IRCTC Sankranti Booking: సాధారణంగా రైలు ప్రయాణం ఎంతో సులభం. సుదీర్ఘ గమ్యస్థానాలకు చేరవేస్తుంది. సంక్రాంతికి చాలామంది రైలు ద్వారా సొంతూళ్లకు వెళ్లారు. మరికొందరు బస్సు, ఫ్లైట్ ఇతర సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తారు. ఈ సంక్రాంతి సమయంలో భారీ డిమాండ్ ఉంటుంది కాబట్టి బస్సు, ఫ్లైట్ ధరలు అయితే ఆకాశన్నంటుతాయి. ఇతర ప్రైవేటు వాహనాలు వారు కూడా బాగా డబ్బులు దండుకుంటారు. మీరు సంక్రాంతికి సొంతూరుకు రైలు ద్వారా వెళ్లాలనుకుంటే ముందుగానే ట్రైన్ టిక్కెట్ బుక్ చేసుకోండి.
సాధారణంగా భారతీయ రైల్వేలో ప్రయాణం చేస్తే 60 రోజులు ముందుగానే రిజర్వేషన్ తప్పనిసరి. ఇది కాకుండా ఒకరోజు ముందు తత్కాల్ టిక్కెట్ బుకింగ్ సదుపాయం కూడా ఉంటుంది. భారీ రద్దీ దృష్ట్యా సంక్రాంతికి ఊరెళితే ఎల్లుండి నవంబర్ 14వ తేదీనా మీరు రైలు టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఈరోజు నుంచి రిజర్వేషన్‌లు ప్రారంభం అవ్వనున్నాయి. జనవరి 14వ తేదీ భోగి ఉంది. ఇక పండుగకు రెండు మూడు రోజులు ముందు వెళ్లేవారు కూడా ఈరోజు లేదా రేపు బుక్ చేసుకోవచ్చు.
అయితే, సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా కొన్ని ప్రత్యేక రైళ్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ పండుగ సమయంలో సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది. ఇతర రాష్ట్రాలలో ఉన్నవారు కూడా ఈ పండక్కి తప్పకుండా సొంతూరుకు వెళ్లారు. సంక్రాంతి పండుగ అనేది ఏపీవారికి అయితే ఒక పెద్ద పండుగ. పంట చేతికి వచ్చే సమయం. రంగురంగుల ముగ్గులు, భోగి మంటలు, కోళ్ల పందాలు, ఇంటికి వచ్చే బంధువులతో కిటకిటలాడుతుంది. అందుకే ఎక్కడున్న ఈ సంక్రాంతి పండుగకు సొంతూరుకు వెళ్లారు. సంక్రాంతి పండుగ ఏపీ, తెలంగాణతోపాటు తమిళనాడులో కూడా జరుపుకొంటారు.
భారతీయ రైల్వే కొన్ని పండుగలకు అనుగుణంగా, రద్దీ దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తుంది. దీనికి ముందే మీరు రిజర్వేషన్ చేసుకుంటే ప్రస్తుతం ఉండే రైళ్ల సీట్ రిజర్వేషన్ అవుతుంది. భారతీయ రైల్వేలో జనరల్, స్లీపర్, 3 ఏసీ, 2 ఏసీ, ఫస్ట్ ఏసీ కూడా అందుబాటులో ఉంటుంది. ఒక వేళ మీరు ముందుగా రిజర్వేషన్ చేసుకోకపోతే, ఒక రోజు ముందు తత్కాల్ టిక్కెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ఏసీ ప్రయాణానికి, 11 గంటలకు నాన్ ఏసీ ప్రయాణానికి బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. అయితే, ఇక్కడ కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో టిక్కెట్ బుక్ కాకపోతే ఇబ్బంది