SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బాలీవుడ్‌కు మళ్లీ ఊపు వచ్చింది.. వరుస బ్లాక్ బస్టర్స్‌తో బాక్సాఫీస్ కళకళ ..

Bollywood Track: గతేడాది దురంధర్ ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే కదా. అదే ఊపుతో ఈ యేడాది జనవరిలో వచ్చిన ‘బార్డర్ 2’ 2026కు మంచి శుభారంభం అందించింది. ఆ తర్వాత వచ్చిన ‘దురంధర్ 2’ బాలీవుడ్ గత రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఆ తరవాత కొన్ని సినిమాలు మాత్రం ఆశించిన ప్రయోజనాలు దక్కలేదు. కానీ మళ్లీ ఇపుడు హనుమాన్ అంశ్, మీర్జాపూర్, దృశ్యం కంక్లూజన్ చిత్రాలు బాలీవుడ్‌కు ఊపిరి పోసాయి.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 07, 2026, 07:19 AM IST | Updated: Oct 07, 2026, 07:24 AM IST
Image Credit: Bollywood Hits 2026 (File Pics/Source)
Join

Bollywood Sensation in 2026: ధురంధర్ 2 వచ్చింది.. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా రూ. 1800 కోట్లు కొల్ల గొట్టింది.  ఇక మాకు తిరుగులేదు ఇదే ఊపులో వచ్చిన అమీర్ ఖాన్ నిర్మాణంలో సన్ని దేవోల్ హీరోగా నటించిన ‘బట్వారా 1947’ సినిమా మాత్రం భారీ అంచనాలతో బాక్సాపీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. మొత్తంగా అంతా బాగుంటుందని కలలు కన్నారు బాలీవుడ్ మేకర్స్.. కానీ సీన్ రివర్స్ అవ్వడానికి ఎంతో టైమ్ పట్టలేదు. అదే రోజు విడుదలైన ‘ఆవారాపన్ 2’ చిత్రం బాక్సాపీస్ దగ్గర ఊహంచని భారీ విజయం సాధించింది. ఇక సీక్వెల్స్‌ రూపంలో వచ్చిన బోర్డర్ 2, ధమాల్ 4, భూత్ బంగ్లా, వెల్కమ్ టూ ది జంగిల్ లాంటి సినిమాలు మంచి  విజయాలు సాధించాయి.  ఇక అక్షయ్, సైఫ్ నటించిన ‘హైవాన్’ ఈ యేడాది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.

అంచనాలు లేకుండా సంచలన విజయాలు  సాధించిన ‘హనుమాన్ అంశ్’, ‘మీర్జాపూర్’, ‘ఆవారాపన్ 2’ చిత్రాలు..

బాలీవుడ్.. 2026లో ‘ధురంధర్ 2’ తర్వాత ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘హనుమాన్ అంశ్’ చిత్రం రూ. 2 కోట్లతో తెరకెక్కి.. రూ. 300 కోట్ల నెట్ వసూళ్లు.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో  బ్లాక్ బస్టర్‌కు బాప్‌గా నిలిచింది. అటు వెబ్ సిరీస్‌గా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘మీర్జాపూర్’ సినిమాగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాదాపు రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓ రకంగా సర్ఫ్రైజింగ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

దృశ్యం 3 వసూళ్ల సునామీ..

కానీ తాజాగా విడుదలైన ‘దృశ్యం 3’ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది. తొలి రోజు దాదాపు రూ. 66.75 కోట్ల నెట్ వసూల్లు.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. ఇక రెండు రోజు బాక్సాఫీస్ దగ్గర మన దేశంలో రూ. 52 కోట్ల నెట్ వసూళ్లు.. ఆదివారం రోజు కూడా దాదాపు రూ. 60.50 కోట్లకు పైగా రాబట్టింది. మొత్తంగా మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 170 కోట్ల నెట్ వసూల్లు రాబట్టింది. ఇక సోమవారం రూ. 21 కోట్లు.. మంగళవారం.. రూ. 20 కోట్లు రాబట్టినట్టు సమాచారం. మొత్తంగా ఐదు రోజుల్లో రూ. 215 కోట్ల నెట్ వసూళ్లు.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

రామాయణ, కింగ్, మాతృభూమి సినిమాలపై ఆశలు..

ఇక రాబోయే రోజుల్లో దీపావళికి ‘రామాయణ పార్ట్ -1’ సినిమాపై భారీ అంచనాలే  ఉన్నాయి. మరోవైపు బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన సల్మాన్ ‘మాతృభూమి’కి సెన్సార్ క్లియరెన్స్ అయితే  నవంబర్ రెండో వారంలో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.  షారుక్ ఖాన్ కింగ్ సినిమా డిసెంబర్ 24న వస్తుందని చెబుతున్నారు. అందులో క్లారిటీ లేదు.  ఏది ఏమైనా బాలీవుడ్‌లో మళ్లీ ‘దురంధర్2’ తరహా మ్యాజిక్ రావాల్సిందే.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES