NTR Resume to Dragon Shoot: గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ ముందుకు రాబోతున్నాడు. ఈ వీక్‌లో ఎపుడైనా ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సెట్స్‌లోకి అడుగు పెట్టపోతున్నట్టు సమాచారం. తారక్ రెస్ట్ కారణంగా ఇప్పటికే షెడ్యూల్స్ చాలా వరకు గందరగోళం అయ్యాయి. దాంతో ఇకపై బ్రేక్స్ లేకుండా ప్రశాంత్ నీల్ పక్కా ప్లానింగ్‌తో బ్యాక్ టు బ్యాక్ షూట్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
రిలీజ్ డేట్‌లో ఎలాంటి డౌట్ లేదు..
ఇన్ని రోజులు షూట్ ఆగినా.. ఎలాంటి డిలేస్ లేకుండా ముందుగా అనుకున్న టార్గెట్ ప్రకారం జూన్ 11, 2027నే సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. డ్రాగన్‌లో ఎన్టీఆర్ కు జోడిగా రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుండగా.. అనిల్ కపూర్, బిజు మీనన్, ఖుష్బు కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, ఆలియా భట్ కూడా ఇందులో భాగం కానున్నారని సమాచారం.
ప్రశాంత్ నీల్ మార్క్..
ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్‌తో ఇంటర్నేషనల్ మాఫియా నేపథ్యంలో డ్రాగన్ తెరకెక్కుతుంది. ఇన్నాళ్లూ ఎన్టీఆర్ లేకపోయినా.. ఆయన లేని సన్నివేశాలు షూట్ చేసారు నీల్. తారక్ వచ్చాక అక్టోబర్ నుంచి నాన్ స్టాప్‌గా షెడ్యూల్స్ జరగనున్నాయి. మొత్తానికి మరో వారం పది రోజుల్లోనే డ్రాగన్ దూకుడు షురూ కానుంది. ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. మొదటి పార్ట్ జూన్ 11న రెండో పార్ట్ డిసెంబర్‌లో ప్లాన్ చేశారు. ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. లేకపోతే ఒకటే పార్ట్‌గా విడుదల చేస్తారా అనేది చూడాలి.