SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఆసక్తిరేకిస్తోన్న ‘ఛప్రి’ టీజర్.. సమ్మర్‌లో రాబోతున్న బండి సరోజ్ మూవీ..

Chapri Teaser talk: తెలుగులో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు బండి సరోజ్. ‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’ సినిమాలతో మెప్పించాడు. త్వరలో ‘ఛప్రి’ మూవీతో పలకరించాడు. తాజాగా విడుదలైనఈ మూవీ టీజర్ ‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 14, 2026, 12:06 IST | Updated: Nov 15, 2026, 12:09 IST
Image Credit: Chapri Movie (X/Source)
Join

Chapri movie: బండి సరోజ్ కుమార్ ప్రస్తుతం ‘ఛప్రి’ అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు.  ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, డైరెక్షన్ ఇలా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తున్నాడు.  BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ మీద సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మించారు.  ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ ‌తో పాటుగా ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీన్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ ఇతర పాత్రల్లో నటించారు. రీసెంట్‌గా ఈ మూవీ టీజర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో..బండి సరోజ్ కుమార్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఛప్రి’ సినిమాని వేసవిలో  విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.  కానీ ఈ మగాడు సీన్‌ని ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ లీక్ చేశాడు. నేను ఎంతో ట్రామాని అనుభవించిన విషయాన్ని ప్రస్తావించారు. అందుకే టీజర్‌ను ఇంత ఫాస్ట్‌గా వదిలినట్టు చెప్పారు. ఇండస్ట్రీలో, సెట్‌లో మాకు సెక్యూరిటీ లేదు. మీడియా లేకపోతే నేను లేను. నా ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేసిన జర్నలిస్టులందరికీ ధన్యవాదాలు. ఈ కథను 700 రోజులు కష్టపడి రాశాను. రివ్యూయర్లను కూడా దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన స్క్రీన్ ప్లేని రాసుకున్నట్టు తెలిపారు. కథకు తగ్గట్టుగా నాకు మంచి ఆర్టిస్టులు దొరికారు. ఆర్ట్ డైరెక్టర్ నాని నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ప్రమోద్ అన్న నాకు అండగా నిలిచిన విషయాన్ని ప్రస్తావించారు.  సమ్మర్‌లో అందరం  కలుద్దాం. ఈ సినిమాతో మనమేంటో అందరికీ తెలుస్తుందని ధీమాతో చెప్పారు.

నటుడు ప్రవీణ్ మాట్లాడుతూ.. ‘మోగ్లీ’ చిత్రంలో బండి సరోజ్ కుమార్‌ని చూసి నంబర్ తెలుసుకుని ఫోన్ చేసి మాట్లాడాను. సరోజ్ తో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ చాలా కొత్తగా ఉందన్నారు. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందన్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో ‘ఛప్రి’ రిలీజ్ కాబోతోంది. హీరోగా సరోజ్‌కి థియేట్రికల్‌గా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినిమా నటీనటులు, టెక్నిషియన్స్‌ ఈ సినిమా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES