Bigg Boss Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ప్రియాంక గెలుపు కోసం ఒకప్పుడు శివ వెళ్లారు. ఇప్పుడు శివ విక్టరీ కోసం ప్రియాంక తిరుమల కొండెక్కడం విశేషం. అంతేకాదు తిరుమల శ్రీవారిని దర్శించుకొని శివ అందులో విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. స్వామివారి ఆశీస్సుల కోసం ఆమె వడ్డీకాసలువాడీ సన్నిధికి చేరుకున్నారు.
శివ కోసం ప్రియాంక జైన్ ప్రత్యేక పూజలు..
ప్రియాంక జైన్ తన తిరుమల యాత్ర వెనుక ఉన్న భావోద్వేగ కారణాన్ని సామాజిక మాధ్యమాల్లో ద్వారా వెల్లడించారు. గతంలో శివ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు, తన కోసం శివ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు ప్రియాంక జైన్. ఇప్పుడు అదే తరహాలో తాను కూడా శివ కోసం తిరుమలకు వెళ్లి స్వామివారికి మొక్కినట్టు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం తనకు ఎంతో రిలీఫ్ ఇచ్చిందని పేర్కొన్నారు.
ప్రియాంక జైన్ – శివ అనుబంధం మరోసారి హాట్ టాపిక్!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువైన ప్రియాంక జైన్, శివ పట్ల తన లవ్‌తో పాటు అభిమానాన్ని మరోసారి చాటుకోవడం విశేషం. బిగ్‌బాస్ ప్రయాణంలో ఒకరికొకరు అందించిన మద్దతు, వారి మధ్య ఉన్న అనుబంధం అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది. ఇప్పుడు శివ కోసం ప్రియాంక తిరుమల వెళ్లడం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
‘మౌనరాగం’ సీరియల్‌తో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన శివకుమార్, ప్రియాంక జైన్ జోడి షూటింగ్ సమయంలోనే లవ్‌లో పడ్డారు. పెళ్లికి ముందే కలిసి సహ జీవనం సహా పండుగలు, పూజలు కలిసి జరుపుకోవడంతో ఈ జంట ఎప్పుడూ వార్తల్లో హైలెట్ అవుతూ వస్తున్నారు. 7వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ప్రియాంక తన ఆటతీరుతో ఫైనల్ వరకు చేరుకుని మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్నారు. ఇక ఈ సీజన్‌లో (బిగ్‌బాస్ 10) వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి అడుగుపెట్టిన శివకుమార్, అద్భుతమైన తన ప్లానింగ్‌తో టాప్ కంటెస్టెంట్‌గా ఎదిగి టైటిల్ రేసులో ముందు వరసలో ఉన్నారు.