Sekhar master responds on car accident tragedy: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ఈ రోజున తెల్లవారు జామున శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ వద్ద ప్రమాదంకు గురైంది. పండ్లతో వెళ్తున్న భారీగా లారీ శేఖర్ మాస్టర్ టీమ్ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా బోల్తాపడింది. వెంటనే ఆయన మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ విషయం బైటకు రావడంతో శేఖర్ మాస్టర్ అభిమానులు, టాలీవుడ్ ప్రముఖులు సైతం తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తాజాగా.. కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్పందించారు. ప్రమాద ఘటనపై వీడియోను సైతం విడుదల చేశారు.
అయ్యప్ప స్వామి దయ వల్ల పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం. నిన్న రాత్రి షూటింగ్ ముగించుకుని వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. అయితే స్వామి దయవల్ల కారులో ఉన్నవారిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. - శేఖర్ మాస్టర్ https://t.co/VqCgAn7mlT
— greatandhra (@greatandhranews) November 12, 2026
శేఖర్ మాస్టర్ కారు ప్రమాదంపై మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి వల్ల తనతో పాటు తన టీమ్ పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డామని చెప్పుకొచ్చారు. కారు ప్రమాదం జరిగిన సమయంలో తనతో పాటు నలుగురు ఉన్నాయని ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదని క్లారిటీ ఇచ్చారు. కారు మాత్రం కొంచెం నుజ్జు నుజ్జు అయ్యిందన్నారు.
కానీ అందరు సేఫ్ గా ప్రమాదం నుంచి బైటపడ్డామన్నారు. అయ్యప్ప స్వామి దయ వల్ల పెద్ద ప్రమాదం తప్పిపోయిందని, తన అభిమానులకు,శ్రేయోభిలాషులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మీ అందరి అభిమానం ఎప్పుడు తనపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మరల సాంగ్ షూటింగ్ కు వెళ్తున్నట్లు మాట్లాడారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.