Ambika slams on her her sister radha over 46 crore allegations: ఒకప్పటి ప్రముఖ నటీమణులు, అక్కాచెల్లళ్లు అయిన అంబిక, రాధల మధ్య ఆస్తి వివాదం కాస్త రోడ్డున పడింది. దీనిలో నటి రాధ ఇప్పటికే తనను సోదరి అంబికా మోసం చేసిందని చెప్పింది. రూ. 46 కోట్ల బ్యాంక్ చెక్ ను డ్రా చేసుకుందని తన సోదరితో పాటు తమ్ముడిపై కూడాచెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై తాజాగా.. అంబికా రియాక్ట్ అయ్యింది. తనపై సోదరి రాధ చేసిన ఆరోపణలను అంబిక తీవ్రంగా ఖండించింది.. తనను దొంగగా చిత్రీకరించడం చాలా ఆవేదనకు గురిచేసిందని చెప్పుకొచ్చింది.
రాధ చేసిన ఈ ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని, తాను ఎటువంటి తప్పు చేయలేదని ఆమె స్పష్టం చేశారు. చిన్న తనంనుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పుకొచ్చింది. రాధ తన వస్తువుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటుందని, నంబర్ లాక్ ఉన్న బ్యాగులనే వాడుతుందని, అలాంటి తరుణంలో దొంగతనం జరగడం అసాధ్యమని అంబిక చెప్పుకొచ్చింది.
ఈ వివాదానికి మూలకారణం ఆస్తి గొడవలేనని అంబిక తెలిపారు. 'ఏఆర్ఎస్ గార్డెన్'ను తాను ఎంతో కష్టపడి నిర్మించినట్లు చెప్పింది. అయితే, ఆ పేరును 'ఆర్.ఆర్. గార్డెన్'గా మార్చి, తనకు రావాల్సిన వాటాను నిరాకరించడంతోనే న్యాయపోరాటం చేయాల్సి వచ్చిందని ఆమె వివరించారు.
ఈ క్రమంలో కుటుంబ సభ్యుల మధ్యే పరిష్కరించుకోవడానికి పలుమార్లు ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున, న్యాయవ్యవస్థపై గౌరవంతో ఈ అంశంపై ఇకపై బహిరంగంగా మాట్లాడబోనని అంబికా చెప్పుకొచ్చింది.