SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఎన్విడియా CEOకు బిగ్ షాక్.. ఒక్కరోజే రూ.17 లక్షల కోట్లు ఆవిరి..!!

Nvidia CEO: ప్రపంచ ప్రఖ్యాత చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియా CEO జెన్సెన్ హువాంగ్ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై వచ్చిన వివాహేతర సంబంధం.. గూఢచర్యం ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.

Written By Bhoomi
Published: Nov 10, 2026, 10:24 AM IST | Updated: Nov 10, 2026, 10:25 AM IST
Image Credit: Nvidia CEO:
Join

Nvidia CEO: ప్రపంచ ప్రఖ్యాత చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియా CEO జెన్సెన్ హువాంగ్  వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై వచ్చిన వివాహేతర సంబంధం.. గూఢచర్యం ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. ఈ పరిణామాల ప్రభావం ఆయన సంపదపై చూపింది.  సోమవారం జరిగిన ట్రేడింగ్‌లో ఒక్కరోజే ఆయన నికర సంపద ఏకంగా 7.4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 69,267 కోట్లు) పడిపోయి.. మొత్తం సంపద 154.7 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 14.40 లక్షల కోట్లు) చేరుకుంది. ఈ భారీ నష్టం కారణంగా ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన 8వ స్థానం నుంచి 10వ స్థానానికి పడిపోయారు.

వివాదానికి అసలు కారణమేంటీ? 
చైనాకు చెందిన బిజినెస్ మెన్ అలిస్ హువాంగ్ తో జెన్సెన్ హువాంగ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ.. వచ్చిన నివేదికలే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని చెప్పాలి. అలిస్ హువాంగ్ ను చైనా ప్రభుత్వ గుఢచారిగా అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జెన్సెన్ హువాంగ్ వ్యక్తిగత సంబంధాలపై ఎన్విడియా బోర్డు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. సోమవారం ప్రీమార్కెట్ ట్రెడింగ్ లో ఎన్విడియా షేర్లు 7శాతం వరకు పడిపోయాయి. సెషన్ సమయంలో 5శాతం నష్టంతో ట్రేడయ్యాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ సుమారు 4.5ట్రిలియన్ డాలర్ల నుంచి భారీగా తగ్గింది. 

క్షమాపణ చెప్పిన సీఈవో: 
ఈ వివాదంపై జెన్సన్ హువాంగ్ స్పందించారు. ఆదివారం తన కంపెనీ ఉద్యోగులకు పంపిన ఒక సందేశంలో, ఆయన తన భార్య లోరీ హువాంగ్‌ను మోసం చేసినట్లు అంగీకరించారు. తన చర్యల వల్ల ఆ కుటుంబానికి కలిగిన మనోవేదనకు ఆయన క్షమాపణ చెప్పారు. ఈ విషయంపై బోర్డు జరిపే విచారణకు తాను పూర్తి మద్దతు ఇస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. కంపెనీ రహస్యాలకు గానీ, జాతీయ భద్రతకు గానీ ఎలాంటి ముప్పు వాటిల్లినట్లు ఆధారాలు లభించలేదని ఎన్విడియా బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వివాదం ఉన్నప్పటికీ, జెన్సన్ హువాంగ్ కంపెనీ సీఈఓగా కొనసాగుతున్నారు.

విడాకుల ఊహాగానాలు:
ఈ వివాదం జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితాన్ని కూడా కుదిపేస్తోంది. 1985లో లోరీని వివాహం చేసుకున్న హువాంగ్ విడాకులు తీసుకుంటున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ వారు విడిపోతే, కాలిఫోర్నియా కమ్యూనిటీ ప్రాపర్టీ చట్టాల ప్రకారం, వారు తమ వివాహ సమయంలో సంపాదించిన ఆస్తులను సమానంగా పంచుకోవాలి. అతని ప్రస్తుత నికర ఆస్తి విలువ 155-162 బిలియన్ డాలర్లుగా అంచనా.  ఇందులో 50 శాతం, అంటే సుమారు 75-81 బిలియన్ డాలర్లు, అతని భార్యకు భరణంగా చెల్లించాల్సి ఉంటుందని  విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, విడాకులకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తుది మొత్తం ఆస్తుల వర్గీకరణ.. ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది.

Also Read: 

 

 

ఉద్యోగులకు సుప్రీం బిగ్ షాక్.. ఆ ఒక్క తప్పు చేస్తే ఇక నేరుగా సస్పెన్షనే..!!

 

 

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు జైలు శిక్ష..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES