ZEE Entairment@34Years: దూరదర్శన్ తప్పించి మరో వినోద మాధ్యమం అంటూ తెలియని భారతీయ ప్రేక్షకులకు సరిగ్గా 34 యేళ్ల క్రితం ప్రైవేటు టెలివిజన్ ఛానెల్‌గా ప్రారంభమైన జీ ఎంటర్మైన్మెంట్ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించింది. అందిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తన తాను అప్‌డేట్ చేసుకుంటూ జీ ప్రస్థానం విషయానికొస్తే.. ఇంతింతై అన్నట్టుగా సాగి ఎన్నో ప్రైవేటు ఛానెల్స్ మన దేశంలో రావడానికి దోహదం చేసిందనడంలో ఎలాంటి డౌటు లేదు. ఈ సందర్భంగా జీ ఎంటర్టైన్మెంట్ 34 యేళ్ల ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్..
Actress: బాలీవుడ్ నటి ఉర్వశి రౌటేలా పేరు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా ఉపయోగించారనే ఆరోపణలతో కొత్త వివాదం మొదలైంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థపై ఉర్వశి టీమ్ న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంలో ఏకంగా రూ.7,000 కోట్ల నష్టపరిహారం కోరుతున్నట్లు ఆమె టీమ్ పేర్కొంది.
Rakul Preet Singh IT Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు జరగడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రకుల్‌తో పాటు నిర్మాత వాసు భగ్నానీ, పానోరమా స్టూడియోస్‌కు సంబంధించిన పలు ప్రాంతాల్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.
Komal rani fires on govinda wife: గత కొన్నేళ్లుగా సునీతా అహుజా గోవింద పతనం కోసం మాత్రమేపనిచేస్తుందని, అలాంటి మహిళ చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని కోమల్ రాణి చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో సునీతా అహుజాపై సంచలన ఆరోపణలు చేసింది.
Love And War:సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లవ్ అండ్ వార్’. ఈ సినిమా నుంచి మెయిన్ క్యారెక్టర్స్ కు సంబంధించి పోస్టర్స్‌ను రిలీజ్ చేస్తూ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి విక్కీ కౌశల్ పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.
Love & War Alia Bhatt Look Goes Viral: బాలీవుడ్‌లో సున్నితమైన ప్రేమ కథ చిత్రాలను తెరకెక్కించడంలో సంజయ్ లీలా భన్సాలీకి ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా ఈయన నిజ జీవిత భార్యాభర్తలైన రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. ఈ చిత్రంలో విక్కీ కౌశల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రణ్‌బీర్ కపూర్‌కు సంబంధించిన లుక్‌ను విడుదల చేసి ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఆలియా భట్ లుక్‌ను విడుదల చేశారు.
Ranbir Kapoor Love & War: ‘యానిమల్’ మూవీ తర్వాత రణ్‌బీర్ కపూర్ ఇమేజ్ పూర్తి మారిపోయింది. ఆ సినిమా తర్వాత మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడి వేషంలో ‘రామాయణ’ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. ఫస్ట్ పార్ట్ దీపావళి కానుకగా విడుదల కానుంది. రెండో భాగం వచ్చే యేడాది దీపావళి కానుకగా రాబోతుంది. ఈ రెండు సినిమాల మధ్య ‘లవ్ అండ్ వార్’ మూవీతో పలకరించబోతున్నాడు.
‘లస్ట్ స్టోరీస్’లో కియారా అద్వానీ నటించిన వివాదాస్పద సీన్‌పై రాధిక మదన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో విమర్శలు వచ్చినా కరణ్ జోహార్ వెనక్కి తగ్గకుండా ఆ కథను చెప్పిన విధానాన్ని ఆమె ప్రశంసించారు.