Vastu Tips for Refrigerator: సాధారణంగా ఫ్రిజ్‌లో కూరగాయలు, పండ్లు నిల్వ చేసుకుంటాం. వారానికి సరిపడా తెచ్చుకుని నిల్వ చేసుకుంటాం. ఈ బిజీలైఫ్‌లో తప్పనిసరిగా మారిపోయింది. అంతేకాదు వండిన ఆహారాలు కూడా ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటాం. అయితే వాస్తు ప్రకారం ఇంటి ఫ్రిజ్‌పై కొన్ని వస్తువులు పొరపాటున పెట్టకూడదు. ఇది నెగిటివ్ ఎనర్జీకి దారి తీస్తుంది. చాలా మందికి తెలియక ఈ పనిచేస్తారు. ఇంటి ఫ్రిజ్‌పై పొరపాటున కూడా ఈ 4 వస్తువులు పెట్టకూడదు.
డబ్బు..
కొంతమంది కరెంటు, నల్లా లేదా ఏదైనా షాపింగ్ చేసిన బిల్స్ హడావుడిలో ఫ్రిజ్‌పై పెట్టేస్తారు. అవి ముఖ్యమే కావచ్చు. కానీ, ఇది అశుభం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ఆర్థిక నష్టానికి కూడా దారితీస్తుంది.
పగిలిన వస్తువులు..
వాస్తు ప్రకారం పగిలిపోయిన వస్తువులు కూడా ఇంటి ఫ్రిజ్‌పై పొరపాటున పెట్టకూడదు. ఇది కూడా నెగిటివిటీకి దారితీస్తుంది. కొంతమంది గిన్నెలు, పగిలిపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులు ఫ్రిజ్ టాప్‌పై పెట్టేస్తారు. ఇది కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని ప్రసరించేలా చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఉపయోగం లేని ఏ వస్తువులు కూడా ఫ్రిజ్‌పై పెట్టకూడదు. ఇది ఆర్థిక నష్టానికి దారితీస్తుంది.
మందులు..
మరికొంత మంది మందులు కూడా ఫ్రిజ్ పై పెట్టేస్తారు. ఫ్రిజ్‌లో నీరు తీసుకుని లేదా వంటగదిలో పని బిజీ వల్ల ఇలా చేస్తారు. వాస్తు ప్రకారం ఇది కూడా అశుభకారం. ఇలా చేయడం వల్ల ఇంట్లో కుటుంబసభ్యుల ఆరోగ్యం మరింత దిగజారుతుంది. మెంటల్ స్ట్రెస్ కూడా పెరుగుతుంది. మెడిసిన్స్ ఎప్పుడూ ప్రత్యేకంగా ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
బరువుండే వస్తువులు..
కొంతమంది ఫ్రిజ్‌పై పప్పులు వేసిన డబ్బాలు కూడా పెడతారు. ఇది కూడా నెగిటివ్ ఎనర్జీకి దారితీస్తుంది. ఇలా బరువుండే వస్తువులు పెడితే ఫ్రిజ్ కూడా రానురాను సరిగ్గా పనిచేయకుండా పోతుంది. ఇది ఆర్థిక అస్థిరత్వం, స్ట్రెస్‌కు కూడా దారితీస్తుంది.
మీ ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించాలంటే ఫ్రిజ్‌పై ఎలాంటి వస్తువులు పెట్టకండి. ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచండి. అంతేకాదు ఫ్రిజ్ లోపలి భాగంలో కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి. అవసరం లేని వస్తువులు పెట్టకండి. (Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)