SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

‘జైలర్ 2’ సహా 2026లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలు ఇవే..

2026 Indian Movies WW Top Gross Openings: 2026లో అపుడే 10 నెలలు పూర్తి కాబోతున్నాయి. ఇక దసరా కానుకగా ఈ నెల 15న విడుదలైన ‘జైలర్ 2’ ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము రేపే వసూళ్లను సాధించింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 19, 2026, 02:17 PM IST | Updated: Oct 19, 2026, 02:22 PM IST
Image Credit: 2026 Indian movies Opeings
Join

దురంధర్  ది రివేంజ్ (దురంధర్ 2).. రణ్‌వీర్ సింగ్ టైటిల్ రోల్లో ఆదిత్య ధర్ దర్శకత్వంలో  మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘దురంధర్ ది రివేంజ్’. ఈ చిత్రం ఫస్ట్ డే  వరల్డ్ వైడ్‌గా రూ. 240 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఈ యేడాది అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. .

టాక్సిక్..

యశ్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమాకు తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 143.35 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపింది.

జైలర్ 2..

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జైలర్ 2’. జైలర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజు దాదాపు రూ. 137 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఈ యేడాది అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన మూడో చిత్రంగా నిలిచింది.  

పెద్ది .. 

రామ్ చరణ్ కథానాయకుడిగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా యాక్ట్ చేసిన చిత్రం చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సన దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫస్ట్ డే  వరల్డ్ వైడ్గా  రూ. 135.6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి నాల్గో ప్లేస్‌లో నిలిచింది. .  

ది రాజా సాబ్..

ప్రభాస్ నాయక్‌గా సంజయ్ దత్ ఖల్ నాయక్‌గా  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో మారుతి డైరెక్షన్‌లో  తెరకెక్కిన చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా  తొలి రోజు రూ. 102 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఐదో ప్లేస్‌లో నిలిచింది.

దృశ్యం 3 కంక్లూజన్ (హిందీ )..

అజయ్ దేవగణ్ హీరోగా శ్రియ కథానాయికగా టబు మరో  ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘దృశ్యం 3’ . ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపింది.

జన నాయకుడు (జన నాయగన్)..

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కథానాయకుడిగా  నటించిన లేటెస్ట్ మూవీ ‘జన నాయకుడు’ (జన నాయగన్). ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా  రూ. 81.05 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది.  

ది ప్యారడైజ్..

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్యారడైజ్’ . ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా  రూ. 78.55 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

మన శంకర వర ప్రసాద్ గారు..

అనిల్ రావిపూడి  డైరెక్షన్‌లో  మెగాస్టార్ చిరంజీవి హీరోగా  తెరకెక్కిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. వెంకటేష్ మరో హీరోగా మెరిసారు. ఈ చిత్రం ఫస్ట్ డే  రూ.74.25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఉస్తాద్ భగత్ సింగ్..
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో   తెరకెక్కిన చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ మూవీ మొదటి రోజు రూ. 52.80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

బార్డర్ 2..

సన్ని దేవోల్, వరుణ్ ధావన్, అహన్ శెట్టి, దల్జీత్ దోసాంజ్ హీరోలుగా  అనురాగ్ సింగ్ డైరెక్షన్‌లో జేపీ దత్తా నిర్మించిన చిత్రం ‘బార్డర్ 2’. ఈ మూవీ  ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా  రూ. 43.50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

దృశ్యం 3.. 

మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ డైరెక్షన్‌లో  తెరకెక్కిన చిత్రం ‘దృశ్యం 3’. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు  రూ. 42.40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆ తర్వాత మంచి విజయం సాధించింది.  

పరాశక్తి ..

శివ కార్తికేయన్ హీరోగా శ్రీలీల కథానాయికగా నటించిన చిత్రం ‘పరాశక్తి’.  సంక్రాంతి కానుకగా తెరకెక్కిన చిత్రం  మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా రూ.27 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES