SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Bigg Boss Telugu 10: బిగ్ బాస్‌లో డబుల్ ఎలిమినేషన్ ఆయన ఇద్దరు కంటెస్టెంట్లు ఎంత సంపాదించారంటే?

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఐదో వారం డబుల్ ఎలిమినేషన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అపూర్వ, రీ ఎంట్రీతో హౌస్‌లోకి వచ్చిన చరణ్ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. అయితే వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్‌లో ఎన్ని వారాలు ఉన్నారు? వారానికి ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారు? అగ్నిపరీక్ష ద్వారా ఎంత సంపాదించారు? అపూర్వ, చరణ్ పారితోషికానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి.

Written By Vishnu Priya
Published: Oct 11, 2026, 02:12 PM IST | Updated: Oct 11, 2026, 03:37 PM IST
Join

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఐదో వారం ప్రేక్షకులకు ఊహించని షాక్ తగిలింది. ఈ వారం ఒక్కరు కాదు.. ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వచ్చారు. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన అపూర్వ, రీ ఎంట్రీతో మరోసారి అవకాశం దక్కించుకున్న చరణ్ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. దీంతో వీరిద్దరి బిగ్ బాస్ ప్రయాణం ముగిసింది. అయితే ఈ షోలో వీరు ఎంతకాలం ఉన్నారు? ఎంత పారితోషికం అందుకున్నారు? అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

అపూర్వకు ఎంత పారితోషికం వచ్చింది?

అపూర్వకు అంతకుముందు అగ్నిపరీక్ష కార్యక్రమం ద్వారా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం లభించింది. హౌస్‌లోకి వచ్చిన తర్వాత తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆమె ప్రయత్నించింది. కానీ ఆశించిన స్థాయిలో ఓట్లు సాధించలేకపోయింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, అపూర్వకు వారానికి సుమారు రూ.75 వేల పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె మూడు వారాల పాటు బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగింది. ఈ లెక్కన ఆమెకు మొత్తం రూ.2.25 లక్షల వరకు పారితోషికం లభించినట్లు సమాచారం. దీనికి ముందు అగ్నిపరీక్ష కార్యక్రమం ద్వారా కూడా ఆమె సుమారు రూ.50 వేలు సంపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మొత్తాలకు సంబంధించి షో నిర్వాహకులు అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. కాబట్టి ఇవి ప్రచారంలో ఉన్న అంచనాలుగానే చూడాలి.

అపూర్వ ఆటలో ఎక్కడ తప్పు జరిగింది?

వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి వచ్చిన వారికి తమ ఆటను నిరూపించుకోవడానికి తక్కువ సమయం ఉంటుంది. అందుకే ప్రతి టాస్క్‌లోనూ తమ ప్రతిభను చూపించడం చాలా ముఖ్యం. అపూర్వ కూడా ఇదే అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంది. కానీ హౌస్‌లో ఇతర కంటెస్టెంట్లతో జరిగిన గొడవలు, వాదనలు ఆమె ఆటపై ప్రభావం చూపినట్లు ప్రేక్షకులు భావించారు. కొన్ని సందర్భాల్లో ఆమె ప్రవర్తనపై విమర్శలు కూడా వచ్చాయి. టాస్కుల్లో తన సత్తా చాటడంతో పాటు ప్రేక్షకుల మద్దతు సంపాదించడంలో ఆమె వెనుకబడిపోయింది. ఫలితంగా ఐదో వారం ఎలిమినేషన్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది.

చరణ్ మొత్తం ఎంత సంపాదించాడు?

చరణ్ ప్రయాణం కూడా ఆసక్తికరంగానే సాగింది. అగ్నిపరీక్ష కార్యక్రమం నుంచి బిగ్ బాస్‌లోకి వచ్చిన అతను మొదటి వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు గురయ్యాడు. అయితే తర్వాత మరో అవకాశం దక్కించుకుని హౌస్‌లోకి తిరిగి ప్రవేశించాడు.‌ఈ రీ ఎంట్రీతో తన ఆటను మార్చుకుని ప్రేక్షకుల మద్దతు పొందుతాడని కొందరు ఆశించారు. కానీ అతను టాస్కుల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే అతని ఆట ప్రేక్షకుల దృష్టిని అంతగా ఆకర్షించలేకపోయింది. ప్రచారంలో ఉన్న లెక్కల ప్రకారం, అగ్నిపరీక్షతో పాటు బిగ్ బాస్ ప్రయాణం ద్వారా చరణ్‌కు మొత్తం రూ.3.25 లక్షలకు పైగా పారితోషికం లభించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్తంపై కూడా అధికారిక ప్రకటన లేదు.

ఐదో వారంలో ఇద్దరూ బయటకు రావడంతో..

బిగ్ బాస్‌లో ఒక్కసారి ఎలిమినేట్ అయిన తర్వాత మళ్లీ అవకాశం రావడం చాలా అరుదైన విషయం. చరణ్‌కు ఆ అవకాశం వచ్చినప్పటికీ దాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు. మరోవైపు అపూర్వ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన ప్రయోజనాన్ని అందిపుచ్చుకోలేకపోయింది.

Read More: Chiranjeevi: చిరంజీవి ఒక్క ఫోన్ కాల్‌తో సెన్సార్ సమస్యలు పరిష్కారమవుతాయా?

Read More: టాలీవుడ్‌లో నెగెటివ్ ప్రాపగాండా.. కులం, ప్రాంతం పేరుతో విభజన ఎందుకు?

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES