SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Zee Entertainment: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏఐ, ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా తుషార్‌ వొహ్రా నియామకం

Zee Entertainment Enterprises Ltd: విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న జీ ఎంటైర్‌టెన్‌మెంట్‌ సంస్థ మరింత అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం వినియోగించుకోనుంది. ఈ క్రమంలోనే కృత్రిమ మేధాను వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించగా.. ఈ క్రమంలో కంపెనీలో కీలక నియామకం జరిగింది.

Written By Ravi Kumar Sargam
Published: Nov 02, 2026, 05:28 PM IST | Updated: Nov 02, 2026, 05:37 PM IST
Image Credit: Zee Entertainment
Join

Tushar Vohra: జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రేక్షకులకు అత్యంత వినోదాత్మక కార్యక్రమాలు అందిస్తోంది. కృత్రిమ మేధ (ఏఐ)ని వినియోగంలో కీలకంగా ఉన్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కీలక నియామకాన్ని పూర్తి చేసింది. ఏఐ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అధికారిగా తుషార్‌ వొహ్రాను జీ సంస్థ నియమించింది. భవిష్యత్‌ ప్రణాళికల్లో భాగంగా ఈ కీలక నియామకం జరిగింది.

భవిష్యత్తుకు తగిన సాంకేతిక సంస్థగా రూపాంతరం చెందడంలో భాగంగా.. ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ కీలక పరిణామాలు చేపట్టింది. కృత్రిమ మేధస్సు (ఏఐ), నూతన ఆవిష్కరణలు, సంస్థవ్యాప్త మార్పులకు పెద్దపీట వేస్తూ.. కంపెనీ తన సాంకేతిక శక్తిని మరింత పటిష్టం చేసుకునేందుకు నూతన నాయకత్వ బృందాన్ని నియమించింది. కంపెనీ తన సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించుకునే ఉద్దేశంతో తుషార్ వోహ్రాను చీఫ్ ఏఐ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫీసర్‌గా నియమించింది.

చీఫ్ ఏఐ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫీసర్‌గా తుషార్‌ వోహ్ర ముంబైలోని ప్రధాన కార్యాలయం కేంద్రంగా పనిచేయనున్నారు. కంపెనీ డిప్యూటీ సీఈఓ, సీఎఫ్‌ఓ ముకుంద్ గాల్గానికి ఆయన రిపోర్ట్ చేస్తారు. ఈ పదవిలో తుషార్ వోహ్రా కంపెనీ ఏఐ వ్యూహం, ఎంటర్‌ప్రైజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ రోడ్‌మ్యాప్‌ను నడిపిస్తారు. సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో వ్యాపార పనితీరును మెరుగుపరచడం తుషార్‌ వోహ్ర ప్రధాన బాధ్యత. కంటెంట్, సృజనాత్మకతను సాంకేతికతతో జోడించి మరింత ఆకర్షణీయమైన, వ్యక్తిగతీకరించిన వినోద అనుభవాలను ప్రేక్షకులకు అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకోగా అందులో భాగంగా ఈ కీలక నియామకం జరిగింది.

సాంకేతిక నాయకత్వ బృందం పటిష్టత
ఈ వ్యూహాత్మక మార్పులో భాగంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలో కీలక నియామకాలు జరిగాయి. తుషార్ వోహ్రా ఆధ్వర్యంలో పనిచేసేందుకు పలువురు అనుభవజ్ఞులను టెక్నాలజీ లీడర్‌షిప్ టీమ్‌లోకి వచ్చారు.
టోనీ థామస్ (ఏఐ, ట్రాన్స్‌ఫర్మేషన్ హెడ్‌): ఏఐ-నేతృత్వంలోని మార్పులు, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డెవ‌ప్స్ విభాగాలలో 18 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న టోనీ పెద్ద ఎత్తున సాంకేతిక మార్పులు తీసుకురావడంలో నిపుణులు.

అశుతోష్ శుక్లా (ఆపరేషన్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ హెడ్): టెక్నాలజీ లీడర్‌షిప్, బిజినెస్ ఆపరేషన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాలలో 24 ఏళ్ల అనుభవం కలిగిన అశుతోష్ సంస్థలో కొత్త మార్పులను ముందుకు నడిపిస్తారు.

వివేక్ పాండే (ట్రాన్స్‌ఫర్మేషన్ లీడ్ - అడ్వర్టైజ్‌మెంట్ ఆపరేషన్స్ అండ్ సేల్స్): డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, అడ్వర్టైజింగ్ టెక్నాలజీ, రెవెన్యూ వ్యూహాలలో విస్తృత అనుభవం ఉన్న వివేక్ ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్‌) కార్యకలాపాలను మరింత ఆప్టిమైజ్ చేయడంలో కృషి చేస్తారు.

ఈ కీలక నియామకాలపై జీ ఎంటర్‌టైన్‌మెంట్ డిప్యూటీ సీఈఓ & సీఎఫ్‌ఓ ముకుంద్ గాల్గాని స్పందిస్తూ.. 'కంపెనీ వృద్ధికి సాంకేతికతను ఒక ఉత్ప్రేరకంగా మార్చడమే మా లక్ష్యం. మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా విభిన్న అనుభవాలను సృష్టించడం దీర్ఘకాలిక విజయానికి ముఖ్యం. తుషార్, ఆయన బృందం అద్భుతమైన ట్రాక్ రికార్డ్ కలిగి ఉన్నారు. భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సామర్థ్యాలను వ్యాపారంలోకి తీసుకురావడానికి ఈ నియామకాలు నిదర్శనం' అని తెలిపారు.

ఏఐ, ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫీసర్ హెడ్‌ తుషార్ వోహ్రా స్పందిస్తూ.. 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ ఆవిష్కరణలు వ్యాపార ప్రక్రియలను మార్చడంలో అపారమైన అవకాశాలను అందిస్తాయి. టెక్నాలజీతో కూడిన భవిష్యత్తు కలిగిన సంస్థగా 'జీ' మారుతున్న ప్రయాణంలో భాగస్వామ్యం కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది' అని తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES