SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వారణాసిపై బిగ్ అప్డేట్..

Varanasi Update: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు ఒక అదిరిపోయే అప్‌డేట్. ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం 'వారణాసి' గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? ఇంకా ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మేకర్స్ ఇచ్చిన అప్‌డేట్‌తో ఈ ప్రశ్నలకు సమాధానం దొరికింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 19, 2026, 16:02 IST | Updated: Nov 19, 2026, 16:06 IST
Image Credit: Varanasi Update (Source/ZEE News Telugu)
Join

Varanasi Update:అవును.. 'వారణాసి' సినిమా షూటింగ్ పూర్తయింది. మేకర్స్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, CGI పనులపై చిత్రబృందం దృష్టి సారించింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ఇంకా ప్రారంభం కావాల్సి ఉందని మేకర్స్ తెలిపారు. అంతేకాదు, అభిమానులకు మరో భారీ సర్‌ప్రైజ్ ఉంటుందంటూ హింట్ కూడా ఇచ్చారు.

మరి ఆ సర్‌ప్రైజ్ ఏంటి? కొత్త గ్లింప్సా? టీజరా? లేక సినిమా నుంచి మరో కీలక అప్‌డేటా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర పాత్రతో పాటు శ్రీరాముడిగా రెండు విభిన్న పాత్రల్లో  కనిపించనున్నారు. హీరోయిన్‌గా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు.

ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే వాళ్ల అన్న కీరవాణి సంగీతం కొట్టాల్సిందే. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే.. ఇది సాధారణ కమర్షియల్ సినిమా స్థాయిలో కాకుండా, భారీ విజువల్ ప్రపంచంతో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ.ఇప్పటికే మహేష్ బాబు ఫస్ట్ లుక్, ప్రియాంక చోప్రా లుక్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని పెంచాయి.ఇక విడుదల విషయానికి వస్తే.. 2027 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తానికి షూటింగ్ పూర్తయింది.. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.. మరోవైపు రాజమౌళి సర్‌ప్రైజ్ అప్‌డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ రూ. 400 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. మరోవైపు తెలుగు ప్రీ రిలీజ్ దాదాపు రూ. 285 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. మిగిలిన ఏరియాల్లో థియేట్రికల్ బిజినెస్ డీల్ క్లోజ్ చేయాల్సి ఉంది. త్వరలో వాటిపై అప్‌డేట్స్ రానున్నాయి. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES