• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /Petrol Excise Duty Scrap: కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం.. పెట్రోల్ ఎక్సైజ్ సుంకం రద్దు.. డీజిల్‌పై మరింత పన్ను భారం!

Petrol Excise Duty Scrap: కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం.. పెట్రోల్ ఎక్సైజ్ సుంకం రద్దు.. డీజిల్‌పై మరింత పన్ను భారం!

Petrol Excise Duty Scrapped: అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో నెలకొన్న అస్థిరత, పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంధన ఎగుమతులపై కీలక సవరణలు చేసింది. దేశీయంగా ఇంధన లభ్యతను పెంపొందించడం, విదేశీ ఎగుమతులను నియంత్రించడం లక్ష్యంగా పెట్రోల్ ఎగుమతులపై విధించే ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (SAED) పూర్తిస్థాయిలో రద్దు చేసింది. అదే సమయంలో విదేశాలకు పంపే డీజిల్, విమాన ఇంధనం (ATF)లపై పన్ను భారాన్ని గణనీయంగా పెంచింది.

Written ByHarish Darla
Published: Oct 31, 2026, 06:15 PM IST|Updated: Oct 31, 2026, 06:19 PM IST
joinshare
Petrol Excise Duty Scrap: కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం.. పెట్రోల్ ఎక్సైజ్ సుంకం రద్దు.. డీజిల్‌పై మరింత పన్ను భారం!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Bandi Sanjay: కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగిన బండి సంజయ్‌.. ఏ దేశభక్తులు? అని నిలదీత

Bandi Sanjay: కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగిన బండి సంజయ్‌.. ఏ దేశభక్తులు? అని నిలదీత

2

‘జయంత్ అండ్ ది జింగో పెన్’ కథ చాలా బాగుంది.. థియేటర్ మొత్తం బుక్ చేస్తా: ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

3

Petrol Excise Duty Scrap: కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం.. పెట్రోల్ ఎక్సైజ్ సుంకం రద్దు.. డీజిల్‌పై మరింత పన్ను భారం!

4

చెరువులోకి దూసుకెళ్లిన స్కూల్ వ్యాన్.. నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు..!!

5

Tamil Nadu Health Insurance: తమిళనాడులో ఆరోగ్య బీమా పథకం.. ఆదాయ పరిమితి రూ.2.5 లక్షలకు పెంపు

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Petrol Excise Duty Scrapped: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన రెవెన్యూ విభాగం జారీ చేసిన నూతన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా సవరించిన ఇంధన ఎగుమతి సుంకాలు అమలులోకి వచ్చాయి. ఎగుమతి చేసే ప్రతి లీటరు పెట్రోల్‌పై ఇప్పటివరకు విధిస్తున్న రూ. 2.50 ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేసి జీరోకి (రూ. 0) చేర్చారు.

దీనివల్ల ఎగుమతిదారులకు లబ్ధి చేకూరుతుంది. అయితే దేశీయ అవసరాలకు అనుగుణంగా డీజిల్ నిల్వలను సమృద్ధిగా ఉంచేందుకు హై - స్పీడ్ డీజిల్ ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 8.50 నుండి రూ. 11.50కి పెంచారు. దాంతోపాటు విమానయాన రంగంలో ఉపయోగించే ఏటీఎఫ్ (ATF) ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ. 10.50 నుండి రూ. 11.00కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు

నిర్ణయం వెనుక ప్రధాన కారణాలు..
పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ చమురు సరఫరా మార్గాల్లో అవాంతరాలు ఏర్పడిన తరుణంలో, కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్ పన్ను విధానం ప్రాతిపదికన ఈ సుంకాల సమీక్షను చేపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు భారతీయ రిఫైనరీలు దేశీయ అవసరాలను విస్మరించి విదేశాలకు ఇంధనాన్ని తరలించకుండా నిరోధించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.

కేంద్ర ప్రభుత్వం ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ ముడి చమురు, శుద్ధి చేసిన ఇంధనాల సగటు ధరలను పరిశీలిస్తూ ఈ ఎగుమతి పన్ను రేట్లను సమీక్షిస్తుంది. అక్టోబర్ 16న జరిగిన సమీక్ష అనంతరం, తాజాగా అక్టోబర్ 31 నాటి సమీక్షతో ఈ నూతన ధరలు అమల్లోకి వచ్చాయి.

దేశీయ వినియోగదారులపై ప్రభావం..
ఈ పన్ను సవరణల వల్ల సాధారణ వినియోగదారులకు లభించే స్థానిక పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి ప్రతికూల మార్పు ఉండదు. ఎగుమతి పన్నులు కేవలం విదేశాలకు విక్రయించే ఇంధనానికి మాత్రమే పరిమితమవుతాయి. మన దేశంలోని పెట్రోల్ బంకుల్లో ధరలు అంతర్జాతీయ ముడిచమురు రకం, కేంద్ర ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర వ్యాట్, రవాణా వ్యయం, డీలర్ కమీషన్లపై ఆధారపడి నిర్ణయిస్తారు.

ఎగుమతి సుంకాలు పెరగడం వలన భారతీయ చమురు శుద్ధి సంస్థలు విదేశీ విక్రయాల కంటే దేశీయ కొనుగోలుదారులకే ప్రాధాన్యత ఇస్తాయి. ఫలితంగా స్థానిక మార్కెట్‌లో ఇంధన సరఫరా స్థిరంగా ఉండేందుకు దోహదపడుతుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Petrol Price
Business News
Telugu News