Kalki 2nd Part: ‘కల్కి 2898 AD మొదటి భాగంలో సుమతిగా మెప్పించిన దీపికా పదుకొణె .. ఈ మూవీ నుంచి తప్పుకుంది. ఇపుడా ఆ క్యారెక్టర్ ఎవరు పోషించబోతున్నారు. అసలు దీపికను రీప్లేస్ చేయబోతున్న కథానాయిక ఎవరెనది గత కొన్ని రోజులుగా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న మాట.
‘కల్కి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దాంతో పాటు పలు జాతీయ అవార్డులను కొల్లగొట్టింది. ఈ విజువల్ వండర్‌కు సీక్వెల్‌గా రాబోతున్న కల్కి 2 షూటింగ్ మొదలైనప్పటికీ.. ప్రభాస్ వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల కొన్నాళ్ల పాటు ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. తాజాగా నాగ్ అశ్విన్ మళ్లీ రంగంలోకి దిగి.. అక్టోబర్ ఎండింగ్ నుంచే మెయిన్ కాస్ట్‌తో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.
కల్కి లో సుమతి క్యారెక్టర్లో సాయి పల్లవి.. ?
కల్కిలో సుమతిగా మెప్పించిన దీపికా పదుకొణె రెండో భాగంలో లేరు.. ఆమె స్థానంలో సాయి పల్లవిని తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నవంబర్ నుంచి ఆమె షూటింగ్లో జాయిన్ కానున్నారనే టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ.. సాయి పల్లవి ఎంట్రీ మాత్రం దాదాపు లాక్ అయిపోయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రామాయణతో బిజీగా ఉంది.
సాయి పల్లవి పాత్రపై రానీ క్లారిటీ..
సుమతి పాత్రనే సాయిపల్లవి రీప్లేస్ చేస్తున్నారా లేదంటే మరో పాత్ర చేస్తున్నారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కథలో కీలక పాత్ర కావడంతో.. ఆమె క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందనే దానిపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఫౌజీ సినిమాకు సంబంధించి ప్రభాస్ షూట్ కంప్లీటైంది. మరోవైపు డిసెంబర్ వరకు ‘స్పిరిట్’ మూవీ ఆల్మోస్ట్ కంప్లీట్ కానుంది. ఇక ప్రభాస్ ఓ వైపు ‘స్పిరిట్’ మూవీ చేస్తూనే మరోవైపు ‘కల్కి 2’ కు అక్టోబర్ నుంచే డేట్స్ ఇచ్చారని తెలుస్తుంది. మరోవైపు జనవరి నుంచి ప్రభాస్ ‘సలార్ 2’ షూటింగ్లో జాయిన్ కానున్నట్టు సమాచారం.