• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /supreme court UPI: యూపీఐ ఛార్జీలపై స్టే‌కు సుప్రీంకోర్టు నిరాకరణ..అక్టోబరు 15 నుంచి ఛార్జీలు అమలు!

supreme court UPI: యూపీఐ ఛార్జీలపై స్టే‌కు సుప్రీంకోర్టు నిరాకరణ..అక్టోబరు 15 నుంచి ఛార్జీలు అమలు!

Supreme Court On UPI MDR: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా జరిపే డిజిటల్ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించి మధ్యంతర స్టే ఇవ్వాలని పిల్ దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణ జరిపిన కోర్టు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో అక్టోబరు 15 నుంచి ఈ కొత్త నిబంధనలు యథాతథంగా అమల్లోకి రానున్నాయి.

Written ByHarish Darla
Published: Sep 28, 2026, 02:32 PM IST|Updated: Sep 28, 2026, 02:42 PM IST
joinshare
supreme court UPI: యూపీఐ ఛార్జీలపై స్టే‌కు సుప్రీంకోర్టు నిరాకరణ..అక్టోబరు 15 నుంచి ఛార్జీలు అమలు!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Supreme Court On UPI MDR: అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న కొత్త యూపీఐ నిబంధనలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా స్టే విధించకపోవడంతో.. షెడ్యూల్ ప్రకారమే మోదీ సర్కార్ కొత్త ఛార్జీలను అమలులోకి తీసుకొచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను వివరిస్తూ వివరణాత్మక అఫిడవిట్ సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)ని కోర్టు ఆదేశించింది

ఛార్జీల స్వరూపం, మినహాయింపులు.. 
సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. వ్యక్తుల నుంచి వ్యాపారులకు జరిగే డిజిటల్ యూపీఐ లావాదేవీలు రూ. 2,000కు మించితే ప్రతి లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. రూ. 75,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఉన్న లావాదేవీలకు గరిష్ఠంగా రూ. 300 వరకు మాత్రమే రుసుము వసూలు చేస్తారు. అయితే సాధారణ వినియోగదారులు, చిన్న వ్యాపారులపై భారం పడకుండా పలు మినహాయింపులు కల్పించారు.

వ్యక్తుల మధ్య (P2P) లావాదేవీలు జరిపే వాటిపై ఎలాంటి ఛార్జీలు లేకుండా పూర్తిగా ఉచితంగా ఉంటాయి. అలాగే వ్యాపారులకు చెల్లింపుల్లో రూ. 2,000 లోపు చేసే చెల్లింపులపై ఎలాంటి రుసుము ఉండదు.

అదే విధంగా చిన్న వ్యాపారులు.. యూపీఐ క్యూఆర్ కోడ్‌ల ద్వారా నెలకు రూ.1 లక్ష వరకు చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారులకు 'సున్నా-ఎండీఆర్' నిబంధన వర్తిస్తుంది. మరోవైపు ప్రత్యేక సేవలైన అత్యావసర సేవలకు ఫ్లాట్‌గా రూ.5, క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలకు 0.02 శాతం చొప్పున తక్కువ ఛార్జీలు వర్తిస్తాయి.

కేంద్ర ప్రభుత్వ వాదన..
విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ.. ఈ కొత్త నిబంధనల వల్ల దాదాపు 96 శాతం మర్చంట్ లావాదేవీలపై ఎటువంటి ప్రభావం ఉండదని తెలిపారు. ఇది ప్రభుత్వ ఆదాయం కోసం విధించే పన్ను కాదని, డిజిటల్ పేమెంట్ వ్యవస్థ నిర్వహణలో భాగమైన ఒక సెటిల్‌మెంట్ ఫీజు మాత్రమేనని వివరించారు.

అలాగే ఈ ఛార్జీలను నేరుగా వినియోగదారుల నుంచి వసూలు చేయరని స్పష్టం చేశారు. కేంద్రం సమర్పించే వివరణ పరిశీలించిన పిమ్మట సుప్రీంకోర్టు ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Business News
Telugu News
Supreme Court