• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /తొలిసారి చారిత్రక చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్న అర్జున్.. అయోధ్యలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం..

తొలిసారి చారిత్రక చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్న అర్జున్.. అయోధ్యలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం..

Action King Arjun Direction: భారత్‌లో ఏ హీరోకు లేనట్టుగా యాక్షన్ కింగ్ అనే బిరుదున్న ఏకైక హీరో అర్జున్. యాక్షన్ కింగ్‌గా మాస్, క్లాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. అంతేకాదు తనదైన నటనతో పాటు దర్శకుడిగా మెప్పించారు. ఇప్పటికే పలు చిత్రాలను డైరెక్ట్ చేసిన ఈయన.. తాజాగా మరో సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అందులో కొత్త ఏమి ఉందన్నారు. కానీ ఈ సారి చారిత్రక నేపథ్యమున్న చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 26, 2026, 14:37 IST|Updated: Nov 26, 2026, 21:45 IST
joinshare
తొలిసారి చారిత్రక చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్న అర్జున్.. అయోధ్యలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం..
Image Credit: Arjun Direction (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Sarpanch Election Results: ఏపీ సర్పంచ్‌ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి షాక్.. పుంజుకున్న వైఎస్సార్సీపీ

Sarpanch Election Results: ఏపీ సర్పంచ్‌ ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి షాక్.. పుంజుకున్న వైఎస్సార్సీపీ

2

Telangana 25000 Jobs: తెలంగాణ యువతకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు!

3

AP Panchayat Election Results: ఏపీ పంచాయితీ ఎన్నికల్లో కూటమి పార్టీలదే హవా..మొదటి దశలో గెలుపు స్థానాలు..వైసీపీ ఎక్కడ?

4

Love Ends Life: మేనబావను ప్రేమించిన కుమార్తెను పరువు కోసం కాటికి పంపిన తండ్రి

5

Chandrababu: పేదల సంక్షేమం, ఆధ్యాత్మిక సేవకు సంపన్నులు ముందుకురావాలి: చంద్రబాబు

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Arjun Historical Movie Direction: తనదైన నటన, అద్భుతమైన యాక్షన్ పాత్రలతో హీరోగా అలరించారు. కేవలం మాతృ భాష కన్నడలో కాకుండా తమిళం, తెలుగులో టాప్ కథానాయకుడిగా సత్తా చాటారు. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా. పలు బ్లాక్ బస్టర్ చిత్రాలు ఈయన దర్వకత్వంలో తెరకెక్కి ప్రేక్షకులను అలరించాయి. తాజాగా యాక్ష‌న్ కింగ్ అర్జున్ సర్జా ప్ర‌ధాన పాత్ర‌లో ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ బ్యాన‌ర్‌పై అనూప్ మోహ‌న్ నిర్మాత‌గా భారీ బ‌డ్జెట్‌తో దేశ‌భ‌క్తి సినిమాకు  రాబబోతుంది.  ప్రెస్టీజియ‌స్ మూవీ రేపు న‌వంబ‌ర్ 27న అంటే  శ్రీరామ జ‌న్మ‌భూమి అయోధ్య‌లో లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం కానుంది. అదే రోజున టైటిల్‌ ప్రకటించనున్నారు.  

అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా భారీ ప్రాజెక్ట్.. 
అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా రూపొందనున్న ఈ దేశ‌భ‌క్తి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో ప‌లు భాష‌ల్లో విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ అన్ని సన్నాహాలు మొదలు పెట్టారు.  శ్రీరామ జన్మభూమి అయోధ్య‌ ఆలయంలో సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక ప్రత్యేకమైన ఘట్టంగా ఈ వేడుక నిలవనుందని టీమ్ వెల్ల‌డించింది. అర్జున్ స‌ర్జా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌టంతో పాటు ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను చేపట్టనున్నారు.  

ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్.. 
బాలీవుడ్‌తో పాటు వివిధ ప్రాంతీయ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగస్వాములగా ఈ చిత్రం రూపొందనుంది.  భారతీయ చలనచిత్ర రంగంలోని పలువురు ప్రముఖులతో కూడిన భారీ పాన్ ఇండియా చిత్రంగా ఈ ప్రాజెక్ట్ రానుంది.  అనూప్ మోహ‌న్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి జోస్ ఎం. థామస్ రాయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌. రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ విజయ్ భార్గవన్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండటం విశేషం.

బలమైన కథాంశం..

బలమైన కథాంశం, ప్రముఖ నటీనటులు, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రేక్షకులకు  ఈ చిత్రం  అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందించనున్నట్టు తెలిపారు.  దేశభక్తి, ధైర్యసాహసాలు, త్యాగం, భారతదేశ గొప్పతనాన్ని తెలిపేలా  ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించనున్నారు. ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ బ్యాన‌ర్‌లో రూపొంద‌నున్న మూడ‌వ ప్రెస్టీజియ‌స్ చిత్రమిది. గతంలో అర్జున్ తెరకెక్కించిన ‘జై హింద్’ మూవీ కూడా ఇదే దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కడం విశేషం. ఆ  చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీలో మంచి విజయం సాధించిన తెలిసిందే కదా. 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie