SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Bigg Boss 10 Telugu 2nd Week: 'బిగ్‌బాస్ 10' రెండో వారం ఓటింగ్ ఎలా ఉంది? ఈ వారం ఎలిమినేట్ అయ్యేది వీళ్లే! స్క్రిప్ట్ లీక్!

Bigg Boss 10 Telugu 2nd Week Nominations: తెలుగు బుల్లితెర చరిత్ర అత్యంత ప్రేక్షాకాదరణ పొందిన రియాలిటీ షోగా 'బిగ్‌బాస్' నిలిచిపోయింది. గత 9 సీజన్లలో అభిమానులను ఆకట్టుకున్న ఈ షో.. ఇప్పుడు 10వ సీజన్ విజయవంతంగా రన్ అవుతోంది. ఇప్పటికే తొలి వారంలో అనుకోని ఎలిమినేషన్స్‌తో షాక్‌కు గురిచేయగా.. ఇప్పుడు రెండో వారంలో నామినేషన్లపై తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే ఈ వారం ఎవరెవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.

Written By Harish Darla
Published: Sep 16, 2026, 12:32 PM IST | Updated: Sep 16, 2026, 12:38 PM IST
Join

Bigg Boss 10 Telugu 2nd Week Nominations: బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్ ఇప్పుడు విజయవంతంగా ప్రసారమవుతుంది. ఇప్పటికే ఒక వారం పూర్తవ్వగా.. రెండో వారంలోకి అడుగుపెట్టింది. అయితే తొలి వారంలో ఇద్దరు పోటీదారులను ఊహించని రీతిలో ఎలిమినేట్ చేయగా.. ఇప్పుడు రెండో వారంలో ఎవరెవరూ ఎలిమనేట్ అవుతారనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. 10వ సీజన్ దశావతారం కాన్సెప్ట్‌లో భాగంగా.. ఈ వారం నామినేషన్ల ప్రక్రియ సరికొత్తగా సాగింది. దీంతో బిగ్‌బాస్ పోటీదారుల మధ్య పోటీ మరింత తీవ్రమైంది. నామినేషన్లు ఎలా ఉన్నా.. వాటితో సంబంధం లేకుండా ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌ నుంచి ఎవరెవరూ ఎలిమినేట్ అవుతారనే దానిపై బిగ్‌బాస్ ఫ్యాన్స్‌లో చర్చ జరుగుతోంది.

ఇప్పటికే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 మొదటి వారంలో నామినేషన్లతో ఎలాంటి సంబంధం లేకుండా అందర్ని ఆశ్చర్యపరిచారు. తొలి వారమే ఒకర్ని కాకుండా ఏకంగా ఇద్దర్ని ఎలిమినేట్ చేసి బిగ్‌బాస్ చరిత్రలో తొలిసారి ఇలా చేయడం గమనార్హం. అయితే బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన ఇద్దరు పోటీదారులు ఓటింగ్‌తో సంబంధం లేకుండా షో నుంచి బయటకు పంపించడం ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. ఓటింగ్ తో సంబంధం లేకుండా అలా ఎలా ఇంటి నుంచి బయటకు పంపిస్తారని ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమైన బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా రెండో వారం ఓటింగ్‌తో సంబంధం లేకుండా ఎంతమందిని ఎలిమినేట్ చేయబోతున్నారనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. త్రిగుణ్, షాలినీ, ఝాన్సీ, రాంప్రసాద్, ముఖేష్, దేబ్జానీ, సుధీర్, కృష్ణుడు, సృష్టి, రోహిత్, వర్షిణి ఈ వారంలో నామినేషన్ లిస్టులో ఉండగా.. అమన్, వంశీ, నరేష్‌లు నామినేషన్ల నుంచి తప్పించుకున్నారు.

ప్రస్తుతం అందర్ని ఉత్కంఠ ఇప్పుడు ఓటింగ్‌పై ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ట్రెండ్ ప్రకారం.. త్రిగుణ్ ఓటింగ్‌లో టాప్‌లో దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. మొదటి వారం ఓటింగ్‌లో టాప్‌లో నిలిచిన రోహిత్.. ఇప్పుడు రెండో స్థానానికి పడిపోవడం గమనార్హం. అయితే వీరిద్దరి మధ్య ఓటింగ్ శాతం కేవలం 1 శాతమే ఉన్నట్లు సమాచారం. అయితే రాబోయే రోజుల్లో టాస్క్‌లను, ఆటను బట్టి ఇద్దరి ఓటింగ్ పర్సంటేజ్‌లు మారే అవకాశం ఉంది.

బిగ్‌బాస్ సీజన్ 10 తెలుగు ఓటింగ్స్‌ను పరిశీలిస్తే.. ప్రస్తుతం మూడో స్థానంలో సీరియల్ నటుడు ముఖేష్ కొనసాగుతున్నట్లు సమాచారం. అలాగే నాలుగో స్థానంలో జబర్దస్త్ రాంప్రసాద్ ఉండగా.. అతనికి కూడా ప్రేక్షకులలో క్రమంగా ఆదరణ పెరుగుతోంది. అలాగే ఓటింగ్స్‌లో ఐదో స్థానంలో పాడ్‌కాస్ట్ సుధీర్, ఆరో స్థానంలో షాలినీ, ఏడో స్థానంలో దేబ్జానీ.. ఇలా ఆ వరుసగా సృష్టి, ఝాన్సీ, వర్షిణి, కృష్ణుడు ఉన్నారు. అయితే ప్రస్తుత ఓటింగ్స్‌ను పరిశీలిస్తే.. చివర్లో ఉన్న యాంకర్ వర్షిణి, కృష్ణుడు డేంజర్ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఓటింగ్ ఎప్పుడైనా మారే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే వీరిద్దరూ సేఫ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

Also Read: 'విశ్వంభర' Vs 'కాకా'..సంక్రాంతి రేసులో మెగాస్టార్ రెండు సినిమాలు? చరిత్రలో తొలిసారి!

Also Read: Dhee Raju Arrest: 'ఢీ' డ్యాన్సర్ రాజు అరెస్ట్ కేసులో మరో ట్విస్ట్..తెరపైకి మరో అమ్మాయి పేరు!


 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES