• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /అఫైర్ తెచ్చిన తంటా.. ప్రపంచ టెక్ దిగ్గజం ఎన్విడియా CEO పదవికి ఎసరు..!!

అఫైర్ తెచ్చిన తంటా.. ప్రపంచ టెక్ దిగ్గజం ఎన్విడియా CEO పదవికి ఎసరు..!!

Nvidia CEO: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్‌ల తయారీలో ప్రపంచ అగ్రగామిగా వెలుగొందుతున్న టెక్ దిగ్గజం 'ఎన్విడియా' తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు సీఈఓ జెన్సన్ హువాంగ్‌ను పదవి నుంచి తప్పించేందుకు కంపెనీ బోర్డు సన్నద్ధమవుతున్నట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక 'వాల్ స్ట్రీట్ జర్నల్' ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది

Written ByBhoomi
Published: Nov 12, 2026, 10:02 AM IST|Updated: Nov 12, 2026, 10:03 AM IST
joinshare
అఫైర్ తెచ్చిన తంటా.. ప్రపంచ టెక్ దిగ్గజం ఎన్విడియా CEO పదవికి ఎసరు..!!
Image Credit: Nvidia CEO Affair Scandal:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
కార్తీక మాసం.. ఉసిరి ప్రత్యేకం.. రోజుకు ఒక్కటి తింటే చాలు..! మెరిసే చర్మం, నల్లటి ఒత్తైన జుట్టు మీ సొంతం!

కార్తీక మాసం.. ఉసిరి ప్రత్యేకం.. రోజుకు ఒక్కటి తింటే చాలు..! మెరిసే చర్మం, నల్లటి ఒత్తైన జుట్టు మీ సొంతం!

2

వ్యాపారం చేస్తామంటే చాలు.. జీతంతో పాటు సెలవులు.. ఉద్యోగుల కోసం ఐడీ ఫ్రెష్ CEO సంచలన నిర్ణయం..!!

3

మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 4 వస్తువులు ఉన్నాయా? పొరపాటున కూడా పెట్టకండి.. భారీ నష్టం తప్పదు!

4

మూడేళ్లుగా ఎదురుచూపులేనా..? OPS పునరుద్ధరణ కోసం నవంబర్ 17న ఉద్యోగుల సామూహిక సెలవుల బాట..!!

5

సంక్రాంతి ప్రయాణికులకు ముఖ్య గమనిక.. నవంబర్ 14 నుంచే టికెట్ రిజర్వేషన్లు, తేదీలివే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Nvidia CEO: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  చిప్‌ల తయారీలో ప్రపంచ అగ్రగామిగా వెలుగొందుతున్న టెక్ దిగ్గజం 'ఎన్విడియా'   తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు   సీఈఓ జెన్సన్ హువాంగ్‌ను పదవి నుంచి తప్పించేందుకు కంపెనీ బోర్డు సన్నద్ధమవుతున్నట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక 'వాల్ స్ట్రీట్ జర్నల్' ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది.  చైనాకు చెందిన ఒక మహిళా వ్యాపారవేత్తతో జెన్సన్ హువాంగ్‌కు వివాహేతర సంబంధం ఉండటంతో పాటు, సదరు మహిళ చైనా గూఢచారి అనే తీవ్రమైన ఆరోపణలు రావడమే ఈ కీలక నిర్ణయానికి ప్రధాన కారణమని ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ ఊహించని పరిణామాలతో ప్రపంచ టెక్ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగగా, ఎన్విడియా భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి మరియు నీలినీడలు కమ్ముకున్నాయి.

హువాంగ్ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునేందుకు బోర్డు సమావేశం కానుందని.. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న వ్యక్తులు పేర్కొన్నట్లు జర్నల్ తెలిపింది. అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం హువాంగ్ తో సంబంధం ఉన్న ఆలిస్ హువాంగ్ అనే చైనా పౌరురాలు.. చైనా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ గూఢచారిగా పనిచేస్తున్నట్లు బలమైన అనుమానాలు ఉన్నాయి. ఆమె గతంలో ఎన్విడియా   ప్రధాన కస్టమర్ అయిన సింగపూర్ ఆధారిత మెగాస్పీడ్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఆ కంపెనీ అమెరికా ఎగుమతి నిబంధనలను తప్పించుకుని, ఎన్విడియా చిప్‌లను చైనాకు సరఫరా చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇదిలా ఉండగా... తన కింద పనిచేసిన ఎన్విడియా హెల్త్‌కేర్ వైస్ ప్రెసిడెంట్ కిమ్బెర్లీ పావెల్‌తో హువాంగ్‌కు వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ 'ది న్యూయార్క్ టైమ్స్' మరో కథనాన్ని ప్రచురించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో, హువాంగ్ ఆదివారం ఉద్యోగులకు రాసిన ఒక మెమోలో, తన 40 ఏళ్ల వివాహ బంధంలో తాను నమ్మకద్రోహం చేశానని అంగీకరించి, తన కుటుంబంపై పడిన ప్రభావానికి క్షమాపణలు చెప్పారు.

ఈ కథనాల కారణంగా ట్రేడింగ్‌లో ఎన్విడియా షేర్లు తీవ్రంగా పడిపోయాయి. కేవలం కొన్ని రోజుల్లోనే, కంపెనీ మార్కెట్ విలువ అనేక వందల బిలియన్ డాలర్లు పడిపోయింది. మూడు దశాబ్దాల క్రితం హువాంగ్ స్థాపించిన 4 ట్రిలియన్ డాలర్ల కంపెనీలో నాయకత్వ మార్పు ఏఐ (AI) రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఈ విషయంలో అమెరికా కాంగ్రెస్ హువాంగ్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఎఫ్‌బిఐ కూడా కొన్ని కేసులను దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే, గూఢచర్య ఆరోపణలను చైనా ఖండించింది. నాయకత్వ మార్పుకు సంబంధించి ఎన్విడియా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Also Read: 

ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. న్యూ ఇయర్‎లో పీఆర్‌సీ అమలుకు ప్రభుత్వ కసరత్తు..!!

Add Zee News as a Preferred Source
TAGS:
World News
Business News
Telugu News