Bhuvneshwar Kumar: వెస్టిండీస్తో ఐదు టీ20 మ్యాచ్కు ముందు టీమిండియాలో కీలక మార్పు చోటుచేసుకుంది. స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ గాయపడటంతో వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు సెలెక్టర్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా అధికారిక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్లో అర్ష్దీప్ సింగ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో భుజానికి గాయమైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని భువనేశ్వర్ కుమార్ను జట్టులోకి తీసుకున్నారు. చివరి T20 మ్యాచ్లో అర్షదీప్ పాల్గొంటారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. పరిస్థితిని బట్టి బట్టి మ్యాచ్కు ముందు నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రస్తుతం అర్ష్దీప్ సింగ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. శనివారం బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో వెస్టిండీస్తో చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్ సమయానికి అర్ష్దీప్ కోలుకునే తీరును బట్టి అతడు బరిలోకి దిగేదీ లేనిదీ నిర్ణయించనున్నారు. ముందుజాగ్రత్త చర్యగా భువనేశ్వర్ కుమార్ను జట్టులో చేర్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు వెటరన్ పేసర్, స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్ కుమార్ను జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పవర్ప్లేతో పాటు డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేయడంలో భువీకి ఉన్న అపార అనుభవం జట్టుకు కీలకం కానుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. చాలా కాలం తర్వాత భువనేశ్వర్ న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు ఎంపికైన భూవీ.. ముందుగానే జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పించుకున్న ఈ సిరీస్లో భూవీ బౌలింగ్ టీమిండియాకు కచ్చితంగా ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఐదు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం 2-2 సమానంగా ఉంది. మొదటి మ్యాచ్లో భారత్ గెలవగా.. రెండో మ్యాచ్లో విండీస్ విజయం సాధించింది. మూడో మ్యాచ్లో భారత్ గెలుపొందగా.. నాలుగో మ్యాచ్లో వెస్టిండీస్ విజయం సాధించి సిరీస్ను సమం చేసింది. రేపు మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ను సొంతం చేసుకుంటుంది.
భారత టీ20 జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, నమన్ ధీర్, భువనేశ్వర్ కుమార్.