రభావం! ఏకైక మార్గం ఇదేనా?

Read Also: ఫ్రాన్స్ పరిస్థితికి వలసలే కారణం.. పారిస్‌ ముస్లిం సిటీగా మారిపోతుంది! వెంటనే బార్డర్స్‌ మూసేయండి: ట్రంప్!
 

ప్రధానంగా కంపెనీ ఆర్థిక ప్యాకేజీని అందిస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కంపెనీలు పనిచేసే విధానాన్ని, ఉద్యోగుల బృందాలను మార్చడమే లక్ష్యంగా మైక్రోసాఫ్ట్ పెట్టుకుంది. అయితే డేటా సెంటర్లు, సేల్స్, మార్కెటింగ్ విభాగాలకు సంబంధించిన ఉద్యోగులకు మాత్రం ఇది వర్తించదు. ఈ బాటను కేవలం మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు, ఏఐలో మరింత పెట్టుబడి పెట్టడానికి ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ గూగుల్ కూడా ఇదే విధానాన్ని అనుసరించింది. 2022లో మెటా కూడా గరిష్ఠ స్థాయిలో 20,000 కంటే ఎక్కువ మంది సిబ్బందిని తొలగించింది.

Add Zee News as a Preferred Source
TAGS:
World News
Business News
Telugu News