• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /గాయం తర్వాత ‘దాదా’ షూటింగ్‌లో బాలయ్య.. అనుకున్న తేదికి వచ్చేనా..!!

గాయం తర్వాత ‘దాదా’ షూటింగ్‌లో బాలయ్య.. అనుకున్న తేదికి వచ్చేనా..!!

Balakrishna Resume Shooting: బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దాదా’. తాజాగా కొన్ని రోజులు క్రితం కాకినాడ పోర్ట్‌లో యాక్షన్ సీన్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆ తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న నట సింహం.. తిరిగి ఫుల్ ఎనర్జీతో సెట్స్‌లో అడుగుపెట్టారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 06, 2026, 01:40 PM IST|Updated: Oct 07, 2026, 01:48 PM IST
joinshare
గాయం తర్వాత ‘దాదా’ షూటింగ్‌లో బాలయ్య.. అనుకున్న తేదికి వచ్చేనా..!!
Image Credit: Balayya Shooting resume (File Pic /Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఫ్లిప్‌కార్ట్ BBD సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు.. iPhone 17 నుంచి QLED TV వరకు భారీ డిస్కౌంట్లు!

ఫ్లిప్‌కార్ట్ BBD సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు.. iPhone 17 నుంచి QLED TV వరకు భారీ డిస్కౌంట్లు!

2

Team India Fitness Tracking: టీమ్ఇండియా ఆటగాళ్ల వీపుపై విన్నూత్న పరికరం..దానితో పనేంటి? ఆటగాళ్లకు ఎందుకు పెట్టారు?

3

బిగ్‌బాస్‌కు బిగ్ షాక్ .. నాగార్జునకు పోటీగా తేజ సజ్జ..

4

రష్యాలో ఉద్యోగం అంటూ మోసం.. ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధానికి తెలంగాణ యువకులు!

5

KCR: ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో యాగం నిర్వహించిన కేసీఆర్ దంపతులు.. అసలు కారణం ఇదేనా..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

NBK Shooting Updates: ‘వీరసింహారెడ్డి’ తర్వాత నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘దాదా’. ఈ సినిమా షూటింగ్ జరగుతుండగా ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా బాలయ్య తీవ్రంగా గాయపడ్డారు. ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లు కొన్ని రోజులు రెస్ట్ తీసుకొన్న బాలయ్య.. మళ్లీ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. బాలకృష్ణ ఎనర్జీతో షూటింగ్‌లో జాయిన్ అయినా.. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ లోపు అన్ని పనులు పూర్తై రిలీజ్ అవుతుందా అనేది చూడాలి. ఇంతకీ డిసెంబర్ 24 డెడ్ లైన్ అందుకోడానికి గోపీచంద్ అండ్ టీం ముందు చాలా సవాళ్లు ఉన్నాయి.

మోకాలి గాయం తర్వాత షూటింగ్‌.. 
ఆ మధ్య కాకినాడ పోర్టులో భారీ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ కిందపడి బాలయ్య మోకాలికి తీవ్రంగా  గాయమైంది. దెబ్బ కాస్త పెద్దది కావడంతో వైద్యుల సూచనల  మేరకు సర్జరీ చేయించుకుని దాదాపు 2 నెలలకు పైగానే రెస్ట్ తీసుకున్నారు. మోకాలి నొప్పి నుంచి కోలుకున్న బాలకృష్ణ.. మైసూర్‌లో జరుగుతున్న ‘దాదా’ షూటింగ్‌లో పాల్గొన్నారు. దాదాపు  15 రోజుల జరిగే ఈ షెడ్యూల్లో బాలయ్య పాల్గొననున్నారు.

బ్రేక్ లేకుండా షూటింగ్..

బాలయ్య రాకతో షూటింగ్‌ను ఎక్కడా బ్రేక్ లేకుండా ఫాస్ట్‌గా లాగించే పనిలో పడ్డారు  గోపీచంద్ మలినేని. ప్రస్తుతం జరుగుతున్న ఈ మైసూర్ షెడ్యూల్ పూర్తైన తర్వాత బాలాకు  సంబంధించి కేవలం 20 రోజుల వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే గోపీచంద్ బాలయ్య లేని సీన్స్‌ను షూట్ చేసేశారు. ఇక 15 రోజుల తర్వాత మిగిలిన వారం రోజలు షెడ్యూల్‌ను  అది హైదరాబాద్‌లో ప్లాన్ చేస్తున్నారు. అంటే కరెక్ట్‌గా మరో 35 రోజుల్లో దాదా నుంచి బాలయ్య ఫ్రీ అయిపోతారని చెప్పొచ్చు.

క్రిస్మస్ కానుకగా బాలయ్య సినిమా.. 

దాదా సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న తీసుకురావాలని మేకర్స్ ఇప్పటికే డేట్‌ను లాక్ చేసుకున్నారు. ఓ వైపు గోపీచంద్ మలినేని ఈ సినిమా షూటింగ్ చేస్తూనే ఎడిటింగ్ వర్క్ కూడా అప్పటికపుడు చేస్తూ రషెస్ చూసుకుంటున్నారు. ఇక ‘దాదా’ రిలీజ్‌కు మరో రెండు నెలలకు పైగా సమయం ఉంది. నవంబర్ ఎండింగ్‌కు షూట్ పూర్తి చేసి.. డిసెంబర్ సెకండ్ వీక్‌లోపే ఫస్ట్ కాపీ రెడీ చేసి సెన్సార్‌కు వెళ్లాలనే ప్లాన్ చేస్తున్నారు  గోపీచంద్. మొత్తానికి లేట్ అయినా.. లేటెస్ట్‌గా ఆన్ టైమ్‌కే వస్తామంటున్నారు దాదా టీం. ఇక బాలయ్య కూడా డబుల్ జోష్‌తో షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News