Nagamani Viral Video: సోషల్ మీడియాల్లో ఎన్నో రకాల వింతైన, అరుదైన విషయాలు రోజు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ హల్చల్ అవుతోంది. అత్యంత ప్రమాదకరమైన నాగుపాముకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పురాణాలతో పాటు సినిమాలలో మాత్రమే.. చూస్తున్నామనుకునే అత్యంత అరుదైన నాగమణికి ఓ పాము ప్రత్యక్షంగా కాపాలా కాస్తున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే, ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. అత్యంత విషపూరితమైన ఓ కింగ్ కోబ్రా చీకటి ప్రదేశంలో అత్యంత కోపంగా పడగ విప్పి కూర్చుని ఉండడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఆ పాము కదలికలు చాలా వింతగా ఉండడం మీరు క్లియర్గా చూడోచ్చు.. దాని పడగ పైభాగం నుంచి కిందకు జారిన ఓ నాగమణి కాంతివంతంగా మెరవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మణి చుట్టూ ఎలాంటి వెలుతురు లేకపోయినా.. దాని కాంతితో అది ప్రకాశిస్తుండటం ఆశ్యర్యం కలిగిస్తోంది..
అంతేకాకుండా.. ఆ విలువైన మణికి ఏమాత్రం ప్రమాదం కలగకుండా... దాని చుట్టూనే చుట్టుకుని పాము కాపాలా కాస్తున్న తీరు అందరినీ అశ్యర్యం కలిగించేలా చేస్తోంది.. ఆ పాము చూపులు.. దాని ఆగ్రహం చూస్తుంటే ఎవరైనా దాని దగ్గరికి వెళ్లడానికి వణికిపోవాల్సిందే అన్నట్లు అనిపోస్తోంది. ఈ సమయంలో ఆ పాము దగ్గరకు వెళ్తే తప్పకుండా.. అది కాటేసే అవకాశాలు కూడా ఉన్నాయి..
పాములు మణులను రక్షించే ఒక వింత.. మన దేశంలో ప్రాచీనకాలం నుంచి ఉందని సమాచారం. అయితే, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ.. కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని చూసి సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజమైన మణేనా?.. లేక విజువల్ ఎఫెక్టా? అంటూ కొందరు కామెంట్లు కూడా పెడుతూ వస్తున్నారు. మరికొందరు ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉంటాయని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ.. ప్రస్తుతం ఈ అరుదైన కింగ్కోబ్రాకు సంబంధించిన వీడియో ఊహించని స్థాయిలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.