SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

డీ గ్లామర్ రోల్స్‌కు ఓకే చెబుతున్న హీరో, హీరోయిన్లు..

De Glamour Roles: ఇండస్ట్రీలో హీరోయిన్లకు సాలిడ్ హిట్ కొట్టి స్టార్‌డమ్ దక్కించుకోవాలంటే కేవలం గ్లామర్ షో చేస్తే సరిపోదా..? సమంత, రష్మికల బాటలోనే ఇప్పుడున్న హీరోయిన్లు కూడా డీ గ్లామర్ రోల్స్ చేస్తేనే కెరీర్ సెట్ అవుతుందని బలంగా నమ్ముతున్నట్టు తెలుస్తుంది. రా అండ్ రస్టిక్ క్యారెక్టర్లలో జీవిస్తేనే అవార్డులతో పాటు ప్రేక్షకుల గుండెల్లో పర్మనెంట్ ప్లేస్ సంపాదించవచ్చని భావిస్తున్నట్టు కనిపిస్తుంది. మొత్తంగా కొత్త ట్రెండ్‌ ఏంటో చూద్దామా..?

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 19, 2026, 01:48 PM IST | Updated: Oct 19, 2026, 01:50 PM IST
Image Credit: De glamour Roles (File/Source)
Join

Telugu heroins De Glamour Roles: సమంత, రష్మిక మందన్నలు స్టార్ హీరోయిన్స్‌గ చెలరేగిపోతున్నారు. ‘రంగస్థలం’ వచ్చి 8 ఏళ్లు దాటినా.. రామలక్ష్మిగా సమంత చేసిన మాయ ఎవరు మరిచిపోలేదు. ఇక ‘పుష్ప’ వచ్చి మూడేళ్లైపోయినా శ్రీవల్లిగా రష్మిక పోషించిన డీ గ్లామర్ పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారు. ఈ సినిమాలు  వాళ్ల కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పాయి. కేవలం గ్లామర్ రోల్స్ చేయడం కంటే మట్టి వాసన ఉండే సహజమైన పాత్రలు చేస్తేనే హీరోయిన్ల కెరీర్ దూసుకుపోతుందనడానికి ఈ సినిమాలు పెద్ద ఎగ్జాంపుల్. ఇక రాబోయే ‘మైసా’ సినిమాలో రష్మిక మందన్న అడవి అమ్మాయి పాత్రలో డీ గ్లామర్ పాత్రలో కనిపించబోతుంది. అటు ‘రణబాలి’ సినిమాలో  ఆ ఫార్ములానే టాలీవుడ్ హీరోయిన్లందరినీ డీ గ్లామర్ వైపు అడుగులు వేసేలా చేస్తోంది.

భోగిలో డీ గ్లామర్ పాత్రలో అనుపమ.. 
శర్వానంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న ‘భోగి’ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ సులోచన అనే పల్లెటూరి యువతిగా మేకప్ లేకుండా నాచురల్‌గా కనిపించబోతుంది.  ఇదే సినిమాలో డింపుల్ హయాతీ సైతం డీ గ్లామర్ పాత్రలోనే నటిస్తోంది.

రౌడీ జనార్దన..

కీర్తి సురేష్ సైతం ‘రౌడీ జనార్ధన’లో రొటీన్ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ చాలా ఇంటెన్స్ అండ్ డీ గ్లామర్ లుక్‌తో కనిపించుంది. అలాగే ఐశ్వర్య లక్ష్మి ‘సంబరాల ఏటిగట్టు’లో పక్కా డీ గ్లామర్ రోల్‌లో కనిపించబోతుంది.  మొత్తానికి టెంపరరీ గ్లామర్ కంటే పర్మినెంట్‌గా ఉండే మట్టికథలే హీరోయిన్ల కెరీర్‌కు మైలేజ్ ఇస్తాయని ఈ సినిమాలే స్పష్టం చేస్తున్నాయి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES