SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

హీరోల లెగసీని కంటిన్యూ చేస్తున్న కూతుళ్లు.. హీరోయిన్స్‌గా, ప్రొడ్యూసర్స్‌గా సత్తా..

Heroes Daughters Legacy: ఏ ఇండస్ట్రీ చూసినా ఏమున్నది గర్వకారణం. సినీ ఇండస్ట్రీ మొత్తం వారసత్వ పరాయణత్త్వం. ప్రస్తుతం వారసత్వం అనే పదం వినగానే ముందు కొడుకుల మీదకే అందరి దృష్టి వెళుతుంది. ఎంతైనా తనయులు కదా తమ లెగసీని ముందుకు తీసుకెళ్తారనే ఆశ ఎవరికైనా ఉంటుంది. కానీ టాలీవుడ్‌లో వారసులకు తోడు వారసురాళ్లు కూడా తమ వంతు రప్ఫాడిస్తున్నారు. తండ్రుల సక్సెస్‌లో కీ రోల్ పోషిస్తున్నారు. కొందరు నిర్మాతలుగా.. మరికొందరు హీరోయిన్లుగా కూడా ఎంట్రీ ఇస్తున్నారు.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 14, 2026, 05:29 AM IST | Updated: Oct 14, 2026, 05:30 AM IST
Image Credit: Daughters Legacy (File/Source)
Join

Daughters Legacy: టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో  మరో వారసురాలు వచ్చేస్తున్నారు.. ఆమెవరో కాదు శ్రీకాంత్, ఊహల గారాల కూతురు మేధ మేక. ఈమె హీరోయిన్‌గా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో కొత్త సినిమా రీసెంట్‌గా మొదలైంది. ఈ లవ్ స్టోరీలో మేధతో పాటు జై జాస్తి హీరోగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే శ్రీకాంత్ ఫ్యామిలీ నుంచి రోషన్ హీరోగా పరిచయమయ్యారు.. త్వరలోనే ‘ఏమో ఏమో ’ ఇది సినిమాతో రాబోతున్నారు.

టాలీవుడ్‌లో వారసురాళ్లు హీరోయిన్స్ కంటే తెరవెనక తండ్రులకు తమ వంతుగా అండగా నిలబడుతున్నారు.  బాలకృష్ణ కెరీర్‌‌ను అఖండ తర్వాత పూర్తిగా మార్చేసి NBK 2.0 చేసింది ఆయన కూతురు తేజస్విని. గాడ్ ఆఫ్ మ్యాసెస్  కథల ఎంపిక కూడా ‘అఖండ’ తర్వాతే మారిపోయింది. తాజాగా రవితేజ కూతురు మోక్షద కూడా ఇరుముడి నుంచి నాన్నతో పాటే ఉంటున్నారు. తులాభారం ఓపెనింగ్‌లోనూ మోక్షద నాన్నతోనే ఉండటం గమనార్హం.

రవితేజ కథల సెలెక్షన్ కూడా మోక్షద దగ్గరుండి చూసుకుంటున్నారు. డాటర్స్ డిస్కషన్ వచ్చినపుడు చిరంజీవి కూతురు సుష్మిత గురించి చెప్పకపోతే ఎలా..? ఖైదీ నెం 150 నుంచి నాన్న కూచిగా ఉంటున్నారు. క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా, నిర్మాతగా అన్నింటికీ వెంటే ఉన్నారు. మొత్తానికి ఈ కూతుళ్లు అంతా తండ్రులతో  నడుస్తూ.. తండ్రుల్ని సక్సెస్ ట్రాక్ ఎక్కించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారనే చెప్పాలి.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES