Surekha Vani Video: 49 ఏళ్ల వయసులో రెచ్చిపోయిన సురేఖ వాణి.. టీనేజ్ కుర్రాడితో రొమాన్స్.?. వీడియో వైరల్...
Surekha vani insta post video: సురేఖ వాణి తన సోషల్ మీడియా అకౌంట్ లో టీనేజ్ కుర్రాడితో రొమాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏజ్ గ్యాప్ రొమాన్స్ ఏంటని, పెళ్లిడుకొచ్చిన కూతుర్ని పెట్టుకుని ఇలా చేయడం ఏంటని నెటిజన్లు ఏకీపారేస్తున్నారు.
Surekha vani romance with teenage boy video goes controversy: నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. నటి సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి తరచుగా రీల్స్, ఫోటోలు దిగుతూ ఇన్ స్టాలో పోస్ట్ లు పెడుతుంటారు. మరోవైపు వీరి రీల్స్ పై ఇటీవల నెట్టింట గాసిప్ రాయుళ్లు ఒక రెంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. సురేఖ వాణికి టార్గెట్ చేసి రెండో పెళ్లికి రెడీ అయిపోయారని, బిజినెస్ ను మెన్ ను పెళ్లి చేసుకొబొతున్నారని ప్రచారం చేశారు. కొన్నిసార్లు వీరి ఫోటోలు, రీల్స్ లో బోల్డ్ గా ఉండటంతో నెటిజన్లు సైతం ఫైర్ అయ్యారు. పెళ్లిడుకొచ్చిన కూతుర్ని పెట్టుకుని ఈఫోటొలు, డ్యాన్స్ లు ఏంటనికూడా తిట్టిపోశారు. కానీ సురేఖ వాణి, సుప్రీత మాత్రం వీటిని డొంట్ కేర్ అన్నట్లు ఉండేవారు.
అయితే.. సురేఖ వాణి ఇటీవల తనపై వస్తున్న రెండో పెళ్లి ఆరోపణల్ని సురేఖ వాణి ఖండించారు. ఒకవేళ తనకు రెండొపెళ్లిపై ఆసక్తి ఉంటే ఇన్నాళ్లు సింగిల్ గా ఎందుకుంటానని ఫైర్ అయ్యారు. తాజాగా.. టీనేజ్ కుర్రాడితో సురేఖ వాణి రొమాన్స్ చేస్తున్నట్లు ఉన్న ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిలో కుర్రాడితో సురేఖ వాణి చాలా చనువుగా, ముద్దులు పెడుతూ, చాలా క్లోజ్ గా రీల్స్ తీసుకున్న వీడియో పై దుమారం రాజుకుంది.
ఈ వీడియోను సురేఖ వాణి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆతర్వాత డిలీట్ చేశారని ప్రచారం జరుగుతుంది. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పెళ్లిడుకొచ్చిన కూతుర్ని పెట్టుకుని ఈ విధంగా పాడు పనులు ఏంటని మండిపడుతున్నారు.ఈ ఏజ్ గ్యాప్ రిలేషన్ తో సభ్యసమాజంకు ఏంమెస్సెజ్ ఇస్తున్నట్లు అంటూ మరికొంత మంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరీ ఈ వీడియో నిజమైనదో లేదా ఏఐతో ఏమైన క్రియేట్ చేశారో అన్నదానిపై నటి సురేఖ వాణి అధికారికంగా స్పందిస్తే ఒక క్లారిటీ వస్తుంది.