• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /ఒక రోజు ముందుగానే భారత్‌లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ విడుదల..

ఒక రోజు ముందుగానే భారత్‌లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ విడుదల..

Avengers Doomsday Eary Release in India: భారతీయ ప్రేక్షకులు ఎపుడెపుడా అని ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘అవెంజర్స్ డూమ్స్‌డే’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 18న విడుదల చేస్తున్నారు. కానీ మన దేశంలో ఈ చిత్రాన్ని ఒక రోజు ముందుగానే విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 28, 2026, 02:55 PM IST|Updated: Oct 29, 2026, 11:01 AM IST
joinshare
ఒక రోజు ముందుగానే భారత్‌లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ విడుదల..
Image Credit: Avengers Doomsday Release (X/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఒక్కసారిగా కుప్పకూలిన వెండి ధరలు..కిలోపై ఎంత తగ్గిందంటే..? ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే లాభమా, నష్టమా?

ఒక్కసారిగా కుప్పకూలిన వెండి ధరలు..కిలోపై ఎంత తగ్గిందంటే..? ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే లాభమా, నష్టమా?

2

మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి ఇస్రో సిద్ధం.. రేపు రాత్రి నింగిలోకి GSLV-F18 రాకెట్‌..

3

Konda Surekha: కేటీఆర్‌పై వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా.. కొండా సురేఖ సంచలన ట్వీట్..!

4

నిర్మాతగా నిహారిక కొణిదెల దూకుడు.. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీ..

5

AP Diwali Ration: ఏపీలో రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక..నవంబరులో ఈ సరుకుల పంపిణీ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Avengers Doomsday Update:  మార్వెల్ స్టూడియోస్ వారు డాక్టర్ డూమ్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్, స్టీవ్ రోజర్స్‌గా క్రిస్ ఎవాన్స్  భారతీయ ప్రేక్షకుల ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు ఈ చిత్రాన్ని  అమెరికా కంటే ఒక రోజు ముందుగానే డిసెంబర్ 17న భారత్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.  

ఈ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు  హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు మరో 50 రోజులు మాత్రమే ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి రేకిత్తిస్తోంది. ఈ సందర్భంగా హాలీవుడ్ ప్రముఖ నటులు రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్ భారతీయ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్‌గా, క్రిస్ ఎవాన్స్ స్టీవ్ రోజర్స్‌గా కనిపించనున్నారు.

 

వీడియో సందేశంలో వారు మాట్లాడుతూ.. ‘‘నమస్తే ఇండియా! దీపావళి అంటే చీకటి అధ్యాయం ముగిసి, మరో కొత్త అధ్యాయం ప్రారంభం కావడం. ఈ విషయం గురించి మాకు బాగా తెలుసు. అయితే, చీకటి నుంచి వెలుగులోకి వెళ్లడానికి బదులుగా, ఈసారి బహుశా వెలుగు నుంచి చీకటివైపు ప్రయాణం సాగుతుందేమో అని కాస్త ఫన్నీగా సినిమా గురించి చెబుతూ భారతీయులకు అమెరికాలో స్థిరపడ్డ భారతీయ అమెరికన్లకు  దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు త్వరలో‘అవెంజర్స్: డూమ్స్‌డే’లో కలుద్దాం’’ అని చెప్పారు. ఈ సినిమా మిమ్మల్ని ఎంతమాత్రం నిరాశ పరచదన్నారు.

ఈ చిత్రంలో మూడు విభిన్న విశ్వాలకు చెందిన ఫేవరే‌ట్ హీరోలు ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఎదురెదురుగా నిలవనున్నారు. వారు ఎన్నడూ ఎదుర్కోని అత్యంత భయంకరమైన ముప్పును ఎదుర్కోన్నారు. ఈ నేపథ్యంలో సాగే పోరాటాలు, ఉత్కంఠభరిత సీన్స్ ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను  అందించనున్నాయి.


ఆంథోనీ రుస్సో, జోరుస్సో ద్యయం  ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశార.  కెవిన్ ఫైజ్, లూయిస్ డి'ఎస్పోసిటో, జోనాథన్ ష్వార్ట్జ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్‌లతో పాటు క్రిస్ హేమ్స్‌వర్త్, పెడ్రో పాస్కల్, పాల్ రూడ్, ఆంథోనీ మాకీ, ఫ్లోరెన్స్ ప్యూ, వెనెస్సా కిర్బీ, ఈబన్ మాస్-బాచ్రాక్, వ్యాట్ రస్సెల్, చానింగ్ టాటమ్, సిము లియు, ఇయాన్ మెక్‌కెల్లెన్, హేలీ అట్వెల్, టామ్ హిడిల్‌స్టన్, జేమ్స్ మార్స్‌డెన్, పాట్రిక్ స్టీవర్ట్, జోసెఫ్ క్విన్, సెబాస్టియన్ స్టాన్, డేవిడ్ హార్బర్, లెటిటియా రైట్ తదితర ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

దీపావళి శుభాకాంక్షలతో పాటు అమెరికా కంటే ముందుగానే సినిమా విడుదల కానుండటంతో భారతీయ అభిమానుల్లో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’పై అంచనాలు మరింత పెరిగాయి.  మార్వెల్ అభిమానులకు ఈ చిత్రం మరో భారీ సినిమాటిక్ వేడుకగా నిలవనుంది.

డిసెంబర్ 17, 2026న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం, భారతీయ థియేటర్లలో అదే రోజు ప్రత్యేక ప్రీమియం ఫార్మాట్లతో పాటు మార్వెల్ స్టూడియోస్ అందించే ఇన్ఫినిటీ విజన్ ఫార్మాట్‌లోనూ ప్రదర్శించనున్నారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News