• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /బిగ్‌బాస్‌కు బిగ్ షాక్ .. నాగార్జునకు పోటీగా తేజ సజ్జ..

బిగ్‌బాస్‌కు బిగ్ షాక్ .. నాగార్జునకు పోటీగా తేజ సజ్జ..

Teja Sajja Bigg Shock to Nagarjuna: తెలుగు స్మాల్ స్క్రీన్ రియాలిటీ షోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నాగార్జున మొదటి , రెండు సీజన్లు తప్పించి మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా నాగ్‌కు పోటీగా తేజ సజ్జ బిగ్ బాస్ తరహా మరో రియాలిటీ షోతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 07, 2026, 02:17 PM IST|Updated: Oct 07, 2026, 02:20 PM IST
joinshare
బిగ్‌బాస్‌కు బిగ్ షాక్ .. నాగార్జునకు పోటీగా తేజ సజ్జ..
Image Credit: Bigg Boss Vs Traitors (ZEE News/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Deshapati Srinivas: 'ప్యారడైజ్‌ సినిమాలో మాలిక్ చేతిలో సవారీల బతుకుల్లా తెలంగాణ పరిస్థితి'

Deshapati Srinivas: 'ప్యారడైజ్‌ సినిమాలో మాలిక్ చేతిలో సవారీల బతుకుల్లా తెలంగాణ పరిస్థితి'

2

Bandi Sanjay: ఓటు, సీటు చోరీ పేటెంట్ రైట్స్ కాంగ్రెస్‌కే.!.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

3

ఫ్లిప్‌కార్ట్ BBD సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు.. iPhone 17 నుంచి QLED TV వరకు భారీ డిస్కౌంట్లు!

4

Team India Fitness Tracking: టీమ్ఇండియా ఆటగాళ్ల వీపుపై విన్నూత్న పరికరం..దానితో పనేంటి? ఆటగాళ్లకు ఎందుకు పెట్టారు?

5

బిగ్‌బాస్‌కు బిగ్ షాక్ .. నాగార్జునకు పోటీగా తేజ సజ్జ..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bigg Boss Show Vs The Traitors:  బిగ్‌బాస్‌ షోకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి  ఆదరణ ఉంది. ముఖ్యంగా యూత్‌తో పాటు ఓ వర్గం ప్రేక్షకులు బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య జరిగే పోరును ఆసక్తిగా తిలకిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరికొంత మంది ఇలాంటి కార్యక్రమాల వల్ల సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు చెబుతున్నారు. ఏది ఏమైనా డిఫరెంట్ ఓపియన్స్‌తో బిగ్‌బాస్ షోను చూసేవాళ్లే ఎక్కువగా ఉన్నారు.

ముఖ్యంగా ప్రతి సీజన్‌లోనూ సెలబ్రిటీల మధ్య జరిగే గొడవలు, భావోద్వేగాలు, స్నేహాలు, వ్యూహాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాయి. ఇప్పటివరకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తూ బిగ్‌బాస్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ రియాలిటీ షోకు భిన్నమైన కాన్సెప్ట్‌తో మరో భారీ కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే 'ది ట్రెయిటర్స్‌ తెలుగు'.

‘ది ట్రెయిటర్స్’..

ది ట్రెయిటర్స్‌ తెలుగు' కార్యక్రమానికి యంగ్ హీరో తేజ సజ్జ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో  ఈ షోపై ఆసక్తి మరింత పెరిగింది. అక్టోబర్‌ 15 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ కానుంది. మొత్తం పది ఎపిసోడ్లుగా రూపొందిన ఈ షోలో ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్‌ స్ట్రీమింగ్ అవుతుంది.  ప్రపంచ వ్యాప్తంగా విజయవంతమైన ఈ రియాలిటీ ఫార్మాట్‌ను తొలిసారి తెలుగులోకి తీసుకొస్తున్నారు.

మోసమే ప్రధానంగా కార్యక్రమం..

