ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్ నియామకం..!!
Nvidia CEO: ప్రముఖ చిప్ తయారీ, సెమీకండక్టర్ దిగ్గజం ఎన్విడియా సంస్థ తమ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా జెన్సన్ హువాంగ్‌ను తిరిగి నియమిస్తున్నట్లు వెల్లడించింది.
Nvidia CEO: ప్రముఖ చిప్ తయారీ, సెమీకండక్టర్ దిగ్గజం ఎన్విడియా సంస్థ తమ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా జెన్సన్ హువాంగ్‌ను తిరిగి నియమిస్తున్నట్లు వెల్లడించింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవ ఆమోదంతో ఆయన వెంటనే తిరిగి సంస్థ బాధ్యతలను స్వీకరించారు. సీఈవో పదవితో పాటు, ఆయన ఎన్విడియా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడిగా కూడా కొనసాగనున్నారని సంస్థ ప్రకటించింది.
జెన్సన్ హువాంగ్ విదేశీ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ కు లక్ష్యంగా మారారన్న కథనాలు ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్విడియా బోర్డు స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. చట్టపరమైన నిపుణుల సహాయంతో సమగ్ర దర్యాప్తు చేపట్టింది. ఈ వ్యవహారంలో అమెరికా ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాల నుంచి కూడా బోర్డు కీలక సమాచారాన్ని సేకరించింది. అనంతరం హువాంగ్ తిరిగి విధుల్లో చేరడం వల్ల అమెరికా జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లదని నిర్ధారించుకున్నట్లు సంస్థ తెలిపింది. బోర్డుతో పలు దఫాలుగా జరిగిన విస్త్రుత సమావేశాల తర్వాత.. సంస్థను సమర్ధవంతంగా నడిపించేందుకు ఆయనకున్న నాయకత్వ పటిమ, నిబద్ధతపై బోర్డు పూర్తి సంత్రుప్తి వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా.. ఎన్విడియా బోర్డు ఛైర్మన్ హార్వే సి. జోన్స్ ఒక ప్రకటన విడుదల చేశారు. "ఎన్విడియాను సరైన దిశలో నడిపించడానికి జెన్సన్ హువాంగ్ సరైన వ్యక్తి అని బోర్డు గట్టిగా విశ్వసిస్తోంది. ఆయన తిరిగి రావడం మన వాటాదారులకు, ఉద్యోగులకు, భాగస్వాములకు, వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది." హువాంగ్ గైర్హాజరీలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) తాత్కాలిక CEOగా పనిచేసిన కొలెట్ క్రెస్‌కు జోన్స్ ధన్యవాదాలు తెలిపారు.
తన పునరాగమనంపై స్పందిస్తూ.. జెన్సన్ హువాంగ్, ఒక కొత్త పారిశ్రామిక విప్లవం జరుగుతున్న ఈ కీలక సమయంలో ఎన్విడియాకు మళ్లీ నాయకత్వం వహించే అవకాశం లభించినందుకు గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. "నేను ఈ బాధ్యతను అత్యంత వినయంతో, నూతన అంకితభావంతో స్వీకరిస్తున్నాను. ఈ సమయంలో అచంచలమైన మద్దతు అందించిన బోర్డు సభ్యులకు, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లకు, ఉద్యోగులకు, వాటాదారులకు, పరిశ్రమకు.. ప్రపంచ భాగస్వాములకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అన్నింటికన్నా ముఖ్యంగా, నాకు అండగా నిలిచిన నా కుటుంబానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. కంపెనీ కోసం తిరిగి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను అని తెలిపారు.