SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Bigg Boss Telugu 10: ప్రియుడు బిగ్‌బాస్‌ టైటిల్ గెలవాలని తిరుమల కొండ ఎక్కిన ప్రియాంక జైన్..

Bigg Boss Telugu 10 Winner: తెలుగు బిగ్‌బాస్‌ న్యూ సీజన్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. మరొ రెండు మూడు వారాల్లో బిగ్‌బాస్ సీజన్ 10 ఎండ్ కార్డ్ పడనుంది. ఈ నేపథ్యంలో ఈ సారి బిగ్‌బాస్ విజేతగా ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ హౌస్‌లో శివ విన్నర్‌గా గెలవాలని ఆమె ప్రియురాలు ప్రియాంక జైన్ ఏకంగా తిరుమల కొండకు నడుచుకుంటూ వెళ్లడం విశేషం.

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 26, 2026, 13:14 IST | Updated: Nov 26, 2026, 21:27 IST
Image Credit: Bigg Boss Telugu (Instagram/Source)
Join

Bigg Boss Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ప్రియాంక గెలుపు కోసం ఒకప్పుడు శివ వెళ్లారు. ఇప్పుడు శివ విక్టరీ కోసం ప్రియాంక తిరుమల కొండెక్కడం విశేషం. అంతేకాదు తిరుమల శ్రీవారిని దర్శించుకొని శివ అందులో విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. స్వామివారి ఆశీస్సుల కోసం ఆమె వడ్డీకాసలువాడీ సన్నిధికి చేరుకున్నారు.

శివ కోసం ప్రియాంక జైన్ ప్రత్యేక పూజలు..

 

 ప్రియాంక జైన్ తన తిరుమల యాత్ర వెనుక ఉన్న భావోద్వేగ కారణాన్ని సామాజిక మాధ్యమాల్లో ద్వారా వెల్లడించారు. గతంలో శివ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు, తన కోసం శివ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు ప్రియాంక జైన్. ఇప్పుడు అదే తరహాలో తాను కూడా శివ కోసం తిరుమలకు వెళ్లి స్వామివారికి మొక్కినట్టు తెలిపారు.  ఈ ఆధ్యాత్మిక ప్రయాణం తనకు ఎంతో రిలీఫ్ ఇచ్చిందని పేర్కొన్నారు.  

 


ప్రియాంక జైన్ – శివ అనుబంధం మరోసారి హాట్ టాపిక్!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువైన ప్రియాంక జైన్, శివ పట్ల తన లవ్‌తో పాటు  అభిమానాన్ని మరోసారి చాటుకోవడం విశేషం. బిగ్‌బాస్ ప్రయాణంలో ఒకరికొకరు అందించిన మద్దతు, వారి మధ్య ఉన్న అనుబంధం అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది. ఇప్పుడు శివ కోసం ప్రియాంక తిరుమల వెళ్లడం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

‘మౌనరాగం’ సీరియల్‌తో తెలుగు ఆడియన్స్‌కు  దగ్గరైన శివకుమార్, ప్రియాంక జైన్ జోడి షూటింగ్ సమయంలోనే లవ్‌లో  పడ్డారు. పెళ్లికి ముందే కలిసి సహ జీవనం సహా  పండుగలు, పూజలు కలిసి జరుపుకోవడంతో ఈ జంట ఎప్పుడూ వార్తల్లో హైలె‌ట్ అవుతూ వస్తున్నారు.  7వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ప్రియాంక తన ఆటతీరుతో ఫైనల్ వరకు చేరుకుని మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్నారు.  ఇక ఈ సీజన్‌లో (బిగ్‌బాస్ 10) వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్‌లోకి అడుగుపెట్టిన శివకుమార్, అద్భుతమైన తన ప్లానింగ్‌తో  టాప్ కంటెస్టెంట్‌గా ఎదిగి టైటిల్ రేసులో ముందు వరసలో ఉన్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES