• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /చిరు ముందు ముగ్గురు మొనగాళ్లు!..మెగావర్స్‌లో ఏం జరగబోతోంది..?

చిరు ముందు ముగ్గురు మొనగాళ్లు!..మెగావర్స్‌లో ఏం జరగబోతోంది..?

Chiranjeevi As Host: సిల్వర్ స్క్రీన్ పై తన నటనతో పాటు డాన్సరులతో ఉర్రూతలూగించారు మెగాస్టార్. అంతేకాదు యాక్షన్ హీరోగా ఓ వైపు అలరిస్తూనే కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఘనత చిరంజీవిదే. ఇలా దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు సరికొత్త అవతారంలో అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఇన్నాళ్లూ హీరోగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన చిరు.. మరోసారి హోస్ట్‌గా మారి ఓటీటీ వేదికపై సందడి చేయబోతున్నారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 29, 2026, 11:01 AM IST|Updated: Oct 29, 2026, 11:04 AM IST
joinshare
చిరు ముందు ముగ్గురు మొనగాళ్లు!..మెగావర్స్‌లో ఏం జరగబోతోంది..?
Image Credit: Chiranjeevi Megaverse (ZEE News Telugu/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
ఒక్కసారిగా కుప్పకూలిన వెండి ధరలు..కిలోపై ఎంత తగ్గిందంటే..? ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే లాభమా, నష్టమా?

ఒక్కసారిగా కుప్పకూలిన వెండి ధరలు..కిలోపై ఎంత తగ్గిందంటే..? ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే లాభమా, నష్టమా?

2

మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి ఇస్రో సిద్ధం.. రేపు రాత్రి నింగిలోకి GSLV-F18 రాకెట్‌..

3

Konda Surekha: కేటీఆర్‌పై వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా.. కొండా సురేఖ సంచలన ట్వీట్..!

4

నిర్మాతగా నిహారిక కొణిదెల దూకుడు.. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీ..

5

AP Diwali Ration: ఏపీలో రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక..నవంబరులో ఈ సరుకుల పంపిణీ!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Chiranjeevi New Innings: గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు ఓ సీజన్‌కు చిరు హోస్ట్‌గా వ్యవహరించారు. తాజాగా ఇపుడు మరోసారి నెట్‌ఫ్లిక్స్ కోసం హోస్ట్ అవతారం ఎత్తారు. తాజాగా ఈ సెలబ్రిటీ టాక్ షోకు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకొచ్చింది. 'మెగావర్స్' పేరుతో రూపొందుతున్న ఈ షో తొలి ఎపిసోడ్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైనట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా భారీ సెట్‌ను కూడా సిద్ధం చేశారు. అయితే ఈ షో గురించి వినిపిస్తున్న మరో క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు మెగా అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.

ఫస్ట్ ఎపిసోడ్‌లో ముగ్గరు స్టార్ కమెడియన్లు.. 
తొలి ఎపిసోడ్‌లోనే ముగ్గురు స్టార్ కమెడియన్లను రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది.  హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, నటుడు సునీల్, తన కామెడీతో ప్రస్తుతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సత్య.. ఈ ముగ్గురూ చిరంజీవి షోలో తొలి అతిథులుగా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.
నిజానికి చిరంజీవి, బ్రహ్మానందం కాంబినేషన్ అంటేనే తెలుగు ప్రేక్షకులకు ఓ మజా. వీరిద్దరూ కలిసి నటించిన ఎన్నో సినిమాల్లో కామెడీ సీన్స్ ఇరగదీశారు.

ఇక చిరంజీవితో సునీల్‌కు ఉన్న అనుబంధం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్లిద్దరి మధ్య వచ్చే సరదా సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. అందరివాడు, ఠాగూర్, జై చిరంజీవా సినిమాల్లో వీరి కామెడీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు వీరికి సత్య కూడా తోడవుతుండటంతో మెగావర్స్ తొలి ఎపిసోడ్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు చిరంజీవి ఛమక్కులు..  మరోవైపు బ్రహ్మానందం పంచ్‌లు.. మధ్యలో సునీల్ గారడీ.. సత్య చేసే అల్లరి.. ఇలా ఈ నలుగురూ ఒకే వేదికపై కనిపిస్తే నవ్వులకు కొదవ ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సినిమా విశేషాలతో పాటు పర్సనల్ విషయాలకు ప్రాధాన్యత.. 
ముఖ్యంగా ఈ షోలో కేవలం సినిమా విశేషాలకే పరిమితం కాకుండా.. గతంలో జరిగిన సరదా సంఘటనలు, షూటింగ్ సమయంలో ఎదురైన అనుభవాలు, ప్రేక్షకులకు తెలియని ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. చిరంజీవి తన అతిథులను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? వాళ్లు మెగాస్టార్ గురించి ఎలాంటి సీక్రెట్స్ బయటపెడతారు? అన్నది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.

చిరంజీవి కంటే బాలకృష్ణ షోకు దేశ వ్యాప్తంగా గుర్తింపు.. 
మరోవైపు నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన 'అన్‌స్టాపబుల్' ఓటీటీ వేదికపై ఎంతటి ఆదరణ సంపాదించుకుందో తెలిసిందే. అంతేకాదు మన దేశంలో అత్యంత పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు చిరంజీవి కూడా టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ రెండు షోల మధ్య పోలికలు రావడం సహజమే. అయితే తనదైన స్టైల్, హ్యూమర్, సెలబ్రిటీలతో ఉన్న అనుబంధంతో చిరు ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారనేది చూడాలి. అంతకు ముందు సమంత, జగపతిబాబు చేసినా.. చిరు స్థాయికి తగ్గ వాళ్లు కాదు. కానీ చిరుకు సమకాలీకుడైన బాలయ్య షోతో ఈ టాక్‌ షోకు పోల్చి చూసే అవకాశాలున్నాయి. 

చిరుకు భారీ పారితోషికం..

ఇక ఈ ప్రాజెక్ట్ కోసం మెగాస్టార్‌కు భారీ పారితోషికం అందుతున్నట్లు కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దాదాపు రూ. 100 కోట్లు.. ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 10 కోట్ల చెప్పునా.. ఫస్ట్ సీజన్‌లో పది ఎపిసోడ్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. రెమ్యునరేషన్ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.  ప్రస్తుతం చిరంజీవి ఓవైపు 'విశ్వంభర', 'కాకా' వంటి సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు ఈ టాక్ షో కోసం సమయం కేటాయిస్తున్నారు. 


మొత్తానికి వెండితెరపై మెగాస్టార్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న చిరంజీవి.. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను కూడా తనదైన శైలిలో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తొలి ఎపిసోడ్‌కే ముగ్గురు కామెడీ స్టార్లు వస్తున్నారనే వార్త నిజమైతే.. రాబోయే ఎపిసోడ్స్‌లో వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్ తో పాటు కొంత మంది రేవంత్, చంద్రబాబు సహా పలువురు రాజకీయ నాయకులు ఈ షోలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.  
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
OTT Movies
Telugu News
Telugu Movie