• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /కెరీర్
  • /కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ITBP లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ!10వ తరగతి అర్హతతో ఇలా దరఖాస్తు చేసుకోండి!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ITBP లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ!10వ తరగతి అర్హతతో ఇలా దరఖాస్తు చేసుకోండి!

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP)కి సంబంధించిన భారీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది ఒక గొప్ప వార్త. గ్రూప్ సి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ స్పోర్ట్స్ కోటాలో ఈ భర్తీలు జరగనున్నాయి. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Oct 04, 2026, 02:07 PM IST|Updated: Oct 04, 2026, 02:24 PM IST
joinshare
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ITBP లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ!10వ తరగతి అర్హతతో ఇలా దరఖాస్తు చేసుకోండి!
Image Credit: Aadhaar-PAN Update

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Telangana Politics: ఉద్యోగుల డీఏ నుంచి కాళేశ్వరం వరకు..ప్రజల గొంతుకగా జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్!

Telangana Politics: ఉద్యోగుల డీఏ నుంచి కాళేశ్వరం వరకు..ప్రజల గొంతుకగా జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్!

2

Uttar Pradesh: ప్రియురాలితో కారులో భర్త సీక్రెట్ రొమాన్స్.. సడెన్ ఎంట్రీ ఇచ్చిన భార్య.. వీడియో వైరల్..

3

AP Rain Alert: ఏపీ వాసులకు వాతావరణ శాఖ హెచ్చరిక..నేడు, రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో భారీ వర్షాలు!

4

Kavitha: కరువు మండలాలను వెంటనే ప్రకటించండి.. సీఎం రేవంత్‌పై కవిత సెన్సెషనల్ కామెంట్స్..

5

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ITBP లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ!10వ తరగతి అర్హతతో ఇలా దరఖాస్తు చేసుకోండి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Aadhaar-PAN Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ బంపర్ నోటిఫికేషన్ అందింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 126 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ (GD) గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ స్పోర్ట్స్ కోటాలో పోస్టులు ఉన్నాయి. మీకు ఆసక్తి ఉంటే, వెంటనే అధికారిక వెబ్‌సైట్ www.recruitment.itbpolice.nic.in నుండి నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి, వివరాలను క్షుణ్ణంగా చదివి, అర్హత ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి.

అక్టోబర్ 3, 2026 నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ప్రకారం, స్పోర్ట్స్ కోటాలో మొత్తం 126 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ పీడీఎఫ్‌ను పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోవాలి.

ITBP కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2026లో డాక్యుమెంటేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పిడిఎఫ్ ప్రకారం, అప్లికేషన్ల స్వీకరణ నవంబర్ 1 వరకు కొనసాగుతుంది. స్పోర్ట్స్ కోటాలోని ఈ 126 పోస్టుల్లో 72 మగ అభ్యర్థులకు, 54 మహిళా అభ్యర్థులకు కేటాయించారు. మొత్తం 26 స్పోర్ట్స్ విభాగాల్లో ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

Read Also: పీఎం కిసాన్ లబ్దిదారులకు బిగ్ షాక్! ఆ తప్పు చేస్తే రూ. 2,000 

అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, అక్వెస్ట్రియన్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, ఐస్ హాకీ, హాకీ, జూడో, కరాటే, పవర్ లిఫ్టింగ్, సెంట్రల్ స్కీయింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, రెజ్లింగ్, సైక్లింగ్ కోటాలలో ఈ భర్తీ జరగనుంది.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వ్డ్, OBC, SC, ST కేటగిరీ వారు మాత్రమే రూ.100 ఫీజు చెల్లించాలి. మిగిలిన అభ్యర్థులకు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంపికైన అభ్యర్థులకు ఇండో టిబెటన్ పోస్టులలో నెలకు రూ. 21,700 నుండి రూ. 69,100 వరకు జీతభత్యాలు ఉంటాయి. కానిస్టేబుల్ GD పోస్టులకు ఇది పే-లెవెల్ 3 ఆధారంగా ఉంటుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Jobs