SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Bigg Boss Neha Fathima: బిగ్‌బాస్‌లో లేడీ కంటెస్టెంట్ ప్రేమాయణం..ఏకంగా షో‌లోకి వచ్చేసిన తల్లీదండ్రులు..షాకింగ్ మూమెంట్!

Bigg Boss Malayalam Neha Fathima: మలయాళ ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్ సీజన్ 8' లో తీవ్ర ఉత్కంఠకరమైన, భావోద్వేగపూరిత ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నేహా ఫాతిమా, తోటి కంటెస్టెంట్ సంతోష్ రాజ్ (తాషి)ల మధ్య నడిచిన ప్రేమాయణం పెద్ద వివాదానికి దారితీసింది. వర్తమాన ఎపిసోడ్‌లో ప్రముఖ నటుడు మోహన్‌లాల్ నిర్వహిస్తున్న వేదికపైకి నేహా తల్లిదండ్రులు నేరుగా చేరుకుని తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.

Written By Harish Darla
Published: Nov 02, 2026, 06:43 PM IST | Updated: Nov 02, 2026, 06:46 PM IST
Join

Bigg Boss Malayalam Neha Fathima: మలయాళ 'బిగ్ బాస్ సీజన్ 8' లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన 20 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నేహా ఫాతిమా, మరో కంటెస్టెంట్ సంతోష్ రాజ్ (తాషి)తో సన్నిహితంగా ఉండటం చర్చనీయాంశమైంది. వయసులో తన కంటే పెద్దవాడైన తాషికి 150 కెమెరాల ముందే నేహా తన ప్రేమను వ్యక్తపరిచింది. అయితే, తమ తల్లిదండ్రులు అంగీకరిస్తేనే ఈ బంధాన్ని ముందుకు తీసుకెళ్తానని కూడా ఆమె స్పష్టం చేసింది.

బిగ్‌బాస్ వేదికపైకి నేహా తల్లిదండ్రులు..
ఈ జంట మధ్య నడిచిన కెమిస్ట్రీ నేహా ఫాతిమా తల్లిదండ్రులకు ఎంతమాత్రం నచ్చలేదు. దీంతో ప్రముఖ నటుడు మోహన్‌లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'వీకెండ్ కా వార్' ఎపిసోడ్‌లోకి నేహా తల్లిదండ్రులు నేరుగా చేరుకున్నారు. స్క్రీన్‌పై వారిని చూడగానే నేహా తీవ్ర భావోద్వేగానికి గురికాగా, ఆమె తల్లి కన్నీరు పెట్టుకుంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. "నేహా, నీకు ఇప్పటికీ నీ కుటుంబం గుర్తుందా? అసలు మేము గుర్తుకొస్తున్నట్లు కూడా మాకు అనిపించడం లేదు" అని ఆమె తండ్రి నిరాశతో ప్రశ్నించారు.

మిగతా వారందరూ గేమ్ ఆడుతుంటే నేహా అనవసరంగా భావోద్వేగాల్లో మునిగిపోతోందని, కొందరు ఆమెను గేమ్ కోసం వాడుకుంటున్నారని, తమ వద్దని చెప్పిన మార్గంలోనే వెళ్తోందని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కూతురు మానసికంగా దెబ్బతింటుందనే ఆందోళనతో, ఆమెను షో నుంచి బయటకు పంపించి తమ వెంట ఇంటికి తీసుకెళ్తామని తల్లిదండ్రులు పట్టుబట్టారు.

హోస్ట్ మోహన్‌లాల్ స్పందన - నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
నేహా తల్లిదండ్రుల ఆవేదనను చూసిన హోస్ట్ మోహన్‌లాల్ స్పందిస్తూ.. తాను కూడా ఒక కూతురికి తండ్రినేనని, ఇలాంటి పరిస్థితిలో తల్లిదండ్రుల ఆందోళనను సంపూర్ణంగా అర్థం చేసుకోగలనని చెప్పారు. అయితే నేహా ఫాతిమా షో నుంచి పూర్తిగా వైదొలిగిందా లేదా అనే అంశంపై అధికారిక వెల్లడి కావాల్సి ఉంది.

మరోవైపు ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేర్వేరు మతాలకు చెందిన నేహా, తాషిల సాన్నిహిత్యం వల్లే తల్లిదండ్రులు ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అదే సమయంలో, రియాలిటీ షో నిబంధనలకు విరుద్ధంగా కంటెస్టెంట్ తల్లిదండ్రులను లోపలికి అనుమతించడంపై మోహన్‌లాల్ తీరును కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నేహా ఫాతిమా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES