SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Reliance Jio IPO 2026: రిలయన్స్ జియో మెగా ఐపీఓ.. జీ మీడియా 14 సూటి ప్రశ్నలు ఇవే..!

Zee Media Questions to Reliance Jio CEO: రిలయన్స్ జియో మెగా ఐపీఓ వేళ మార్కెట్ వర్గాల్లో పలు కీలక అంశాలు చర్చనీయాంశంగా మారాయి. అక్టోబర్ 21-23 తేదీల్లో రానున్న రూ.30 వేల కోట్ల పబ్లిక్ ఇష్యూ లక్ష్యాలపై ప్రెస్‌మీట్‌లో జీ మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. నేరుగా సమాధానం చెప్పలేక సీఈఓ ఈమెయిల్ కోరగా.. జీ మీడియా పంపిన ఆ 14 ప్రశ్నలను మెయిల్ చేసింది. వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Oct 16, 2026, 01:51 PM IST | Updated: Oct 16, 2026, 01:53 PM IST
Image Credit: Zee Media Questions to Reliance Jio CEO (AI)
Join

Zee Media Questions to Reliance Jio CEO: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ రూ.30 వేల కోట్ల సమీకరణ లక్ష్యంతో మెగా ఐపీఓకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 21 నుంచి 23 వరకు సాధారణ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం ఈ ఐపీఓ అందుబాటులో ఉండనుంది. ఈ నేపథ్యంలో ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పత్రికా సమావేశంలో జీ మీడియా రిలయన్స్ జియో IPOకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగింది. ఈ ప్రశ్నలకు రిలయన్స్ జియో సీఈఓ స్పందిస్తూ.. దయచేసి ఈ ప్రశ్నలను తనకు ఈమెయిల్ చేయాలని కోరారు. జీ మీడియా కూడా ఈ ప్రశ్నలను రిలయన్స్ జియో సీఈఓకు ఇమెయిల్ చేసింది. ఆ 14 ప్రశ్నల పూర్తి వివరాలు ఇలా.. 

1. ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో 90 శాతానికి పైగా కొత్త వ్యాపార విస్తరణకు కాకుండా పాత అప్పులు తీర్చడానికే కేటాయిస్తున్నప్పుడు.. భవిష్యత్ వృద్ధిపై దృష్టి పెట్టకుండా కొత్తగా వచ్చే పబ్లిక్ ఇన్వెస్టర్లతో పాత అప్పులు కట్టించడం ఎంతవరకు సమంజసం..?

2. పన్ను రహిత వర్టికల్ డీమెర్జర్ ద్వారా జియో షేర్లను నేరుగా ఆర్‌ఐఎల్ (RIL) ప్రస్తుత వాటాదారులకే కేటాయించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న వాటాను తగ్గించుకుంటూ కొత్త మూలధనాన్ని తీసుకువచ్చే మార్గాన్ని బోర్డు ఎందుకు ఎంచుకుంది..?

3. దేశ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు స్వచ్ఛమైన టెలికాం, టెక్ ఆస్తిగా జియో ప్లాట్‌ఫామ్స్‌లోనే నేరుగా పెట్టుబడులు పెట్టే అవకాశం లభిస్తే, ఈ లిస్టింగ్ కారణంగా ఆర్‌ఐఎల్‌పై శాశ్వతంగా హోల్డింగ్-కంపెనీ డిస్కౌంట్ పడి మాతృ సంస్థ వాల్యుయేషన్ పరిమితం కాదా..?

4. జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఆర్‌ఐఎల్ దాదాపు 66.4 శాతం వాటాను కలిగి ఉంది. అంటే ఐపీఓ రోజున అందించే ప్రతి రూపాయి తగ్గింపు.. ఆర్‌ఐఎల్ దీర్ఘకాల వాటాదారుల నుంచి కొత్త ఇన్వెస్టర్లకు సంపదను బదిలీ చేసినట్లు అవుతుంది. లిస్టింగ్ మొదటి రోజే షేరును పరుగులు పెట్టించడానికే ఈ ప్రైస్ బ్యాండ్‌ను ఉద్దేశపూర్వకంగా తక్కువగా నిర్ణయించారా..? లేక ఇన్‌స్టిట్యూషనల్ రోడ్‌షోలలో సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన స్పందన వల్లే వాల్యుయేషన్ తగ్గిందా..?

5. కంపెనీ షేర్లలో మార్కెట్ ట్రేడింగ్ కోసం కేవలం 3 శాతం కంటే తక్కువ షేర్లను మాత్రమే అందుబాటులో ఉంచినప్పుడు, లిస్టింగ్ రోజున ఏర్పడే ధర వాస్తవ మార్కెట్ డిమాండ్‌ను ప్రతిబింబిస్తుందా..? లేక కృత్రిమ సరఫరా కొరత, పాసివ్ ఇండెక్స్ పరిమితుల వల్ల ఏర్పడేదా..?

6. ప్రస్తుతం ప్రకటించిన వాల్యుయేషన్‌ను "చారిత్రాత్మక విలువ"గా పేర్కొంటున్నప్పుడు, 2020లో పెట్టుబడులు పెట్టిన ప్రీ-ఐపీఓ ఇన్వెస్టర్లు లేదా ప్రమోటర్లు తమ వాటాలను ఎందుకు విక్రయించడం లేదు..? అలాగే రిటైల్ ఇన్వెస్టర్లు గమనించాల్సిన లాక్-ఇన్ తేదీలు ఏంటి..?

7. 'జియో' అనే ప్రధాన బ్రాండ్ ట్రేడ్‌మార్క్ పూర్తి యాజమాన్యం జియో ప్లాట్‌ఫామ్స్ చేతిలో లేదు. భవిష్యత్‌లో ఇదే బ్రాండ్ పేరుతో ఉన్న మరో గ్రూప్ కంపెనీకి ఏదైనా నష్టం వాటిల్లితే.. లిస్టెడ్ వాటాదారులను కాపాడే చట్టపరమైన రక్షణలు ఏమున్నాయి..? భవిష్యత్‌లో కంపెనీపై బ్రాండ్ లైసెన్సింగ్ ఫీజులు విధించే అవకాశం ఉందా..?

8. రెండు సంస్థలకూ ప్రమోటర్లు ఒకరే అయినప్పుడు.. కస్టమర్ అక్విజిషన్ ఖర్చులు, కమీషన్లు, రిలయన్స్ రిటైల్‌తో పంచుకునే నిర్వహణ వ్యయాలు నిష్పాక్షికమైన మార్కెట్ ధరల ప్రకారమే జరుగుతున్నాయని నిర్ధారించడానికి మీ దగ్గరున్న స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థలేమిటి..?  

9. జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి బయటి పబ్లిక్ మైనారిటీ ఇన్వెస్టర్లు అడుగుపెడుతున్నప్పుడు.. అధిక లాభాలు తెచ్చిపెట్టే వ్యాపారాలను జియో పరిధిలోనే కొనసాగించాలా లేక నేరుగా మాతృసంస్థ ఆర్‌ఐఎల్ (RIL) నియంత్రణలోనే ఉంచాలా అనే అంశాన్ని నిర్ణయించే అధికారిక, లిఖితపూర్వక కార్పొరేట్ పాలనా విధానం ఏమైనా ఉందా..?

10. దశాబ్ద కాలంగా వేల కోట్ల రూపాయల మూలధన వ్యయం చేసినప్పటికీ, మూలధనంపై వచ్చే రాబడి (ROCE) దాదాపు 8% వద్దే స్తంభించిపోయింది. అలాంటప్పుడు ఈ లిస్టింగ్ తర్వాత మూలధన క్రమశిక్షణ పాటించి, వాటాదారులకు నగదు రాబడులు మెరుగుపరుస్తారని మార్కెట్లు ఎలా నమ్మాలి..?

11. గత మూడేళ్లుగా ఆర్‌ఐఎల్ షేరు కదలికలు నిస్తేజంగా ఉండగా.. 2026 నాటికే మార్కెట్ విలువ దాదాపు రూ.4 లక్షల కోట్ల మేర క్షీణించింది. గ్రూప్ స్థాయిలో $125 బిలియన్లకు పైగా భారీ మూలధనం వెచ్చించిన తర్వాత కూడా వాటాదారుల సంపదలో ఈ క్షీణతను మీరు ఎలా సమర్థిస్తారు..?

12. 2019 ఏజీఎంలో రిలయన్స్ రిటైల్ రాబోయే ఐదేళ్లలో లిస్ట్ అవుతుందని వాటాదారులకు ఇచ్చిన హామీని ఇప్పుడు 2028కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ సవరించిన గడువునైనా మార్కెట్లు ఎందుకు నమ్మాలి..?

13. వారసులుగా ఆకాష్ (జియో), ఇషా (రిటైల్), అనంత్ (న్యూ ఎనర్జీ) తమ విభాగాలకు నేతృత్వం వహిస్తున్నారు. ఈ భారీ విభాగాలు మాతృసంస్థ బ్యాలెన్స్ షీట్ నుంచి పెట్టుబడుల కోసం పోటీపడుతున్నప్పుడు, అంతర్గత మూలధన కేటాయింపునకు అనుసరిస్తున్న నిర్దిష్ట ఫ్రేమ్‌వర్క్ ఏమిటి..?

14. కంపెనీ ఉన్నత స్థాయి యాజమాన్య పరిహారాలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు, నాయకత్వ వారసత్వ ప్రమాణాలు RIL షేరు ధర పెరుగుదల, ఏకీకృత ROCE పనితీరుతో ముడిపడి ఉన్నాయా..? లేదా కేవలం ఆస్తుల విస్తరణ, బ్యాలెన్స్ షీట్ పరిమాణాన్ని బట్టి మాత్రమే నిర్ణయిస్తున్నారా..?

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES