• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /Actress: 26 ఏళ్లుగా తోడుగా ఉన్న మేకప్‌మెన్‌కు హీరోయిన్ సర్‌ప్రైజ్.. వీడియో వైరల్..!

Actress: 26 ఏళ్లుగా తోడుగా ఉన్న మేకప్‌మెన్‌కు హీరోయిన్ సర్‌ప్రైజ్.. వీడియో వైరల్..!

Actress: 26 ఏళ్లుగా తనతో కలిసి పనిచేస్తున్న మేకప్‌మెన్‌ పుట్టినరోజును ప్రత్యేకంగా జరిపి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆయనను కుటుంబ సభ్యుడిలా భావిస్తూ చేసిన ఈ చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Written ByVishnu Priya
Published: Oct 05, 2026, 01:55 PM IST|Updated: Oct 05, 2026, 02:00 PM IST
joinshare
Actress: 26 ఏళ్లుగా తోడుగా ఉన్న మేకప్‌మెన్‌కు హీరోయిన్ సర్‌ప్రైజ్.. వీడియో వైరల్..!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
శరన్నవరాత్రుల్లో అఖండ దీపం వెలిగిస్తున్నారా? దిశ, నూనె, వత్తుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

శరన్నవరాత్రుల్లో అఖండ దీపం వెలిగిస్తున్నారా? దిశ, నూనె, వత్తుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

2

Gold Vs Personal Loan: డబ్బు అవసరం ఉందా? గోల్డ్ లోన్ Vs పర్సనల్ లోన్.. మీ అవసరాలకు ఏది సరైన ఎంపిక?

3

Delhi: క్రిమినల్స్ గుండెల్లో వణుకు పుట్టాల్సిందే.. అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..

4

మంచితనానికి ప్రచారం అవసరమా?.. అందరూ హేళన చేసినా.. అడవి మొత్తాన్ని కాపాడిన నక్క కథ!

5

Father Son Property Rights: కొడుకు సంపాదన, ఆస్తిలో తల్లిదండ్రులకు హక్కు ఉంటుందా? వారసత్వ చట్టం ఏం చెబుతోంది!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Actress: సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లతో పాటు వారి వెనుక పనిచేసే సిబ్బంది కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. మేకప్‌మెన్, హెయిర్ స్టైలిస్ట్, అసిస్టెంట్లు, మేనేజర్లు ఇలా చాలామంది సినీ ప్రయాణంలో నటీనటులకు ఎప్పుడూ తోడుగా ఉంటారు. అయితే వారిని కేవలం సిబ్బందిగా కాకుండా కుటుంబ సభ్యుల్లా చూసుకునే సెలబ్రిటీలు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి వారిలో నటి అభిరామి ఒకరిగా నిలిచారు.

తనకు దాదాపు 26 ఏళ్లుగా మేకప్‌మెన్‌గా పనిచేస్తున్న సూర్య పుట్టినరోజును అభిరామి ప్రత్యేకంగా జరిపారు. ఆయనకు ఊహించని విధంగా సర్‌ప్రైజ్ ఇచ్చి, స్వయంగా కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

అభిరామి అసలు పేరు దివ్య గోపికుమార్. కేరళకు చెందిన ఆమె చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చారు. 1995లో వచ్చిన మలయాళ చిత్రం కథాపురుషన్లో బాలనటిగా కనిపించారు. ఆ తర్వాత హీరోయిన్‌గా మారి మలయాళంతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటించారు. తెలుగులో థ్యాంక్యూ సుబ్బారావు, ఛార్మినార్, చెప్పవే చిరుగాలి వంటి చిత్రాలతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

కెరీర్ మంచి స్థాయిలో ఉన్న సమయంలో 2004లో అమెరికాలో ఉద్యోగం రావడంతో కొంతకాలం అక్కడే స్థిరపడ్డారు. 2009లో రాహుల్ పవనన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు ఒక పాపను దత్తత తీసుకుని ఆమెను ప్రేమగా పెంచుకుంటున్నారు.వ్యక్తిగత కారణాలతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న అభిరామి 2014లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి తన వయసు, అనుభవానికి తగ్గట్టుగా మంచి కథలను ఎంచుకుంటూ నటిస్తున్నారు. వేట్టయన్, సరిపోదా శనివారం, మహారాజా, థగ్ లైఫ్ వంటి సినిమాల్లో కనిపించారు.

ఇటీవల థగ్ లైఫ్లో కమల్ హాసన్‌తో ఆమె చేసిన సన్నివేశంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే అభిరామి ఆ విమర్శలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇక తాజాగా మేకప్‌మెన్ సూర్య పుట్టినరోజు సందర్భంగా చేసిన పోస్ట్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. 26 ఏళ్లుగా తనతో కలిసి పనిచేస్తున్న సూర్య తనకు కేవలం మేకప్‌మెన్ మాత్రమే కాదని అభిరామి తెలిపారు. సోదరుడిలా, స్నేహితుడిలా, శ్రేయోభిలాషిగా తనకు అండగా ఉన్నారని చెప్పారు.

ఎప్పుడూ ప్రయాణాల్లో ఉండటం వల్ల ఈసారి చిన్న కేక్‌తోనే పుట్టినరోజు జరపాల్సి వచ్చిందని, కానీ అందులో ఉన్న ప్రేమ మాత్రం ఎంతో పెద్దదని ఆమె చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి.

Read More: Janhvi Kapoor: టాలీవుడ్‌లోకి అనవసరంగా వచ్చిన జాన్వీ కపూర్.. వరుస వివాదాలతో పెరుగుతున్న డ్యామేజ్!

Read More: ఎంటర్ ది ‘డ్రాగన్’ .. మళ్లీ షూటింగ్‌ కోసం రెడీ అవుతున్న ఎన్టీఆర్.. ?

Add Zee News as a Preferred Source