• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /PPF, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లపై కేంద్రం గుడ్‌న్యూస్.. కొత్త రూల్స్ తెలుసా..!

PPF, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లపై కేంద్రం గుడ్‌న్యూస్.. కొత్త రూల్స్ తెలుసా..!

Small Savings Interest Rates 2026: అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి గాను పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) తదితర పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడంతో పాటు నేటి నుంచి ఖాతాల నిర్వహణకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి.

Written ByAshok Krindinti
Published: Oct 01, 2026, 01:06 PM IST|Updated: Oct 01, 2026, 01:09 PM IST
joinshare
PPF, సుకన్య సమృద్ధి వడ్డీ రేట్లపై కేంద్రం గుడ్‌న్యూస్.. కొత్త రూల్స్ తెలుసా..!
Image Credit: Small Savings Interest Rates (Source: File)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Small Savings Interest Rates 2026: స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి వడ్డీ రేట్లను కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లనే కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. అంటే అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు వివిధ చిన్న పొదుపు పథకాలకు వర్తించే వడ్డీ రేట్లు జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి ఉన్న రేట్లే వర్తిస్తాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) వంటి పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ యథాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు అక్టోబర్ 1 నుంచి ఖాతాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు కూడా అమల్లోకి వస్తున్నాయని పేర్కొంది.

వివిధ పథకాల వారీగా వడ్డీ రేట్ల వివరాలు ఇలా..

సుకన్య సమృద్ధి యోజన (SSY): 8.2 శాతం
పీపీఎఫ్ (PPF): 7.1 శాతం
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS): 8.2 శాతం
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC): 7.7 శాతం
కిసాన్ వికాస్ పత్ర (KVP): 7.5 శాతం
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS): 7.4 శాతం
పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్: 4.0 శాతం
టైమ్ డిపాజిట్లు (1 నుంచి 5 సంవత్సరాలు): 6.9 నుండి 7.5 శాతం వరకు

నేటి నుంచి అమల్లోకి వచ్చిన రూల్స్ ఇవే..

సుకన్య సమృద్ధి యోజన (SSY): తల్లిదండ్రులు కాకుండా ఇతరులు తెరిచిన ఖాతాలను ఇకపై సహజసిద్ధమైన తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకుల పేరిట తప్పనిసరిగా బదిలీ చేయాలి. ఒకే చిన్నారి పేరిట నిబంధనలకు విరుద్ధంగా రెండు కంటే ఎక్కువ ఖాతాలు తెరిచి ఉంటే.. అదనపు ఖాతాలను రద్దు చేస్తారు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): మైనర్ పేరిట తెరిచిన పీపీఎఫ్ ఖాతాకు సంబంధించి.. ఆ చిన్నారికి 18 ఏళ్లు నిండే వరకు పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా వడ్డీ (ప్రస్తుతం 4%) మాత్రమే లభిస్తుంది. 18 ఏళ్లు దాటిన తర్వాతే పూర్తిస్థాయి పీపీఎఫ్ వడ్డీ వర్తిస్తుంది. ఒకరి పేరిట ఒకటికి మించి పీపీఎఫ్ ఖాతాలు ఉంటే.. రెండో ఖాతాను ప్రైమరీ ఖాతాతో విలీనం చేస్తారు. నిబంధనలకు విరుద్ధంగా అదనంగా కొనసాగించిన ఖాతాలపై వడ్డీ లభించదు.

చిన్న మొత్తాల పొదుపు పథకాల్లోని అవకతవకలను సరిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తోంది. వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడంతో పెట్టుబడిదారులకు భరోసా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి త్రైమాసికానికి ఒకసారి ఈ వడ్డీ రేట్లను కేంద్రం సమీక్షిస్తుంది. తాజా నిర్ణయంతో పండుగల సీజన్‌లో సురక్షితమైన రాబడులను ఆశించే సామాన్య మదుపరులకు, సీనియర్ సిటిజన్లకు ఉపశమనం లభించింది.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Govt Schemes