నమ్మకం కాదు.. మోసమే ప్రధాన ఆయుధం సాధారణ రియాలిటీ షోలకు భిన్నంగా 'ది ట్రెయిటర్స్‌'లో నమ్మకం, అనుమానం, మోసం, వ్యూహాలు, మైండ్‌ గేమ్స్‌ ప్రధానంగా ఉంటాయి. ఒకరిని ఒకరు పూర్తిగా నమ్మలేని పరిస్థితుల్లో పోటీదారులు ముందుకు సాగాల్సి ఉంటుంది. ఎవరు నిజాయితీగా ఆడుతున్నారు? ఎవరు ఇతరులను మోసం చేస్తున్నారు? అసలు ట్రెయిటర్స్‌ ఎవరు? అనే ప్రశ్నలే ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

20 మంది సెలబ్రిటీలతో కార్యక్రమం..

20 మంది సెలబ్రెటీలతో.. ఈ కార్యక్రమంలో మొత్తం 20 మంది ప్రముఖులు పాల్గొంటున్నారు. చిన్మయి శ్రీపాద, హర్షవర్ధన్‌, ప్రగతి మహావాది, శ్రీదేవి చౌదరి, నిఖిల్‌ విజయేంద్ర సింహా, విద్యూ రామన్‌, విష్ణు ఓయ్‌, శ్రావ్య వర్మ, డాక్టర్‌ మేఘనాథ్‌ రెడ్డి, మౌనీషా చౌదరి, స్వీకర్‌ అగస్తి, ఆశికా పదుకొనే, వర్షా డిసౌజా, ప్రణవ్‌, ఎస్‌.ఎస్‌. వర్ధన్‌, రహత్‌ అచంట, గౌరవ్‌ సునీల్‌, సాయి రోనక్‌, పుప్పాల ధనుంజయ, ఫాల్గుణి బంగేరా వంటి వారు ఈ ఆటలో భాగం కానున్నారు.

తేజ సజ్జకు కొత్త బాధ్యత..

చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన తేజ సజ్జ..  ఇప్పటికే హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న వయసులోనే పలు సినిమాల్లో నటించిన ఆయన.. 'ఓ బేబీ', 'జాంబీ రెడ్డి', 'హను-మాన్‌', 'మిరాయ్‌' వంటి సినిమాలతో తన స్థాయిని మరింత పెంచుకున్నారు. ముఖ్యంగా 'హను-మాన్‌' విజయంతో పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు పొందారు. ఇప్పుడు తొలిసారి రియాలిటీ షో హోస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రావడం ఆయన కెరీర్‌లో మరో కొత్త అడుగుగా చెప్పొచ్చు.

నాగార్జునకు పోటీగా తేజ? 
ఇప్పటివరకు తెలుగు రియాలిటీ షోలంటే నాగార్జున పేరు ప్రధానంగా వినిపించేది. అలాంటి సమయంలో తేజ సజ్జ 'ది ట్రెయిటర్స్‌ తెలుగు'తో హోస్ట్‌గా రావడంతో నాగార్జునకు పోటీగా తేజ అనే చర్చ జరుగుతోంది. అయితే ఇది నేరుగా బిగ్‌బాస్‌కు పోటీ ఇచ్చే కార్యక్రమమని చెప్పడం కంటే, ప్రేక్షకులకు మరో రకమైన రియాలిటీ వినోదాన్ని అందించే ప్రయత్నంగా చూడాలి.

మోసం, రహస్యాలు, మైండ్ గేమ్ ప్రధానంగా సాగనున్న రియాలిటీ షో..

బిగ్‌బాస్‌లో ఇంట్లో జరిగే సంబంధాలు, టాస్కులు, గొడవలు ప్రధానంగా ఉంటే.. 'ది ట్రెయిటర్స్‌'లో మాత్రం మోసం, వ్యూహాలు, రహస్యాలు, మైండ్‌ గేమ్స్‌ కీలకంగా ఉండనున్నాయి. దీంతో ఇప్పటికే బిగ్‌బాస్‌ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు ఈ కొత్త ప్రయోగాన్ని ఎలా స్వీకరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తేజ సజ్జ తనదైన శైలిలో హోస్ట్‌గా ఎంతవరకు మెప్పిస్తారనేది చూడాలి. ఈ కార్యక్రమం తెలుగు ఓటీటీ రియాలిటీ షోలలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అక్టోబర్‌ 15 తర్వాతే స్పష్టమవుతుంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Bigg Boss