RRB NTPC Graduate Recruitment 2026: రైల్వే కార్యకలాపాలు, పరిపాలనా విభాగాలలో నియామకాల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ భారీ ప్రకటనను వెలువరించింది. మొత్తం నాలుగు కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గూడ్స్ ట్రైన్ మేనేజర్ (2,750 పోస్టులు), సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ (371 పోస్టులు), జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (300 పోస్టులు), చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ (127 పోస్టులు) ఈ నియామకాలను రైల్వేలోని కమర్షియల్, ట్రైన్ ఆపరేషన్స్, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ విభాగాలలో చేపడుతున్నారు.
పైన పేర్కొన్న పోస్టులకు 7వ కేంద్ర వేతన సంఘం (7th CPC) సిఫార్సుల ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు వేతనాలు చెల్లిస్తారు. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్: పే లెవల్ 6 కింద ప్రారంభ మూల వేతనం రూ. 35,400 లభిస్తుంది.
మిగిలిన మూడు పోస్టులు (గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్ పోస్టులకు పే లెవల్ 5 కింద ప్రారంభ మూల వేతనం రూ. 29,200 ఉంటుంది. వీటికి అదనంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.
అర్హతలు, వయోపరిమితి..
విద్యా అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: 2027 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం, ప్రత్యేక మినహాయింపు..
అభ్యర్థుల ఎంపిక రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ద్వారా జరుగుతుంది. అయితే, ఈసారి జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్ పోస్టులకు ముందస్తు టైపింగ్ స్కిల్ టెస్ట్‌ను మినహాయించారు. అభ్యర్థులు ఉద్యోగంలో చేరిన తర్వాతే వారి టైపింగ్ నైపుణ్యాన్ని పరిశీలిస్తారు.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: అక్టోబర్ 8
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 6 (రాత్రి 11:59 గంటల వరకు)
పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ: నవంబర్ 8
దరఖాస్తుల సవరణ (Correction) గడువు: నవంబర్ 9 నుండి నవంబర్ 18 వరకు
ఖాళీల పూర్తి వివరాల కోసం అభ్యర్థులు రైల్వే శాఖ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చు.