SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kaaka Movie: చిరంజీవి కాకా రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతికి మెగాస్టార్ సినిమా రావడం పక్కా!

Kaaka Movie: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే వార్త వచ్చింది. ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘కాకా’ విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు ఇప్పుడు తెరపడింది. ఈ సినిమా వాయిదా పడుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై రచయిత కోన వెంకట్ స్పందించారు. ముందుగా ప్రకటించిన తేదీకే సినిమా థియేటర్లలోకి వస్తుందని స్పష్టం చేశారు. దీంతో మెగా అభిమానుల్లో మళ్లీ సినిమా విడుదలపై ఆసక్తి పెరిగింది.

Written By Vishnu Priya
Published: Nov 06, 2026, 08:03 PM IST | Updated: Nov 06, 2026, 08:11 PM IST
Join

Kaaka Movie: చిరంజీవి హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో ‘కాకా’ సినిమా తెరకెక్కుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం మొదటి నుంచే ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా జనవరి 13, 2027ను విడుదల తేదీగా ప్రకటించారు. అయితే ఇటీవల ఈ సినిమా వాయిదా పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించాయి.

చిరంజీవి నటిస్తున్న మరో సినిమా ‘విశ్వంభర’ కూడా విడుదలకు సిద్ధమవుతుండటంతో ఈ ప్రచారం మొదలైంది. ‘విశ్వంభర’ సినిమాను సంక్రాంతికి తీసుకురావాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారనే వార్తలు వచ్చాయి. దీంతో ‘కాకా’ విడుదల తేదీ మారుతుందనే చర్చ మొదలైంది. ఈ రెండు సినిమాల్లో ఏది ముందుగా విడుదలవుతుందనే సందేహం అభిమానుల్లో నెలకొంది.

ఈ నేపథ్యంలో కోన వెంకట్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘కాకా’ సినిమా గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని చెప్పారు. జనవరి 13న సినిమా థియేటర్లలోకి వస్తుందని మరోసారి స్పష్టం చేశారు. సంక్రాంతికి ‘కాకా’ వచ్చి అసలైన పండగ తీసుకొస్తుందని తన పోస్టులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను కూడా పంచుకున్నారు. దర్శకుడు బాబీ, నిర్మాణ సంస్థను కూడా తన పోస్టులో ట్యాగ్ చేశారు.

ఇక ఈ సినిమాలో చిరంజీవి రెండు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించనున్నట్లు సమాచారం. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధం, భావోద్వేగాలు ఈ కథలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్ నటిస్తోంది. నివేదా పేతురాజ్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కోన వెంకట్ కథా రచనతో పాటు స్క్రీన్‌ప్లే బాధ్యతలు కూడా చూస్తున్నారు.

Read More: Amitabh House Bomb Threat: ముంబైలో మరోసారి బాంబు కలకలం..ఏకంగా అమితాబ్ బచ్చన్ ఇంటికే స్పాట్ పెట్టిన దుండగులు!

 

Read More:‘సమ్మర్ హాలీడేస్’ తెలుగు మూవీ రివ్యూ రేటింగ్.. మెప్పించిందా..!!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  

ZEENEWS TRENDING STORIES