• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /‘జయంత్ అండ్ ది జింగో పెన్’ కథ చాలా బాగుంది.. థియేటర్ మొత్తం బుక్ చేస్తా: ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

‘జయంత్ అండ్ ది జింగో పెన్’ కథ చాలా బాగుంది.. థియేటర్ మొత్తం బుక్ చేస్తా: ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

Jayanth And The Jingo Pen: విద్యా వ్యవస్థలోని వాస్తవ పరిస్థితులు, పిల్లల మనోభావాలు, గురుశిష్యుల అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ నవీన్ బోయిన దర్శకత్వంలో ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమా రూపొందింది. బాలల దినోత్సవ కానుకగా నవంబర్ 12న థియేటర్లలోకి రానుండగా.. తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ లాంట్ చేశారు.

Written ByAshok Krindinti
Published: Oct 31, 2026, 06:44 PM IST|Updated: Oct 31, 2026, 06:47 PM IST
joinshare
‘జయంత్ అండ్ ది జింగో పెన్’ కథ చాలా బాగుంది.. థియేటర్ మొత్తం బుక్ చేస్తా: ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
కాలేజీ అమ్మాయిలే టార్గెట్‌‎.. రూ.లక్షల్లో ఆఫర్ చూపి అండాల సేకరణ.. వెలుగులోకి సంచలన విషయాలు..!!

కాలేజీ అమ్మాయిలే టార్గెట్‌‎.. రూ.లక్షల్లో ఆఫర్ చూపి అండాల సేకరణ.. వెలుగులోకి సంచలన విషయాలు..!!

2

Bandi Sanjay: కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగిన బండి సంజయ్‌.. ఏ దేశభక్తులు? అని నిలదీత

3

‘జయంత్ అండ్ ది జింగో పెన్’ కథ చాలా బాగుంది.. థియేటర్ మొత్తం బుక్ చేస్తా: ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

4

Petrol Excise Duty Scrap: కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం.. పెట్రోల్ ఎక్సైజ్ సుంకం రద్దు.. డీజిల్‌పై మరింత పన్ను భారం!

5

చెరువులోకి దూసుకెళ్లిన స్కూల్ వ్యాన్.. నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jayanth And The Jingo Pen: ప్రస్తుత విద్యా వ్యవస్థ తీరుతెన్నులు.. విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు, తల్లిదండ్రులు, గురువుల ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తూ రూపొందిన లేటెస్ట్ మూవీ ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. నమో జయం ప్రొడక్షన్స్ పతాకంపై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మించారు.  మాస్టర్ జయంత్ బొలిశెట్టి, మన శంకర వర ప్రసాద్ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది. బాలల దినోత్సవ కానుకగా నవంబర్ 12న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. చిన్నారులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ కలిసి సినిమాను చూడాలని మేకర్స్ కోరుతున్నారు.

ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా హాజరైన ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా కథ చాలాబాగుందని చెప్పారు. హిందీలో వచ్చిన తారే జమీన్ పర్ సినిమా ఎంతటి విజయం సాధించిందో.. తెలుగులో ఈ మూవీ అంతటి ఘన విజయాన్ని సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తాను ఉపాధ్యాయుడిగా పనిచేశానని.. పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అన్నారు. మొదటి రోజే ప్రత్యేకంగా ఒక థియేటర్ హాల్ బుక్ చేసి.. ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ఈ సినిమాను చూస్తానని ఆయన తెలిపారు.

ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలోని లోపాలను, విద్యార్థుల సమస్యలను ఎత్తిచూపేలా ఈ సినిమా ఉంటుందన్నారు. తల్లిదండ్రులు, గురువుల గొప్పదనాన్ని చాటే ఈ మూవీ.. ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుందన్నారు. ప్రతీ స్టూడెంట్, ప్రతీ పేరెంట్, ప్రతి టీచర్ చూడాల్సిన సినిమా అన్నారు. కేవలం మార్కుల ఆధారంగా కాకుండా.. విద్యార్థుల అంతరంగాన్ని అర్థం చేసుకోవాలనే సందేశాన్ని ప్రేమతో తెరపైకి తెచ్చామని ఈ సినిమా నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి తెలిపారు.

దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ.. ఇలాంటి ఆలోచింపజేసే కళాత్మక సినిమాలు చాలా అరుదుగా వస్తాయని.. సమాజానికి మంచిని చేరవేసే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ కలిసి ఈ మూవీని చూడాలన్నారు. ఈ సినిమా ‘తారే జమీన్ పర్’ కంటే మరింత భావోద్వేగభరితంగా అలరిస్తుందని నటుడు ఆశిష్ గాంధీ ప్రశంసించారు. మాస్టర్ జయంత్ నటన ఎంతో సహజంగా, అద్భుతంగా ఉందని నటుడు సత్యం రాజేష్ కొనియాడారు. 

టెక్నీకల్ టీమ్:

  • బ్యానర్: నమో జయం ప్రొడక్షన్స్
  • నిర్మాత: దివ్య ప్రవీణ్ బొలిశెట్టి
  • దర్శకత్వం: నవీన్ దేశబోయిన
  • సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్రూ బాబు
  • సంగీతం: మోహిత్ కులకర్ణి
  • సాహిత్యం, బాణీలు: ప్రవీణ్ బొలిశెట్టి
  • కూర్పు: నందమూరి హరి, తారక రామారావు
  • కళా దర్శకత్వం: టి. నాని
  • ప్రొడక్షన్ కంట్రోలర్: తాజ్ బాషా
  • PRO: సాయి సతీష్
  • డిజిటల్ ప్రమోషన్స్: ఇషాన్వి మీడియా, స్టార్ సర్కిల్
  •  

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu Movie
Hyderabad